వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పాట్నా (బీహార్) నుండి పండూ (గౌహతి) వరకు నౌకలో ఆహార ధాన్యాల పైలట్ తరలింపు 'గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్'కు కొత్త మార్గం తెరుస్తుంది : శ్రీ పీయూష్ గోయల్
బీహార్లోని కలూఘాట్లో రూ.78 కోట్లతో నిర్మించిన ఇంటర్మోడల్ టెర్మినల్ ద్వారా ఆహారధాన్యాల తరలింపు తో
ఈశాన్య ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం : ఇంకా బహుళ ఉద్యోగ అవకాశాల సృష్టి: శ్రీ పీయూష్ గోయల్
ఇది మన రైతులకు వారి పరిధిని విస్తరించడం ద్వారా , వారికి మెరుగైన ధరలు, మెరుగైన జీవనాన్ని అందించడం ద్వారా ఆత్మనిర్భర్ కలిగిస్తుంది: శ్రీ గోయల్
ఈ సౌకర్యం మరో మైలురాయి, భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న మైత్రి కి నిదర్శనం: శ్రీ గోయల్
Posted On:
05 FEB 2022 3:20PM by PIB Hyderabad
పాట్నా (బీహార్) నుండి పండూ (గౌహతి) వరకు నౌకలో ఆహార ధాన్యాల పైలట్ తరలింపు 'గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్'కు కొత్త మార్గం తెరుస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , ప్రజా పంపిణీ, జాళీ,
వాణిజ్య ,పరిశ్రమల మంత్రిశ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.పాట్నా నుండి పండూకు ఆహార ధాన్యాలను తీసుకు వెళ్లే ఎం వి లాల్ బహదూర్ శాస్త్రి నౌక కు జెండా ఊపి, కలూ ఘాట్(బీహార్) వద్ద టెర్మినల్ కు పునాది రాయిని వేసిన సందర్భంగా శ్రీ పీయూష్
గోయెల్ వర్చువల్ గా ప్రసంగించారు. ఈ 2,350 కిలోమీటర్ల నౌక ప్రయాణం 'గేట్ వే ఆఫ్ నార్త్ ఈస్ట్' (అస్సాం)కు కొత్త మార్గం
తెరుస్తుందని , గంగా ,బ్రహ్మపుత్ర నదుల ద్వారా ఈశాన్య ప్రాంతానికి అంతరాయం లేని జలమార్గాల కనెక్టివిటీని నిర్ధారిస్తుందని ఆయన అన్నారు. 'ఎంవి లాల్ బహదూర్ శాస్త్రి' అనే నౌక కు జెండా ఊపడం శాస్త్రిజీ నినాదం "జై జవాన్ జై కిసాన్"ను గుర్తు
చేస్తున్నదని ఆయన అన్నారు. "ఇది మన రైతులకు వారి పరిధిని విస్తరించడం ద్వారా, వారికి మెరుగైన ధరలు ,మెరుగైన జీవనాన్ని అందించడం ద్వారా ఆత్మ నిర్భర్ చేస్తుందని అన్నారు. ఈ కార్యకలాపం ప్రధానమంత్రి
ఉమ్మడి దార్శనికత అయిన 'యాక్ట్ ఈస్ట్' విధానం , బీహార్ - ఈశాన్య రీజియన్
సమ్మిళిత అభివృద్ధికి ఒక ఖచ్చితమైన
ప్రదర్శన అని ఆయన అన్నారు.
బీహార్ లోని కలూ ఘాట్ వద్ద రూ.78 కోట్లతో నిర్మించే ఇంటర్ మోడల్ టెర్మినల్ ఈ ప్రాంత సామాజిక-ఆర్థి కాభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుందని, బహుళ ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఇది ఉత్తర బీహార్ రహదారులపై రద్దీని తగ్గించడానికి , ఈ ప్రాంతంలో సరుకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించడానికి కూడా సహాయపడుతుంది. పాట్నా నుండి ఈ మార్గం ఎన్ఈ ప్రాంతానికి ఆహార ధాన్యాలు, వస్తువుల సంప్రదాయ రవాణా విధానానికి ఆచరణీయ ప్రత్యామ్నాయంగా నిరూపించగలదని ఆయన అన్నారు. ఇది ఈశాన్య ప్రాంతం అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎన్ ఈ ప్రాంతానికి అంతరాయం లేని నావిగేషన్ కోసం, బంగ్లాదేశ్ రూ. 305 కోట్ల బడ్జెట్ తో ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ (ఐబిపి) మార్గంలో రెండు మార్గాలను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు.మౌలిక సదుపా యాలు,సామాజిక అభివృద్ధి పథకాలకు నిధులు సమకూర్చడానికి
రూ.1,500 కోట్లతో బడ్జెట్లో ప్రకటించిన కొత్త పథకం ఈశాన్యం- పి ఎం- డివైన్ /యువత ,
మహిళలకు జీవనోపాధి కార్యకలాపాలకు వీలు కల్పిస్తుందని ఆయన తెలిపారు.
