రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ప్రదర్శన ఇవ్వనున్న పాఠశాలల బ్యాండ్‌లు

Posted On: 10 FEB 2022 2:53PM by PIB Hyderabad

స్కూల్ బ్యాండ్‌లు ఇక నుంచి   ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ (అమరుల స్తూపం) వద్ద క్రమంతప్పకుండా వంతుల వారీగా ప్రదర్శనలు ఇస్తాయి. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ,  విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. స్కూల్ బ్యాండ్‌ల షెడ్యూల్‌ను సిద్ధం చేయడానికి ఢిల్లీలోని ఎన్సీటీ ప్రభుత్వంతో సంప్రదించాలని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ  ఆదేశించింది. తద్వారా పాఠశాలల బ్యాండ్‌లు జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రదర్శనలు ఇస్తాయి. బ్యాండ్  స్థలం, థీమ్‌లు, ట్యూన్‌లు మొదలైనవాటిని డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ వార్ మెమోరియల్ & మ్యూజియం, హెడ్‌క్వార్టర్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ (జాతీయ యుద్ధ స్మారకకం&ఎం, హెచ్క్యూ ఐడీఎస్) సమన్వయంతో స్మారక చిహ్నం  పవిత్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తారు.

సాధారణ షెడ్యూల్‌లో భాగంగా జాతీయ యుద్ధ స్మారకాన్ని&ఎం, హెచ్క్యూ ఐ డీఎస్ తో సమన్వయంతో ప్రదర్శన ఇవ్వడానికి  సంబంధిత రాష్ట్రాల పాఠశాలల నుండి ఒక బ్యాండ్‌ని ఎంచుకోవాలని విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల విద్యా శాఖలను కోరింది. సీబీఎస్ఈ రక్షణ మంత్రిత్వ శాఖతో కలిసి అన్ని పాఠశాలలను సమన్వయం పరుస్తుంది. జాతీయ యుద్ధ స్మారకాన్ని దేశానికి అంకితం చేసిన మూడవ వార్షికోత్సవానికి ముందు.. అంటే  ఫిబ్రవరి 22, 2022 నుండి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఈ పాఠశాల బ్యాండ్‌ల ప్రదర్శనల ప్రారంభానికి తాత్కాలిక తేదీ. ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ ఫిబ్రవరి 25, 2019న జాతీయ యుద్ధ స్మారకాన్నిని జాతికి అంకితం చేశారు. పాఠశాల విద్యార్థులలో దేశభక్తి, విధి పట్ల భక్తి, ధైర్యం,  త్యాగం,  విలువలను పెంపొందించడం  ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, ముఖ్యంగా యువత స్ఫూర్తిదాయ యుద్ధ స్మారకంతో అనుబంధం కలిగిన వివిధ కోణాలను తెలుసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది యుద్ధ వీరుల అద్భుతమైన కథల గురించి పిల్లలలో అవగాహన పెంచడానికి సాయపడుతుంది. వారిలో జాతీయతా భావాన్ని పెంపొందిస్తుంది.  రక్షణ  సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న వీర్ గాథ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళుతుంది.

***



(Release ID: 1797820) Visitor Counter : 109