గనుల మంత్రిత్వ శాఖ
2021-22 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో ఖనిజాల ఉత్పత్తిలో 16 శాతం సంచిత వృద్ధి
- మాగ్నసైట్, బంగారం, బొగ్గు, లిగ్నైట్, బాక్సైట్ & క్రోమైట్ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి
Posted On:
16 FEB 2022 11:53AM by PIB Hyderabad
డిసెంబర్, 2021 నెల (ఆధారం: 2011-12=100) మైనింగ్ మరియు క్వారీ రంగం యొక్క ఖనిజ ఉత్పత్తి సూచిక 120.3 వద్ద నిలిచింది. ఇంది డిసెంబర్ 2020 నెల స్థాయితో పోలిస్తే 2.6% ఎక్కువ. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం) తాత్కాలిక గణాంకాల ప్రకారం, 2021-22 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలానికి సంచిత వృద్ధి మునుపటి సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 16.0
శాతం మేర పెరిగింది.
డిసెంబర్, 2021లో ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తి స్థాయి: బొగ్గు 748 లక్షల టన్నులు, లిగ్నైట్ 39 లక్షల టన్నులు, సహజ వాయువు (ఉపయోగించబడింది) 2814 మిలియన్ క్యూ. మీ., పెట్రోలియం (ముడి) 25 లక్షల టన్నులు, బాక్సైట్ 2492 వేల టన్నులు, క్రోమైట్ 384 వేల టన్నులు, కాపర్ కాంక్. 10 వేల టన్నులు , బంగారం 106 కిలోలు, ఇనుప ఖనిజం 209 లక్షల టన్నులు, లీడ్ కాంక్. 28 వేల టన్నులు, మాంగనీస్ ఖనిజం 273 వేల టన్నులు, జింక్ కాంక్. 126 వేల టన్నులు, లైమ్‌స్టోన్ 309 లక్షల టన్నులు, ఫాస్ఫరైట్ 110 వేల టన్నులు, మాగ్నసైట్ 11 వేల టన్నులు, డైమండ్ 70 క్యారెట్‌లు ఉన్నాయి.
డిసెంబర్ 2021లో డిసెంబర్ 2020లో సానుకూల వృద్ధిని చూపుతున్న ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తి వివరాలు ఇలా ఉన్నాయి: మాగ్నసైట్ (73.2%), బంగారం (71.0%), బాక్సైట్ (27.1%), లిగ్నైట్ (21.4%), సహజ వాయువు (ఉపయోగించబడింది) (19.5% ), బొగ్గు (5.3%) మరియు క్రోమైట్ (5.3%).
ప్రతికూల వృద్ధిని చూపే ఇతర ముఖ్యమైన ఖనిజాల ఉత్పత్తి: పెట్రోలియం (ముడి) (-1.8%), జింక్ కాంక్. (-4.3%), ఇనుప ఖనిజం (-6.2%), మాంగనీస్ ధాతువు (-7.3%), సున్నపురాయి (-7.5%), రాగి conc (-10.3%), లీడ్ conc (-17.4%), ఫాస్ఫోరైట్ (-20.4% ) మరియు డైమండ్ (-97.6%).
ఎంవీ/ఏకేఎన్/ఆర్‌కేపీ
***
(Release ID: 1798882)
Visitor Counter : 146