మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పాఠశాల స్థాయిలో వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాల గురించి పాఠ్యాంశాలు
Posted On:
09 FEB 2022 2:26PM by PIB Hyderabad
వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలకు సవాళ్ళు సహా ఇతర సమస్యలను, అంశాలను వివిధ దశల్లో విద్యార్ధుల అభిజ్ఞా స్థాయిలను దృష్టిలో ఉంచుకుని అన్ని తరగతులకు సంబంధించిన సైన్స్ పాఠ్యాంశాల్లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) పొందుపరిచింది. వ్యసాయానికి సంబంధించిన సమస్యలు, ఆందోళనలకు సంబంధించిన వివిధ పాఠ్యాంశాలను VI – X తరగతివరకు సైన్సు పాఠ్య పుస్తకాలలో, XI , XIIవ తరగతి బయాలజీ పాఠ్యపుస్తకాలలోనూ ఎన్‌సిఇఆర్‌టి పొందుపరిచింది. అదనంగా, ఎన్‌సిఆర్‌టి XIIవ తరగతి పాఠ్యపుస్తకంలో వ్యవసాయం ఎదుర్కొంటున్న సవాళ్ళను - ఇండియాః పీపుల్ అండ్ ఎకానమీ (భారత్ః ప్రజలు & ఆర్థిక వ్యవస్థ) అన్న శీర్షిక కొంద జోడించింది. ఈ పాఠ్యపుస్తకాలను కాలానుగుణంగా తాజా పరుస్తారు. ఇదిలా ఉండగా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) IX నుంచి XIIవ తరగతులలో వ్యవసాయాన్ని నైపుణ్యానికి సంబంధించిన విషయాంశంగా అందిస్తోంది. అలాగే XI , XIIవ తరగతులలో ఉద్యానశాస్త్రాన్ని (హార్టీకల్చర్)ను నైపుణ్యానికి సంబంధించిన విషయాంశంగా అందచేస్తోంది. వీటితోపాటుగా, ఫార్మర్స్ పోర్టల్ ఆఫ్ ఇండియా, నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ (స్తిరమైన అభివృద్ధికి జాతీయ మిషన్) ద్వారా వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న చొరవలను విద్యార్ధులకు తెలియపరుస్తోంది.
ఈ సమాచారాన్ని విద్యాశాఖ సహాయం మంత్రి డాక్టర్ సుభాష్ సర్కార్ రాజ్యసభలో బుధవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం ద్వారా వెల్లడించారు.
***
(Release ID: 1796848)
Visitor Counter : 154