పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
2014 అనంతరం అదనంగా 27 దేశీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళను నిర్మించిన ఎఎఐసిఎల్ఎఎస్
Posted On:
07 FEB 2022 4:25PM by PIB Hyderabad
భారతదేశంలో 2014వ సంవత్సరం వరకు 11 దేశీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళు (అడంగులు), 19 అంతర్జాతీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళు ఉన్నాయి. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) / ఎఎఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలీడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (ఎఎఐసిఎల్ఎఎస్) మరొక 27 దేశీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళను సృష్టించాయి. ఇందుకు అదనంగా, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి), రాష్ట్ర ప్రభుత్వ విమానాశ్రయాల ఉమ్మడి వెంచర్ లు ఉన్నాయి. ఇందులో భాగంగా, దేశీయ టెర్మినళ్ళతో పాటు అంతర్జాతీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళు ఏర్పాటు చేసే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. సరుకుల వేగవంతమైన కదలికకు సౌలభ్యం ఈ సరుకు నిర్వహణతో ఈ సంభావ్యత చెప్పుకోదగినంతగా పెరిగింది.
సరుకు పరిమాణ సంభావ్యతపై ఆధారపడి టైర్ -2, టైర్ -3 నగరాలు సహా దేశీయ సరుకు రవాణా టెర్మినళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా సరుకు నిర్వహణ కేంద్రాలను సృష్టించేందుకు ఎఎఐసిఎల్ఎఎస్ కట్టుబడి ఉంది. తత్ఫలితంగా, అదనంగా 27 దేశీయ వైమానిక సరుకు రవాణా టెర్మినళ్ళను 2014 అనంతరం ఎఎఐసిఎల్ఎఎస్ సృష్టించింది. ఇందులో అమృత్‌సర్, మదురై, మంగళూరు, విశాఖపట్నం, చెన్నై, ఇండోర్, కోల్‌కతా, అహ్మదాబాద్, రాయ్‌పూర్, ఔరంగాబాద్, భుబనేశ్వర్, వారణాసి, గోవా, శ్రీనగర్, రాంచి, త్రివేండ్రం, గువాహతి, విజయవాడ, బగ్దోగ్రా, జమ్ము, లేహ్, సూరత్, భోపాల్, దెహ్రాడూన్, రాజమండ్రి, తిరుపతి, హుబ్బళ్ళి ఉన్నాయి.
ఈ సమాచారాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి (జనరల్ -(డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ వెల్లడించారు.
****
(Release ID: 1796394)
Visitor Counter : 131