వ్యవసాయ మంత్రిత్వ శాఖ
దుబాయ్‌లో ఎక్స్‌పో 2020- భారతదేశ వ్యవసాయం, ఆహార ఉత్పత్తుల నైపుణ్య ప్రదర్శన
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు భారతదేశ చిరుధాన్యాలు, సేంద్రీయ వ్యవసాయం, ఉద్యానవనం, పాడి పరిశ్రమలలో పెట్టుబడి అవకాశాల ప్రదర్శన.
దుబాయ్ ఎక్స్‌పోలో భాగంగా జరగనున్న మిల్లెట్స్ ఫుడ్ ఫెస్టివల్
Posted On:
16 FEB 2022 6:10PM by PIB Hyderabad
దుబాయ్ లో పక్షం రోజులపాటు నిర్వహించే ఎక్స్ పో 2020 కార్యక్రమం లో ప్రపంచ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమకు ప్రధాన ఉత్పత్తి భాగస్వామిగా మారడానికి భారతదేశం గట్టి ప్రయత్నం చేస్తుంది , అంతర్జాతీయ సహకారాన్ని అన్వేషించడానికి , దాని ఎగుమతి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, అందుకు అనుకూల మార్గాల పై చర్చించడానికి వివిధ గోష్ఠి , సమావేశాలను నిర్వహిస్తుంది.
వ్యవసాయం , రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి ఫిబ్రవరి 17, 2022న ఎక్స్ పో 2020 లో భాగంగా దుబాయ్‌లోని ఇండియా పెవిలియన్‌లో 'ఆహారం, వ్యవసాయం , జీవనోపాధి'కి చెందిన పదిహేను రోజుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ పక్షం రోజులు ఆహార ప్రాసెసింగ్ వంటి రంగాలలో భారతదేశం హార్టికల్చర్, డైరీ, ఫిషరీస్ , సేంద్రీయ వ్యవసాయ రంగాలలో విస్తారమైన పెట్టుబడి అవకాశాలకై తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది.
‘మిల్లెట్స్’ అనే కీలక అంశంలో భాగంగా, పక్షం రోజులు చిరు ధాన్యాల ఫుడ్ ఫెస్టివల్, పుస్తక ఆవిష్కరణ , దాని ఆరోగ్యం , పోషక ప్రయోజనాలపై దృష్టి సారించే వివిధ సెమినార్‌లు నిర్వహిస్తారు. 2023ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం’గా ప్రకటిస్తూ 70కి పైగా దేశాల మద్దతుతో భారతదేశం చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఇటీవల ఆమోదించడం ఇక్కడ గమనార్హం.
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో మన దేశంలోనే అతిపెద్ద జీవనోపాధి ప్రదాతగా నిలుస్తుంది. ఈ రంగం మొత్తం స్థూల దేశీయోత్పత్తి (GDP)లో దాదాపు 21% గణనీయమైన వాటాను అందిస్తుంది. ఆర్ధిక సంవత్సరం2021లో వ్యవసాయ , అనుబంధ ఉత్పత్తుల మొత్తం ఎగుమతులు US$ 41.25 బిలియన్లతో, భారతదేశం ప్రపంచంలోని 15 అగ్రగామి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారులలో ఒకటిగా నిలుస్తుంది.
ఈ రంగపు సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి, ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్ , ఆహార ఉత్పత్తుల ఇ-కామర్స్ లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ప్రభుత్వం అనుమతించింది. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకం -PLI పథకం కింద ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ. 10,900 కోట్ల (US$ 1,484 మిలియన్లు) ప్రోత్సాహక వ్యయం కూడా ఆమోడం పొందింది. అదనంగా, 2021-22 నాటికి భారతదేశ వ్యవసాయ ఎగుమతులను 60 బిలియన్ల అమెరికన్ డాలర్లకు, రాబోయే కొన్ని సంవత్సరాలలో 100 బిలియన్లకు పెంచడానికి సమగ్ర వ్యవసాయ ఎగుమతి విధానం ప్రవేశపెట్టారు.
ప్రపంచ వినియోగం మహమ్మారి రాక ముందు ఉన్న స్థాయికి చేరుకోవడంతో నీటిపారుదల సౌకర్యాలు, గిడ్డంగులు , కోల్డ్ స్టోరేజీ వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరగడానికి ఈ రంగం సిద్ధంగా ఉంది.
ఈ పక్షం రోజులు వివిధ సెషన్లలో భారతదేశం నుండి హాజరయ్యే పలువురు సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొంటారు.
పక్షంరోజుల ‘ఆహారం, వ్యవసాయం , జీవనోపాధి’ కార్యక్రమం మార్చి 2న ముగుస్తుంది.
*****
(Release ID: 1798917)