మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
వయోజన విద్యకు సంబంధించి కొత్త పథకం, న్యూ ఇండియా లిటరసీ (నవభారత్ సాక్షరతా కార్యక్రమాన్ని) 2022-27 ఆర్థిక సంవత్సరాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వయోజన విద్య స్థానంలో ,అందరికీ విద్య పదాన్ని చేరుస్తారు.
Posted On:
16 FEB 2022 5:57PM by PIB Hyderabad
2021-22 బడ్జెట్ లో ప్రకటించిన విధానానికి అలాగే నూతన విద్యావిధానం 2020 కి అనుగుణంగా వయోజన విద్యకు సంబంధించిన వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ ప్రభుత్వం, 2022-27 ఆర్థిక సంవత్సరాలకు న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం ( నవభారత్ సాక్షరతా కార్యక్రమం) పేరుతో ఒక కొత్త పథకానికి ఆమోదం తెలిపింది. 2020 నూతన విద్యావిధానం కింద వయోజన విద్య, జీవిత పర్యంత అభ్యసనానికి సంబంధించి పలు సూచనలు ఉన్నాయి.
2021-22 కేంద్ర బడ్జెట్ లో వనరుల అందుబాటును పెంచుతూ ప్రకటన చేశారు. అలాగే వయోజన విద్యకు సంబంధించి మొత్తం కవర్ అయ్యే విధంగా ఆన్ లైన్ మాడ్యూల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు.
ఈ పథకం లక్ష్యం, ప్రాథమిక స్థాయిలో అక్షరాస్యతను , లెక్కింపును పరిచయం చేయడమే కాకుండా 21 వ శతాబ్దపు పౌరుడికి అవసరమైన విధంగా జీవన నైపుణ్యాలకు ( అంటే ఆర్థిక అంశాల అక్షరాస్యత, డిటిటల్ అక్షరాస్యత, వాణిజ్య అక్షరాస్యత, ఆరోగ్య సంర్షణ, అవగాహన, శిశు సంరక్షణ, విద్య, కుటుంబ సంక్షేమం) కూడా వర్తింప చేస్తారు . వృత్తి విద్యా నైపుణ్యాలు( స్థానిక ఉపాధి ని పొందే దిశగా), మౌలిక విద్య( ప్రిపరేటరి, మిడిల్, సెకండరీ స్థాయికి సమానమైన రీతిలో) అందిస్తారు. అలాగే నిరంతర విద్య అందేలా చూస్తారు (ఆర్ట్స్, సైన్సెస్, టెక్నాలీ , కల్చర్, క్రీడలు, వినోదం,అలాగే వారికి ఆసక్తి కలిగించే ఇతర అంశాలపై స్థానికంగా వారికి ఉపయోగపడే రీతిలో మరింత కీలక ఆధునిక జీవన నైపుణ్యాలను అందిస్తారు.)
ఈ పథకాన్ని ఆన్‌లైన్ విధానంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పద్ధతిలో అమలు చేస్తారు. శిక్షణ, పునశ్చరణ, వలంటీర్ల వర్క్‌షాప్‌లను ముఖా ముఖి విధానంలో ఏర్పాటు చేయవచ్చు. ఇందుకు సంబంధించిన మెటీరియల్, రిసోర్సులు నమోదు చేసుకున్న వలంటీర్లందరికీ అందుబాటులో ఉంచే విధంగా డిజిటల్ విధానంలో సులభంగాఅంటే టివి, రేడియో, సెల్‌ఫోన్ ఆధారిత ఫ్రీ , ఓపెన్ సోర్సు యాప్‌లు పోర్టల్ ల ద్వారా అందుబాటులో ఉండేట్టు చూస్తారు.
ఈ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 15 సంవత్సరాలు పైబడిన , అక్షరాస్యత లేని వారికి వర్తిస్తుంది. 2022-27 ఆర్థిక సంవత్సరానికి పునాది విద్య, న్యూమరిసి అవగాహనకు సంబంధించి, సంవత్సరానికి కోటి మంది వంతున 5 కోట్ల మందికి , ఆన్ లైన్ బోధన, అభ్యసన అసెస్‌మెంట్ వ్యవస్థ (ఒటిఎల్ ఎఎస్)ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ , ఎన్ సిఇఆర్ టి , ఎన్ ఐఒ ఎస్ ను ఉపయోగించి బోధనను అందించనున్నారు. ఇందుకు ఆసక్తి కలిగిన వారు తమ పేరు , పుట్టిన తేదీ, ఆధార్ సంఖ్య, మొబైల్ నెంబర్, స్త్రీ లేదా పురుషుడా అన్న సమాచారం ఇస్తే సరిపోతుంది.
న్యూ ఇండియా లిటరసి కార్యక్రమానికి మొత్తం కేటాయింపులు 1037.90 కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర వాటా 700 కోట్ల రూపాయలు, రాష్ట్ర వాటా 337.90 కోట్లరూపాయలు . ఇది 2022-27 ఆర్ధిక సంవత్సరాలకు వర్తిస్తుంది.
