పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ద్వారా వాయిస్ ఆఫ్ కస్టమర్ రికగ్నిషన్ 2021 కోసం ఏడు ఏఏఐ విమానాశ్రయాలు ఎంపిక చేయబడ్డాయి
Posted On:
10 FEB 2022 3:52PM by PIB Hyderabad
2021లో ఏసీఐ-ఏఎస్‌క్యూ సర్వేలో పాల్గొన్న చెన్నై, కోల్‌కతా, గోవా, పుణే, పాట్నా, భువనేశ్వర్ & ఛండీగఢ్ అనే ఏడు ఏఏఐ విమానాశ్రయాలు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) వరల్డ్ వాయిస్ ఆఫ్ కస్టమర్ చొరవ కింద 'వాయిస్ ఆఫ్ కస్టమర్ రికగ్నిషన్' కోసం ఎంపిక చేయబడ్డాయి. కోవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న సమయంలోనూ తమ కస్టమర్‌లకు తగిన ప్రాధాన్యతనిస్తూ.. వారి వాయిస్‌ని వినిపించేందుకు కట్టుబడి ఉన్న విమానాశ్రయాలను గుర్తించేందుకు ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 'వాయిస్ ఆఫ్ ది కస్టమర్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) సర్వే అనేది ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ద్వారా నిర్వహించబడే విమానాశ్రయం నుండి ప్రయాణిస్తున్నప్పుడు, ప్రయాణీకుల సంతృప్తిని కొలిచే ప్రపంచ ప్రఖ్యాత, అంతర్జాతీయంగా స్థాపించబడిన గ్లోబల్ బెంచ్‌మార్కింగ్ ప్రోగ్రామ్. ఏఎస్‌క్యూ అవార్డులు తమ సొంత ప్రయాణీకుల అభిప్రాయం ప్రకారం ఉత్తమ కస్టమర్ అనుభవాన్ని అందించే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలను గుర్తిస్తాయి. ఏఎస్‌క్యూ ప్రోగ్రామ్ ప్రయాణీకుల అభిప్రాయాలను మరియు ఉత్పత్తులు మరియు సేవల దృక్కోణం, విమానాశ్రయం నుండి వారు ఏమి కోరుకుంటున్నారో బాగా అర్థం చేసుకోవడానికి పరిశోధన సాధనం మరియు నిర్వహణ సమాచారాన్ని అందిస్తుంది.
***
(Release ID: 1797432)
Visitor Counter : 157