రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి 17.78 లక్షల ఎకరాల రక్షణ శాఖ భూములను సర్వే చేసిన ఎస్టేట్ సిబ్బందికి అవార్డులు అందజేసిన రక్షణ శాఖ మంత్రి


నిధులు ఆదా చేసి తక్కువ సమయంలో భూములను అభివృద్ధి చేసేందుకు సర్వే దోహదపడుతుంది.. శ్రీ రాజనాథ్ సింగ్

సామర్థ్య పెంపుదలకు మరిన్ని సంస్కరణలు అమలు చేయాలని డీజీడీఈ కు సూచించిన శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 10 FEB 2022 12:25PM by PIB Hyderabad

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 17.78 లక్షల ఎకరాల రక్షణ భూమిని విజయవంతంగా సర్వే చేసిన రక్షణ శాఖ ఎస్టేట్స్ శాఖ సిబ్బందిని రక్షణ శాఖ మంత్రి  శ్రీ రాజ్‌నాథ్ సింగ్  అభినందించి అవార్డులు అందజేశారు. 2022 ఫిబ్రవరి 10న జరిగిన కార్యక్రమంలో  38 డిఫెన్స్ ఎస్టేట్ కార్యాలయానికి చెందిన 11 మంది అధికారులు, 24 మంది సిబ్బంది, నలుగురు  అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్ అధికారులకు శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అవార్డులను అందించారు. 

రక్షణ శాఖ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్న రికార్డుల ప్రకారం  రక్షణ మంత్రిత్వ శాఖ దాదాపు 17.99 లక్షల ఎకరాల భూమి ఉంది. అందులో 1.61 లక్షల ఎకరాల భూమి దేశవ్యాప్తంగా 62 నోటిఫైడ్ కంటోన్మెంట్ ప్రాంతాలలో ఉంది.  దాదాపు 16.38 లక్షల ఎకరాల భూమి కంటోన్మెంట్ వెలుపల అనేక ప్రాంతాల్లో  విస్తరించి ఉంది. 16.38 లక్షల ఎకరాల భూమిలో దాదాపు 18,000 ఎకరాల భూమిని   రాష్ట్రాలకు అద్దెకు ఇవ్వడం  లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడం జరిగింది. ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేసిన భూముల వివరాలను  రికార్డుల నుంచి తొలగించాలన్న  ప్రతిపాదన పరిశీలనలో ఉంది. స్వాతంత్ర్యం తర్వాత మొదటిసారిగా మొత్తం రక్షణ భూమిని వివిధ రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ అధికారుల సహకారంతో ఆధునిక  పద్ధతులను ఉపయోగించి సర్వే చేయడం జరిగింది. ఇది రక్షణ శాఖ సాధించిన విజయాల్లో ఒకటిగా నిలుస్తుంది. 

కోవిడ్ -19 మహమ్మారి ముప్పు మధ్యజనావాసాలు లేని మారుమూల ప్రదేశాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులలో కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించిన  డిఫెన్స్ ఎస్టేట్ సిబ్బందిని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.  ఈ సర్వేను  చారిత్రాత్మక సర్వేగా ఆయన వర్ణించారు.  ఈ ప్రాంతాల భద్రత మరియు అభివృద్ధిలో  రక్షణ భూముల  స్పష్టమైన సరిహద్దులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. సర్వే తో  భూముల కొలతలువిస్తీర్ణం  ఖచ్చితంగా తెలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.  విశ్వసనీయమైన రికార్డులు భూవివాదాల పరిష్కారానికి అవుతున్న ఖర్చు, వనరులు  శక్తి సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తాయని ఆయన తెలిపారు.

డ్రోన్ చిత్రాలుఉపగ్రహ చిత్రాలు  3డి  పరిజ్ఞానం ఉపయోగించి తొలిసారిగా సర్వే లో    ఉపయోగించిన డైరెక్టరేట్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ (డిజిడిఇ)ని రక్షణ మంత్రి అభినందించారు. ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి నిర్వహించిన సర్వే ఫలితాలు ఖచ్చితంగావిశ్వసనీయంగా ఉంటాయని అన్నారు. సర్వేలో ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ మరియు డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి ఆధునిక సర్వే పద్ధతులు ఉపయోగించారు.  ఖచ్చితమైన మరియు సమయానుకూల ఫలితాలను పొందడానికి డ్రోన్ మరియు ఉపగ్రహ చిత్రాల ఆధారిత సర్వేలు కూడా నిర్వహించబడ్డాయి.

సర్వే మరియు భూ రికార్డుల ప్రాముఖ్యతను  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ప్రాంతం, రాష్ట్రం లేదా దేశంలో  అభివృద్ధికి ఇది పునాదిగా ఉంటాయని  వివరించారు.  "గత 200-300 సంవత్సరాల కాలంలో  ప్రపంచవ్యాప్తంగా కొంతమంది తమ ఆధిపత్యాన్ని సంపాదించే అంశంలో  సర్వే పరిజ్ఞానం ముఖ్యమైన పాత్ర పోషించింది. నేడు మన దేశం భూ సర్వే రంగంలో ముందుకు సాగుతోంది.   రక్షణ భూములుకంటోన్మెంట్ ప్రాంతాలకు ఆధునిక పద్ధతులతో రక్షణ కల్పించే అంశంలో సర్వే కీలకంగా ఉంటుంది' అని శ్రీ  రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

 దేశ సామాజిక-ఆర్థిక మరియు సాంస్కృతిక అభివృద్ధిలో కంటోన్మెంట్ ప్రాంతాలు  ముఖ్యమైన పాత్రను పోషించాయని  శ్రీ  రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.    “ కేంద్ర  ప్రభుత్వం తన బడ్జెట్‌లో రక్షణ భూమిలో సరిహద్దుల నిర్మాణానికి 173 కోట్ల రూపాయలు కేటాయించింది.  ఇది కేవలం  ఆర్థిక మంజూరు మాత్రమే కాదు.  కంటోన్మెంట్ ప్రాంతాలను రక్షించి, అభివృద్ధి చేయడానికి మా నిబద్ధతను సూచిస్తుంది.  ఈ నేపథ్యంలో ఈ సర్వే అత్యంత కీలకమైంది' అని ఆయన తెలిపారు.

దైనందిన జీవితంలో సాంకేతికతను అంతర్భాగంగా మారిందని  శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.  రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దిశలో ముందడుగు వేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా   ఈ-ఛవానీ పోర్టల్ ఏర్పాటు అయ్యిందని వివరించారు.   కంటోన్మెంట్ బోర్డుల పరిధిలో నివసిస్తున్న వారికి   'సౌలభ్యం'ను అందించాలన్న లక్ష్యంతో  ఫిబ్రవరి 2021లో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ-ఛవానీ పోర్టల్ ను ప్రారంభించింది.  పోర్టల్ (https://echhawani.gov.in/) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డులలోని 20 లక్షల మంది నివాసితులకు ఆన్‌లైన్ పౌర సేవలను అందిస్తుంది. దీనికి రూపకల్పన చేసిన  డిజిడిఇ ని అధినందించిన మంత్రి ప్రారంభించినప్పటి నుంచి సేవలు అందించేందుకు తీసుకుంటున్న సమయం, కాగితం వాడకం 50-80 శాతం తగ్గిందని ఆయన అన్నారు. 

2020 ఆగస్టులో  'ఆత్మనిర్భర్ వారోత్సవాల  సందర్భంగా ప్రారంభించిన 'సృజన్ పోర్టల్ను మంత్రి ప్రస్తావించారు.  'వన్ స్టాప్ షాప్గా పనిచేసే ఈ పోర్టల్ స్వదేశంలో తయారయ్యే ఉత్పత్తులను   అమ్మకందారులకు చెరువలోకి తీసుకుని వెళ్తాయని అన్నారు.   క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్  ఆన్‌లైన్ పోర్టల్, ఇ-సెహత్ పోర్టల్రక్షణ శాఖ పెన్షన్ పోర్టల్ఎన్ సిసి   శిక్షణ మరియు గ్యాలంట్రీ అవార్డుల పోర్టల్ వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ  జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తున్నదని అన్నారు. దీనిద్వారా  మరియు మా సాయుధ దళాల సిబ్బంది మరియు అనుభవజ్ఞుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నామని అయన వివరించారు. 

'డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించి ప్రజల జీవితాలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు.  వాతావరణ శాఖ గతంలో కంటే మరింత కచ్చితత్వంతో ముందస్తుగా వాతావరణాన్ని అంచనా వేయడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ఆయన పెద్ద ముందడుగు గా  అభివర్ణించారు.  ఇది సాయుధ బలగాలు మరియు విపత్తు సహాయక బృందాలకు సహాయక చర్యలకు తగిన సమయాన్ని అందిస్తుందని అన్నారు.  “వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్య రంగాల్లో సాంకేతికతను ఉపయోగించడం మన దేశ పురోగతిని ప్రతిబింబిస్తుంది.   2022-23 కేంద్ర బడ్జెట్ లో డిజిటల్ కరెన్సీ మరియు డిజిటల్ యూనివర్సిటీ ప్రకటనలు  సాంకేతికత రంగంలో దేశ  వ్యవస్థలను ప్రపంచ స్థాయికి తీసుకురావాలనే ప్రభుత్వ  సంకల్పానికి నిదర్శనం  ”అని ఆయన అన్నారు.  ఇతర మంత్రిత్వ శాఖలు మరియు విభాగాలు డిజిడిఇ నుంచి స్ఫూర్తి పొంది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.  ఇది దేశ నిర్మాణంలో కీలకంగా ఉంటుందని అన్నారు. 

సాయుధ బలగాల సిబ్బంది సంక్షేమం మరియు సౌలభ్యం కోసం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ రాజనాధ్ సింగ్ స్పష్టం చేశారు. పనుల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం మరియు సమయపాలన కోసం  మరిన్ని రంగాలలో సంస్కరణలు తీసుకురావాలని  డిజిడిఇ ని మంత్రి కోరారువ్యవస్థ మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు సంస్కరణలు ఉపయోగ పడతాయని అన్నారు.  ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మంత్రిత్వ శాఖ నుంచి  అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

రక్షణ భూముల నిర్వహణ మరియు సుమారు రెండు మిలియన్ల జనాభా కలిగిన 62 కంటోన్మెంట్ మునిసిపల్ పరిపాలన బాధ్యతను  డిఫెన్స్ ఎస్టేట్స్ ఆర్గనైజేషన్ నిర్వర్తిస్తుంది. రక్షణ భూమికి రక్షణ, భూమి హక్కు రక్షణ, భూమి రికార్డులు మరియు మ్యాప్‌ల నవీకరణ, ఆక్రమణల నివారణ మొదలైన వాటికి రక్షణ భూమికి సంబంధించి  స్పష్టమైన గుర్తింపు, సరిహద్దు సర్వే మరియు సరిహద్దుల విభజన అవసరం.  ఈ సందర్భంగా డిఫెన్స్ ల్యాండ్ సర్వే కు సంబంధించిన నాలుగు సర్వే నివేదికలను కూడా విడుదల చేశారు.

 శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఇ-చావానీ వెబ్‌నార్‌ను కూడా ప్రారంభించారు.  13 రాష్ట్రాలకు చెందిన 27 మున్సిపల్ కార్పొరేషన్లు62 కంటోన్మెంట్ బోర్డుల ప్రతినిధులు రోజంతా జరిగే ఈ వెబ్‌నార్‌లో పాల్గొంటున్నారు.  రక్షణ శాఖ కార్యదర్శి  డాక్టర్ అజయ్ కుమార్, ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేఆర్ధిక సలహాదారుడు  (డిఫెన్స్ సర్వీసెస్) శ్రీ సంజీవ్ మిట్టల్, డిఫెన్స్ ఎస్టేట్స్  డైరెక్టర్ జనరల్ శ్రీ అజయ్ కుమార్ శర్మ మరియు ఇతర రక్షణ మంత్రిత్వ శాఖ మరియు డిఫెన్స్ ఎస్టేట్స్ శాఖల  సీనియర్ అధికారులు కార్యక్రమంలో  పాల్గొన్నారు.  

 

 

***



(Release ID: 1797206) Visitor Counter : 152