ప్రధాన మంత్రి కార్యాలయం
మునిసిపల్ ఘన వ్యర్థాల ఆధారిత గోబర్ -ధన్ ప్లాంట్‌ను ఫిబ్రవరి 19న ఇండోర్ లో ప్రారంభించనున్న ప్రధానమంత్రి
చెత్తరహిత నగరాలకు సంబంధించి ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంది.
వ్యర్థాలనుంచి సంపద, చక్రీయ ఆర్థికత సూత్రాలను బయో- సిఎన్‌జి ప్లాంట్ ఉదాహరణగా నిలుస్తుంది.
రోజుకు 550 టన్నుల ఆర్గానిక్ వ్యర్థాలను వేరు చేసే సామర్ధ్యం ఈ ప్లాంటుకు ఉంది.
ఇది రోజుకు 17,000 కెజీల సిఎన్‌జిని , రోఉకు 100 టన్నుల ఆర్గానిక్ కంపోస్టును ఉత్పత్తి చేస్తుంది.
Posted On:
18 FEB 2022 6:55PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గోబర్ -ధన్ (బయో -సిఎన్‌జి) ప్లాంటును ఫిబ్రవరి 19 మధ్యాహ్నం 1 గంటకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారు.
చెత్త రహిత నగరాలను తీర్చిదిద్దే దార్శనికతలో భాగంగా ,
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ 2.0 ను ప్రారంభించారు.
వనరుల పునరుద్ధరణను పెంపొందించడం కోసం "వృధా నుండి సంపదష , చక్రీయ ఆర్థిక వ్యవస్థ" అనే విస్తృత సూత్రాల కింద ఈ మిషన్ ను అమలు చేస్తారు- ఈ రెండూ ఇండోర్ బయో- సిఎన్ జి ప్లాంట్‌లో ఉదాహరణగా నిలుస్తాయి.ఈ ప్లాంట్‌లో రోజుకు 550 టన్నుల తడి సేంద్రీయ వ్యర్థాలను శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. ఇది రోజుకు 17,000 కిలోల సిఎన్‌జిని , రోజుకు 100 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ ప్లాంట్ జీరో ల్యాండ్‌ఫిల్ నమూనాపై ఆధారపడినది. దీని నుంచి ఇతర వ్యర్థాలు ఉత్పత్తి కావు. దీనికి తోడు ఈ, ప్రాజెక్ట్ బహుళ విధ పర్యావరణ ప్రయోజనాలను కలిగిఉంటుందని భావిస్తున్నారు, . గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు, ఎరువుగా సేంద్రీయ కంపోస్ట్‌తో పాటు గ్రీన్ ఎనర్జీని అందించడం ఇందులో ముఖ్యమైనవి.
ఈ ప్రాజెక్ట్ అమలు కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ను ఇండోర్ మునిసిపల్ కార్పొరేషన్ (IMC) ,ఇండో ఎన్విరో ఇంటిగ్రేటెడ్ సొల్యూషన్స్ లిమిటెడ్ లు ఏర్పాటు చేశాయి. దీనిని పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య నమూనాలో ఏర్పాటు చేశారు. 150 కోట్ల రూపాయలతో 100 శాతం మూలధన పెట్టుబడితో ఇది ఏర్పాటైంది. . ఈ ప్లాంట్ లో ఉత్పత్తి అయిన సిఎన్ జిలో కనీసం 50 శాతాన్ని ఇండోర్ మునిసిపల్ కార్పోరేషన్ కొనుగోలు చేస్తుంది . అలాగే తొట్టతొలి చర్యగా సిఎన్‌జితో 250 సిటీ బస్సులను నడుపుతుంది. మిగిలిన సిఎన్‌జిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తుంది.సేంద్రీయ కంపోస్ట్ను వ్యవసాయ ,ఉద్యానవన అవసరాల కోసం రసాయన ఎరువుల స్థానంలో ఉపయోగించడానికి వీలు కలుగుతుంది.
(Release ID: 1799570)
Visitor Counter : 163
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam