పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
బీచ్‌లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు
Posted On:
10 FEB 2022 1:30PM by PIB Hyderabad
స్వచ్ఛ-నిర్మల్ తత్ అభియాన్ పేరిట 11-17 నవంబర్ 2019న 10 తీర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు - అంటే గుజరాత్, ఆంధ్రప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, దామన్ &దియ్యు, మహారాష్ట్ర, కర్నాటక, గోవా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరీ, ఒడిషాలలో తీవ్రమైన సముద్ర తీరం (బీచ్) ప్రక్షాళన- అవగాహన కార్యక్రమాన్ని మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవలో భాగంగా అక్టోబర్ 2021న 75వ సరూపవారంలో శివరాజ్‌పూర్ (గుజరాత్), ఘోఘా (దియ్యు), కాసర్‌కోడ్ & పదుబిద్రి (కర్నాటక), కప్పడ్ (కేరళ), రుషికొండ (ఆంధ్రప్రదేశ్), గోల్డెన్ (ఒడిషా), రాధానగర్ (అండమాన్ & నికోబార్), ఈడెన్ (పుదుచ్చేరీ)లలోని బ్లూఫ్లాగ్ బీచీలలో మరొక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పౌర సంస్థలు, తదితర వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. సామూహిక అవగాహనా ప్రచారాలు, తీర ప్రాంత వనరులు, సముద్ర పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించాల్సిన ప్రాముఖ్యతను గురించి క్విజ్‌లను నిర్వహించారు.
బీచ్‌లలో పారిశుద్ధ్యాన్ని నిర్వహించడం అన్నది రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రభుత్వాల, స్థానిక మున్సిపల్ అధికారుల బాధ్యత. ఈ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన బీచ్ వాతావరణం, కళాత్మక నిర్వహణ సేవ (బీచ్ ఎన్విరాన్‌మెంట్& ఈస్థటిక్ మేనేజ్‌మెంట్ సర్వీస్ - బిఇఎఎంఎస్) కింద కాలుష్య నివారణ, బీచ్ సౌందర్యీకరణ, పర్యావరణ విద్యపై అవగాహన, భద్రత & పర్యవేక్షణలను 6 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో ఉన్న మొత్తం 10 బీచ్‌లను భద్రత, పర్యావరణపరంగా స్థిరమైన మౌలికసదుపాయాలు, ఆమోదితమైన స్నానపు నీటి నాణ్యత, నిరంతర స్వీయ ఇంధన సరఫరా (సెల్ఫ్ సస్టైనింగ్ ఎనర్జీ సప్లై), పర్యావరణపరంగా ఉత్తమ సేవలతో అంతర్జాతీయ బీచ్‌లతో సమానంగా వీటిని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ బీచీలకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను ఆర్థిక సంవత్సరం 2021-22 కి ప్రదానం చేయడం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ బీచీలలో ఐదు పర్యావరణ అవగాహన ప్రచారాలను వార్షికంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2) సముద్ర కాలుష్య నివారణ ప్రాముఖ్యత 2) బీచ్ పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ& సంరక్షణ 3) తీర ప్రాంత జీవవైవిధ్యం& పరస్పరం ఆధారపడటం 4) బ్లూఫ్లాగ్ & స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు 5) బీచ్ భద్రతా చర్యలు అన్న ఇతివృత్తాలపై అవగాహనా కార్యక్రమాలు ఉంటాయి.
ఈ సమాచారాన్ని పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే రాజ్యసభలో వెల్లడించారు.
***
(Release ID: 1797292)
Visitor Counter : 124