సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

కొత్త డిజిటల్ యుగానికి తగినట్టుగా మ్యూజియంలను పునరుద్ధరించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి పిలుపు


'భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ను ప్రారంభించిన శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 15 FEB 2022 6:11PM by PIB Hyderabad

శ్రీ జి కిషన్ రెడ్డి: "భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి. దీనిని సంరక్షించాలి, ప్రచారం చేయాలి . శాశ్వతం చేయాలి. ఈ లక్ష్యాలను సాధించడానికి మన మ్యూజియంలు అద్భుతమైన మాధ్యమాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను"

 

శ్రీ జి కిషన్ రెడ్డి: "ఈ రోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరికీ వికాస్ , విరాసత్ మంత్రాన్ని అందించారు.ఈ దార్శనికతతో వికాస్ కోసం నిరుపేదలు  అభివృద్ధి ప్రయోజనాలను పొందేలా మేము చూస్తున్నాము . విరాసాత్ తో మన అద్భుతమైన వారసత్వాన్ని రక్షిస్తాము".

 

శ్రీ జి కిషన్ రెడ్డి: సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కళాకారులు, మ్యూజియం నిపుణులు విద్యావేత్తలతో  కూడిన సమ్మిళిత నమూనాపై పనిచేస్తోంది.  వారిని దేశంలోని మ్యూజియంల ప్రధాన భాగంలో ఉంచుతుంది

 

'భారతదేశంలో మ్యూజియంల రీ ఇమేజినింగ్‘ అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు ను ఈశాన్య ప్రాంత అభివృద్ధి, సాంస్కృతిక, పర్యాటక, శాఖల  కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి మంగళవారం (15-02-2022) హైదరాబాద్ లో ప్రారంభించారు. ఇటువంటి

సదస్సును నిర్వహించడం ఇదే మొదటిసారి.

 

భారతదేశం, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్ డమ్ ,యునైటెడ్ స్టేట్స్ మొదలైన దేశాల ప్రతినిధులు ఫిబ్రవరి తేదీలలో జరిగే ఈ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటున్నారు. శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ అధ్యక్షుడు ఆల్బెర్టో గార్లిండిని, సాంస్కృతిక సంపద సంరక్షణ, పునరుద్ధరణకు  సంబంధించిన అంతర్జాతీయ అధ్యయన కేంద్రం డైరెక్టర్ జనరల్ వెబర్ నోడోరో , సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లిల్లీ పాండే కూడా పాల్గొని ప్రసంగించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో  ప్రసంగిస్తూ, "భారతదేశం గొప్ప సాంస్కృతిక వారసత్వ భూమి అని, దీనిని సంరక్షించి,  ప్రాచుర్యం కల్పించడంతో పాటు భావి తరాల కోసం భద్రంగా పదిల

పరచాలని‘‘ అన్నారు. ‘‘ఈ లక్ష్యాలను సాధించడానికి మన మ్యూజియంలు అద్భుతమైన మాధ్యమాన్ని అందిస్తాయని నేను నమ్ముతున్నాను" అని అన్నారు. ‘‘ఈ రోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనందరికీ వికాస్ , విరాసత్ మంత్రాన్ని అందించారు.ఈ దార్శనికతతో వికాస్ కోసం నిరుపేదలు  అభివృద్ధి ప్రయోజనాలను పొందేలా మేము చూస్తున్నాము . విరాసాత్ తో మన అద్భుతమైన వారసత్వాన్ని రక్షిస్తాము" అని శ్రీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

భారత దేశ స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, దాని ప్రజల, సంస్కృతి మ విజయాల అద్భుతమైన చరిత్రను వేడుకగా జరుపుకునే ప్రధాన కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. కేంద్ర మంత్రి మాట్లాడుతూ,  " ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న సమయం లో మన సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, పరిరక్షణ,  శాశ్వతత్వం  దిశగా పునరంకిత మౌతున్నందుకు గర్వపడుతున్నాము. మన అద్భుతమైన గత వైభవాన్ని  పునరుద్ధరించడంలో మ్యూజియంలు కీలక పాత్ర పోషిస్తాయని నేను నమ్ముతున్నాను. నేడు భారతదేశంలోని 1000+ మ్యూజియంలు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడం , సంరక్షించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కూడా కీలకపాత్ర వహిస్తున్నాయి‘‘ అని అన్నారు.

 

మన దేశం అంతటా ఉన్న మ్యూజియంల ను ప్రోత్సహించడం, అప్ గ్రేడేషన్ చేయడంలో ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల పాత్రను కేంద్ర మంత్రి ప్రస్తావించారు. " స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన సమర యోధుల పాత్రను గుర్తించడానికి భారత ప్రభుత్వం 10 గిరిజన స్వాతంత్ర యోధుల మ్యూజియంలను కూడా అభివృద్ధి చేస్తోంది. అలాగే, టెక్స్ టైల్స్ అండ్ క్రాఫ్ట్స్ మ్యూజియంలు, డిఫెన్స్ మ్యూజియంలు రైల్వే మ్యూజియంలు వంటి ప్రత్యేక మ్యూజియంలకు మద్దతు ఇస్తోంది‘‘ అని ఆయన చెప్పారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా మ్యూజియంలకు మద్దతు,  ప్రోత్సాహం అందిస్తోందని, 2014 నుండి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 110 మ్యూజియంలకు నిధులు సమకూర్చిందని,  ఇంకా, సైన్స్ ను ప్రోత్సహించడానికి 18 సైన్స్ మ్యూజియంలను  కూడా అభివృద్ధి చేస్తున్నారని శ్రీ కిషన్ రెడ్డి వివరించారు. ఇవి గాకుండా, మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా 52 మ్యూజియంలను నిర్వహిస్తోందని తెలిపారు.

