అంతరిక్ష విభాగం
1975 సంవత్సరం నుండి ISRO భారత సంతతికి చెందిన 129 ఉపగ్రహాలను 36 దేశాలకు చెందిన 342 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది: కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
అంతరిక్షంలో భారత దేశానికి చెందిన వివిధ సేవలను అందిస్తున్న 53 కార్యాచరణ ఉపగ్రహాలు: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 FEB 2022 3:08PM by PIB Hyderabad
కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; ఎర్త్ సైన్సెస్; డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ 1975 నుంచి భారత సంతతికి చెందిన మొత్తం 129 ఉపగ్రహాలు, 36 దేశాలకు చెందిన 342 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించిందని, వీటిలో దాదాపు 39 ఉపగ్రహాలు వాణిజ్య ఉపగ్రహాలు, మిగిలినవి నానో-ఉపగ్రహాలు అని చెప్పారు.
రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో, ఈ రోజు భారతదేశం అంతరిక్షంలో మొత్తం 53 కార్యాచరణ ఉపగ్రహాలను కలిగి ఉంది, ఇది దేశానికి వివిధ గుర్తించబడిన సేవలను అందిస్తున్నాయి. వీటిలో 21 కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, 8 నావిగేషన్ ఉపగ్రహాలు, 21 భూమి పరిశీలన ఉపగ్రహాలు మరియు 3 సైన్స్ ఉపగ్రహాలు అన్నారు
శాటిలైట్ ఎనేబుల్ డేటా సేవలు దేశంలోని వివిధ రంగాల ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతున్నాయి. వీటిలో టెలివిజన్ ప్రసారం, డైరెక్ట్-టు-హోమ్, ATM, మొబైల్ కమ్యూనికేషన్, టెలి-ఎడ్యుకేషన్, టెలి-మెడిసిన్ , వాతావరణం, తెగుళ్లు, వ్యవసాయ-వాతావరణ శాస్త్రం సంభావ్య ఫిషింగ్ జోన్‌లపై సలహాలు ఉన్నాయి. ఉపగ్రహ డేటా పంట ఉత్పత్తి అంచనా, పంట తీవ్రత, వ్యవసాయ కరువు అంచనా, బంజరు భూముల జాబితా, భూగర్భ జలాల లభ్యత ప్రాంతాలను గుర్తించడం, లోతట్టు చేపల పెంపకం అనుకూలత, విపత్తు ప్రమాదాన్ని తగ్గించడం కోసం కూడా ఉపయోగ పడుతుంది. ISRO కార్యాచరణ అనువర్తనాలను మరింత మెరుగుపరచడానికి దేశంలో అభివృద్ధి చెందుతున్న కార్యక్రమాల ద్వారా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి మరిన్ని ఉపగ్రహాలను ప్రయోగించాలని మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. వాటి కార్యాచరణ వినిమయం కోసం భాగస్వామ్య విభాగాలచే సూచనలను స్వీకరించారు.
అటువంటి అప్లికేషన్లలో కొన్ని:
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ద్వారా పొటెన్షియల్ ఫిషింగ్ జోన్ సముద్ర వాతావరణ ముందస్తు అంచనా , పంట విస్తీర్ణం-ఉత్పత్తి అంచనా, జాతీయ వ్యవసాయ కరువు అంచనా పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా మహలనోబిస్ నేషనల్ క్రాప్ ఫోర్‌కాస్ట్ సెంటర్, (MoA&FW ), ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (MoEF&CC) ద్వారా ద్వైవార్షిక ఫారెస్ట్ కవర్ అంచనా , సెంట్రల్ వాటర్ కమీషన్ (జల శక్తి మంత్రిత్వ శాఖ)చే నీటిపారుదల అవస్థాపన అంచనా, భారత వాతావరణ శాఖ (MoES) ద్వారా వాతావరణ అంచనాలు, భూగర్భ జలాల అంచనా తగిన రీఛార్జ్ స్థానాల మ్యాపింగ్ (జల్ శక్తి మంత్రిత్వ శాఖ), గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ వంటివి..
<><><>
(Release ID: 1797285)
Visitor Counter : 385