వ్యవసాయ మంత్రిత్వ శాఖ

భారత ఆహార శుద్ధి విధానాలను ఉపయోగించుకోవాలని దుబాయ్ ఎక్స్ పో లో అంకుర సంస్థలకు పిలుపు


భారత పెవిలియన్ లో తృణధాన్య ఆహారోత్సవం

Posted On: 18 FEB 2022 1:49PM by PIB Hyderabad

భారతదేశంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వాడుకోవాలని, వ్యవసాయ, అనుబంధ రంగాలలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని  దుబాయ్ లో జరుగుతున్న ఎక్స్ పో 2020-దుబాయ్ లో వ్యవవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలక్ష లిఖి పిలుపునిచ్చారు. అంకుర సంస్థలు, రైతు ఉత్పత్తుదారు సంస్థలు తమ ప్రతిపాదఫానాలు మంత్రిత్వశాఖలకు పంపాలని కోరారు. పెట్టుబడి గ్రాంట్, యాజమాన్య ఖర్చులు ఇవ్వటంతో సహా ఇతర సహాయం అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

ఎక్స్ పో 2020 దుబాయ్ లో ‘ఆహారం, వ్యవసాయం, జీవనోపాధి’ అనే అంశంతో ఎక్స్ పో 2020 దుబాయ్ పకసహోత్సవాలలో లో  భారత పెవిలియన్ లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ శుభా ఠాకూర్, ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ సంస్థ గ్రూప్ ప్రెసిడెంట్ శ్రీ టీ ఆర్ కేశవన్, కె పి ఎం జి పార్టనర్ శ్రీ శ్రీనివాస్ కూచిభొట్ల తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఫిబ్రవరి- మార్చి 2 మధ్య నడుస్తున్న ఆహారం, వ్యవసాయం, జీవనోపాధి పక్షోత్సవాలలో జరిగే వివిధ సదస్సులలో వ్యవసాయ, రైతు  సంక్షేమ మంత్రిత్వశాఖ, మత్స్యా భివృద్ధి మంత్రిత్వశాఖ, పశుగణాభివృద్ధి మంత్రిత్వశాఖ, సహకార మంత్రిత్వశాఖ అధికారులు పాల్గొన్నారు.  ఈ పక్షోత్సవాలకోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. తృణ ధాన్యాలు, ఆహార శుద్ధి, ఉద్యానవన అభివృద్ధి, పాడి, మత్స్యాభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయంలో విస్తృతమైన అవకాశాలున్నాయని  తెలియజెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు.    

ఈ ప్రదర్శనలో  పాల్గొనటంలో ప్రాధమిక లక్ష్యం చిన్న, మధ్య  తరహా రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా ఎదగటానికి, వ్యాపారాన్ని ఎన్నో రెట్లు పెంచుకోవటానికి అవకాశాలు కల్పించటం. అనేక వేదికలు ఒకచోటుకు రావటానికి స్వదేశీ, విదేశీ మార్కెట్ల మధ్య సమన్వయం సాధించటానికి ఈ ప్రదర్శన ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ లిఖి అన్నారు.   

వ్యవసాయ, రైతుసంక్షేమ మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ శుభా ఠాకూర్ మాట్లాడుతూ, భారత రైతులు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు కేవలం భారత్ ను నిలబెట్టటమే కాకుండా ప్రపంచానికే ఆహార భద్రత ఇస్తుందన్నారు.  మొదటి వారం తృణ ధాన్యాల మీద దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక మీద ఆరోగ్యం, పౌష్ఠికాహారంలో తృణధాన్యాల పాత్రను, ఔన్నత్యానికి  వివరించటానికి ఇది సరైన అవకాశమన్నారు. భారతదేశం తొమ్మిది ప్రధాన తృణధాన్యాలను పండిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా భారత్ కు పేరుంది. 2023 ను అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరంగా ఇటీవలే భారత్ ప్రతిపాదించిన తీర్మానాన్ని 70 దేశాలు మద్దతునివ్వగా ఐక్యరాజ్యసమితి స్వీకరించింది.

భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం, అనుబంధ రంగాలు వెన్నెముకగా నిలవగా మొత్తం ఎగుమతులలో వాటా 19%. 2021-22 లో  ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 316.06 మిలియన్ టన్నులు ఉంటుందని అంచనావేశారు.

***



(Release ID: 1799374) Visitor Counter : 112