ఈ పథకం ముఖ్యాంశాలు...
--ఈ పథకం అమలుకు పాఠశాలను యూనిట్‌గా తీసుకుంటారు.
--లబ్దిదారులు, వలంటరీ టీచర్లకు సంబంధించి సర్వే నిర్వహించడానికి పాఠశాలలను ఉపయోగిస్తారు.
--వివిధ వయసులవారికి వివిధ వ్యూహాలు అమలు చేస్తారు. వినూత్న కార్యకలాపాలు చేపట్టడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వెసులుబాటు కల్పిస్తారు.
--కీలక జీన నైపుణ్యాలకు సంబంధించి ప్రాథమిక అక్షరాస్యత, గణితాన్ని 15 సంవత్సరాలకు పైబడిన నిరక్షరాస్యులకు దీనిని వర్తింపచేస్తారు.
--ఈ పథకాన్ని విస్తృతంగా అమలు చేసేందుకు టెక్నాలజీ ని విస్తృతంగా వినియోగించనున్నారు.
--రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, జిల్లాస్థాయిలో రూపొందించే పనితీరు అంచనా ఇండెక్స్ (పిజిఐ), ఏటా జిల్లా, రాష్ట్రస్తాయిలో పథకం పనితీరును, భౌతికంగా, ఆర్థిక అంశాలకు సంబంధించిన పురోగతిని యుడిఐఎస్ ఇ పోర్టల్ ద్వారా సూచిస్తారు.
--సిఎస్ఆర్, దాత్రుత్వ మద్దతును అందుకోవచ్చు. ఐసిటి మద్దతు, వలంటీర్ల మద్దతు, అభ్యసనపరులకు సదుపాఆయల కల్పన, ఐటి ని ఆర్థికంగా బలహీన వర్గాల అభ్యసన పరులకు సెల్‌పోన్ తదితరాల ద్వారా అందుబాటులోకి తేవడం,
అక్షరాస్యతలో ప్రాధాన్యత, శాచురేషన్ - 15నుంచి 35 సంవత్సరాల మధ్య వారికి ముందు ప్రాధాన్యత ఆతర్వాత 35 సంవత్సరాలు అంతకు పైబడిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.అలాగే ముందు బాలికలు మహిళలు, ఎస్ సి, ఎస్‌టి,ఒబిసి, మైనారిటీలు, దివ్యాంగులు, సంచార జాతులు, భవన నిర్మాణ కార్మికులు,వంటి వారికి ప్రాధాన్యత ఇస్తారు.
--ప్రాంతం, విషయంలో నీతిఆయోగ్ వారి అన్ని ఆకాంక్షిత ఇల్లాలు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో 2011 గణాంకాల ప్రకారం మహిళా అక్షరాస్యత 60 శాతం కన్న తక్కువ వున్న ప్రాంతాలు, అలాగే ఎస్ సి , ఎస్ టి, మైనారిటీ ప్రజలు, విద్యాపరంగా వెనుకబడిన బ్లాకుల, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతారు.
ఎన్ ఐ ఎల్ పి సమర్ధ అమలుకు సంబంధించి ఆయా మంత్రిత్వశాఖలు, విభాగాలతో సమన్వయంః
ఎం.ఇ.ఐటి వై: డిజిటల్ లిటరసి, డిఎఫ్ఎస్, ఎం.ఒ.ఎఫ్: ఆర్థిక లిటరసి, ఎంఒ ఎస్ డిఇ: నైపుణ్యాభివృద్ధి, డిఒజె, ఎం.ఒ.ఎల్.జె: లీగల్ లిటరసి, ఎం.ఒడి: ఎన్ సిసి వలంటీర్లు, మాజీ సైనికోద్యోగుల సేవల వినియోగం, ఎం.ఒవై ఎఎస్: నెహ్రూ యువ కేంద్రాలు, ఎన్.ఎస్.ఎస్‌లను భాగస్వాములను చేయడం, ఎం.ఒ.ఆర్.డిః ఎన్ ఆర్ ఎల్ ఎం, డిడియు-జికెవై, ఎంఒసిః సహకార సొసైటీలు పాలుపంచుకునేలా చేయడం, ఎంఒహెచ్ ఎఫ్ డబ్లు: ఆరోగ్యం పారిశుధ్య అక్షరాస్యత, ఎన్‌డిఎంఎ, ఎంహెచ్ఎ: విపత్తుల నిర్వహణ,ఎం.ఒఎంఎ: మైనారిటీలకు కార్యక్రమాల అమలు, డిఒహెచ్ ఇ: నిరంతర విద్య, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వశాఖ : లైబ్రరీలు, సాంస్కృతిక అక్షరాస్యత, ఎం.ఒ.పి.ఆర్ : పంచాయతి వ్యవస్థల మద్దతు, గ్రామీణ లైబ్రరిలు , ఎం.డబ్ల్యసిడి: అంగన్ వాటి వర్కర్లు, ఎం.టిఎ: గిరిజన ప్రాంతాలలో కార్యక్రమ అమలు తదితరాలు ఉన్నాయి.