 

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషిని కేంద్ర మంత్రి వివరిస్తూ, " కళాకారులు, మ్యూజియం నిపుణులు, విద్యావేత్తలతో  కూడిన  సమ్మిళిత నమూనాపై సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది. వారిని దేశంలోని మ్యూజియంల ప్రధాన భాగంలో ఉంచుతుంది

మన మ్యూజియం లు కొత్త డిజిటల్ యుగంలో 21 వ శతాబ్దానికి తగినట్టుగా  ఉండటానికి తమను తాము నవీకరించుకోవాలి మన పౌరులకు  స్వంత పార్కులు , ఆటస్థలాల మాదిరిగా మ్యూజియంలు కూడా మరింత అందుబాటులో ఉండేలా మనం చూసుకోవాలి".అన్నారు.

 

అంతకు lముందు, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీమతి లిల్లీ పాండేయా మాట్లాడుతూ, మ్యూజియంలు సందర్శకులకు దేశ చరిత్రను  సుపరిచితం చేస్తాయని, ఇది దాని ప్రస్తుత సాంస్కృతిక, సామాజిక-ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవ డానికి అవసరం అని అన్నారు. సాంస్కృతిక అన్వేషణలు , పోషణ కోసం సమాజానికి ఉన్న అవసరం స్థాయిని మ్యూజియంలు తెలియజేస్తాయని ఆమె అన్నారు. భారతీయ మ్యూజియంలు మన కళాత్మక విజయాల భాండాగారం అని, బొమ్మలు, గాలిపటాలు, రైల్వేలు, వస్త్రాల ప్రత్యేక మ్యూజియంలతో కూడిన 1000 కు పైగా మ్యూజియంలకు భారతదేశం నిలయంఅని ఆమె అన్నారు.రెండు రోజుల పాటు జరిగే ప్రపంచ శిఖరాగ్ర సదస్సు భార తీయ మ్యూజియంలను  ప్రత్యేక ప్రాధాన్యతలలో ఉంచడానికి ఒక ప్రత్యేక

అవకాశమని ఆమె అన్నారు.

 

అంతర్జాతీయ మ్యూజియంల మండలి అధ్యక్షుడు ఆల్బెర్టో గరియాండిని తన ప్రారంభోపన్యాసంలో "భవిష్యత్ మ్యూజియంలు ఇప్పటికే నిర్మించబడుతున్నాయి.  మ్యూజియం నిపుణులు సమాజాలతో కొత్త సంబంధాలను సృష్టిస్తున్నారు, సాంస్కృతిక పరంగా నిమగ్నత వినూత్న రూపాలతో ప్రయోగాలు చేస్తున్నారు‘‘ అని అన్నారు. మ్యూజియంలు అత్యంత నమ్మకమైన సంస్థలలో ఒకటనీ,  శాస్త్రీయ సమాచారాన్ని చేర్చడం, వైవిధ్యం ,వ్యాప్తిని ప్రోత్సహించడానికి ప్రత్యేక స్థానంలో ఉన్నాయని ఆయన అన్నారు.

 

ఐ సి సి ఆర్ ఓ ఎం డైరెక్టర్ జనరల్ వెబ్బర్ న్డోరో తన ప్రసంగంలో - భారతదేశం స్ఫూర్తిదాయక మ్యూజియంలను అభివృద్ధి చేసే స్థితిలో ఉందని చెప్పారు. ఈ సదస్సు నిర్వహణ  చొరవ భారత దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాల ను  కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు. మ్యూజియంలు అంటే సేకరించిన కళా వస్తువులు కలిగిన ఉన్న భవనాలు మాత్రమే కాదని, అవి సాంస్కృతిక వారసత్వ సంపద,  అనుభవాల గొప్ప భాండాగారం కూడా అని ఆయన అన్నారు.

 

ఈ శిఖరాగ్ర సదస్సు  భారతదేశం తో పాటు  ప్రపంచవ్యాప్తంగా మ్యూజియం అభివృద్ధి,  నిర్వహణ రంగం లోని ప్రముఖ మేధావులు, డొమైన్ నిపుణులు అభ్యాసకులను ఒక వేదికపైకి తెచ్చి ఉత్తమపధ్ధతులు, ,వ్యూహాల పై చర్చిస్తుంది.  25 మందికి పైగా

మ్యూజియాలజిస్టులు ,మ్యూజియం నిపుణులు ఈ సదస్సు లో మ్యూజియం ల  రీ ఇమెజినింగ్ ప్రాధాన్యతలు , పద్ధతులను పరిశీలిస్తారు. ఈ విషయ పరిజ్ఞాన మార్పిడి ఫలితం లో కొత్త మ్యూజియంల అభివృద్ధి కోసం బ్లూప్రింట్ సృష్టించడం, పునరుద్ధరణ ఫ్రేమ్ వర్క్ ని పెంపొందించడం ,భారతదేశంలో ఇప్పటికే ఉన్న మ్యూజియంలను పునరుద్ధరించడం కూడా భాగంగా ఉంటాయి. ఈ సదస్సులో పాల్గొనేందుకు సుమారు 2,300 మంది నమోదు చేసుకున్నారు.  సాధారణ ప్రజలు  కూడా ఈ సదస్సులో పాల్గొనవచ్చు.

 

****



(Release ID: 1798569) Visitor Counter : 149