జనాందోళన్ గా ఎన్ ఐఎల్‌పిః
మూడు కోట్ల మంది విద్యార్థులు, 7 లక్షల పాఠశాలలకు చెందిన విద్యార్థులు యుడిఐఎస్కితమపేర్లను నమోదు చేసుకున్నార. 50 లక్షల మంది ప్రభుత్వ టీచర్లు, ఎయిడెడ్,ప్రైవేటు పాఠశాలలోని వారు వలంటీర్లుగా పాల్గొంటారు.
పంచాయతి రాజ్ సంస్థలు, అంగన్ వాడి వర్కర్లు, ఆశా వర్కర్లనుంచి మద్దతు తీసుకోవడం జరుగుతుంది. సుమారు 50 లక్షల మంది ఎన్ వై ఎస్ కె ,ఎన్ ఎస్ ఎస్ , ఎన్ సిసి వలంటీర్లు, ఎన్ సిసి వలంటీర్లనుంచి మద్దతుపొందడం జరుగుతోంది.
కమ్యూనిటీ భాగస్వామ్యం, దాతలు, కార్పొరేట్ సామాజికబాధ్యత సంస్థలు స్వచ్ఛందంగా విద్యాంజలి పోర్టల్‌ద్వారా పాల్గొనేట్టు చూస్తారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యక్తులు, కుటుంబాలు, గ్రామ, జిల్లాలకు చెందిన ఈ కార్యక్రమ విజయగాథలను వివిధ ప్లాట్‌ఫారం ల ద్వారా ప్రమోట్ చేస్తాయి. వీరు ఇందుకు అన్ని రకాలమీడియా, అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోక్, ఇంటర్ పర్సనల్ ప్లాట్‌ఫారం లు, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్, యూట్యూబ్ టివి ఛానళ్లు రేడియో తదితర ప్లాట్‌ఫారంలను ఉపయోగించుకుంటాయి. ఇందుకు ఎన్.ఐ.సి సెంట్రల్ పోర్టల్‌ను అభివృద్ధి చేస్తారు. సమాచారాన్ని మొబైల్ యాప్ , ఆన్‌లైన్ సర్వే మాడ్యూల్, భౌతిక , ఆర్ధిక మాడ్యూళ్లు, మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్ తదితరాల ద్వారా సమకూర్చుకుంటారు.
అక్షరాస్యతా స్థాయిని తెలుసుకునేందుకు శాస్త్రీ య పద్ధతిని వినియోగిస్తారు. ఒటిఎల్ ఎ ద్వారా , ఈ సర్టిఫికేట్ ద్వారా అసెస్‌మెంట్ ఆన్ డిమాండ్ ను అంచనావేస్తారు. ఇ సర్టిఫికేట్‌ను ఎన్.ఐ.ఒ.ఎస్ , ఎన్ ఎల్ ఎం ఎ ల సంతకంతో అభ్యాసకులకు అందజేస్తారు..
అభ్యసన సాధన సర్వేవార్షిక ఫలితాలనను500 నుంచి 1000 మందినుంచి నమూనాలు ఎంపిక చేసిన అభ్యాసకుల నుంచి ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి సేకరించి ఔట్‌కమ్-ఔట్‌పుట్ మానిటరింగ్ ఫ్రేమ్ వర్క్(ఒఒఎంఎఫ్)ను సేకరిస్తారు.
వయోజనవిద్య ప్రస్తుతం దేశంలో అందరికీ విద్య మా మరింది.
ఒక అభ్యుదయకర చర్యగా ఇక నుంచి వయోజన విద్య కార్యక్రమం స్థానంలో అందరికీ విద్య కార్యక్రమాన్ని చేపడతారు. వయోజన విద్య అనే పదంలో 15 సంవత్సరాలు పైబడిన అందరూ అనే అర్థం రావడం లేదని గుర్తించి ఈ మార్పు చేశారు.
2011 నాటి జనాభా లెక్కల ప్రకారం దేశంలో 15 సంవత్సరాలు పైబడిన అక్షరాస్యత లేని వారు 25.76 కోట్ల మంది (పురుషులు 9.08 కోట్లు, స్త్రీలు 16.68 కోట్లు).య2009-10 నుంచి 2017-18 మధ్య కాలంలో సాక్షరత భారత్ కింద అక్షరాస్యులైనట్టు నిర్థారణ అయిన 7.64 కోట్లమంది ని పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఇంకా 18.12 కోట్లమంది వయోజనులు దేశంలో అక్షరాస్యతకు దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.
***
(Release ID: 1799149)
Visitor Counter : 594