వాటర్‌వేస్ ఇన్‌ఫ్రా & ఎకోసిస్టమ్ సమగ్ర అభివృద్ధికి, మొత్తం కార్గో రవాణాలో అంతర్గత జల రవాణా వాటాను పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న నాలుగు చర్యలను వివరిస్తూ,
పి ఎం గతిశక్తి కింద, ఆర్థిక వృద్ధి & స్థిరమైన అభివృద్ధికి పరివర్తనాత్మక విధానాన్ని నడిపించే 7 ఇంజిన్‌లలో జలమార్గాలు ఒకటని శ్రీ గోయల్ అన్నారు.రవాణా వ్యయాన్ని తగ్గించడానికి ,ముఖ్యంగా రైతులు ,ఎంఎస్ ఎంఈ లకు అడ్డంకులను తొలగించడానికి ,సమర్థతను సాధించడానికి ఏడు ఇంజిన్లను ఉపయోగించాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ దార్శనికత అని ఆయన అన్నారు.2,000 టన్నుల వరకు నౌకలను సురక్షితంగా తీసుకెళ్లడం కోసం ఎన్ డబ్ల్యు-1 (గంగా) సామర్థ్య పెంపుదల కు ప్రభుత్వం జల్ మార్గ్ వికాస్ ప్రాజెక్ట్ ను రూ. 4,600 కోట్లతో చేపట్టిందని ఆయన తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో వారణాసి, సాహిబ్ గంజ్ ,హల్దియా, రో-రో టెర్మినల్స్, జెట్టీలు, నౌకల మరమ్మతు - నిర్వహణ సౌకర్యాలు మొదలైన వాటితో బహుళ మోడల్ టెర్మినల్స్ నిర్మాణం/ఏర్పాటు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.వాణిజ్య కేంద్రాలను ఓడరేవులతో అనుసంధానించడానికి సాగర్ మాల కింద ఎనభై కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో 106 కొత్త జలమార్గాలను జాతీయ జలమార్గాలుగా ప్రకటించామని, మొత్తం సంఖ్య 111 కి చేరిందని అన్నారు. ఈ నదుల అభివృద్ధిలో రివర్ షిప్పింగ్ , నావిగేషన్ , గోదాము సౌకర్యాల కోసం ఇన్ ఫ్రా నిర్వహణ ఉంటుందని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , షేక్ హసీనా ల నేతృత్వం లో భారత దేశం- బంగ్లాదేశ్ స్నేహం కొత్త శిఖరాలకు చేరుకుందని మంత్రి పేర్కొన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆహార భద్రత ,సాంకేతిక విజ్ఞానం లో బహుముఖ
సహకారంతో ఇరు దేశాల స్నేహం వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివృద్ధి చెందిందని
ఆయన చెప్పారు.ఈ సంఘటన మరో మైలురాయి అని, భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నిరంతరం పెరుగుతున్న స్నేహానికి నిదర్శనమని ఆయన అన్నారు.ఈ మొదటి ఆహార ధాన్యాల రవాణా -నేషనల్ వాటర్ వే-1 (గంగా నది), ఎన్ డబ్ల్యు-97 (సుందర్బన్స్), ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ (ఐబిపి) మార్గం, ఎన్ డబ్ల్యు-2 (బ్రహ్మపుత్ర నది) ద్వారా సమీకృత ఐడబ్ల్యుటి రవాణాగా ఉంటుంది.
కోవిడ్ లో ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార సరఫరా వ్యవస్థను నిర్వహించడంలో ఎఫ్ సిఐ చేస్తున్న కృషిని ప్రశంసించిన మంత్రి,
ఎఫ్ సిఐ దేశానికి జీవన రేఖగా ఉందని అన్నారు. పిఎంజికెఎవై కింద 80 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార భద్రతను విస్తరించామని, కోవిడ్ మహమ్మారి సమయంలో పిఎంజికెఎఇవై -1 నుంచి పిఎంజికెఎఇవై-V కింద ప్రభుత్వం 758 ఎల్ ఎం టి ఆహార ధాన్యాలను కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. వన్ నేషన్ -వన్ రేషన్ కార్డు పథకంతో 97% జనాభా అనుసంధాన మయ్యారని ఆయన తెలియజేశారు. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఎ అండ్ ఎన్ దీవులు, లక్షద్వీప్ మొదలైన సుదూర ప్రాంతాలకు కూడా ఎఫ్ సిఐ సేవలందిస్తున్నదని ఆయన చెప్పారు.ఇంతకు ముందు ఎన్ ఎఫ్ ఆర్ లో గేజ్ మార్పిడి సమయంలో 2014-15 నుంచి 2016-17 వరకు ఎఫ్ సి ఐ ~22కె ఎమ్ టి ఆహార ధాన్యాలను ఐబిపి జలమార్గం మార్గం ద్వారా అగర్తలాకు తరలించిందని చెప్పారు. ఆహార ధాన్యాల నదీ రవాణాతో ఎఫ్ సిఐ అనుకూలతను మెరుగుపరచడంతో పాటు గోదాములను అప్ గ్రేడ్ చేయడం, చౌర్యం తగ్గించడానికి ప్యాకింగ్ ను మెరుగుపరచడం, షెల్ఫ్ లైఫ్ పెంచడం, సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత ఉపయోగించడం పై సూచనలను మంత్రి ఆహ్వానించారు.
"భారత దేశం ప్రపంచం లోని ఒక ప్రధాన బ్లూ ఎకానమీగా ఎదుగుతోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ప్రభుత్వం జలమార్గాలలో పెట్టుబడులు పెడుతోంది" అన్న ప్రధానమంత్రి మాటలు ప్రస్తావిస్తూ-షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ,ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) సహకారంతో ఎఫ్ సిఐ అత్యంత పర్యావరణ-స్నేహపూర్వక, పరిశుభ్రమైన ,చౌకైన రవాణా విధానం అయిన రివరైన్ రవాణా ను అన్వేషించడం, పెంచడం కొనసాగిస్తుందని శ్రీ గోయేల్ తెలిపారు.
శ్రీ సర్బానంద్ సోనోవాల్, కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ జలమార్గాలు ,ఆయుష్ మంత్రి . శ్రీ అశ్వినీ కుమార్ చౌబే, సిఎఎఫ్ పిడి ,పర్యావరణం, అటవీ ,వాతావరణ మార్పుల శాఖల సహాయ మంత్రి, శ్రీ శ్రీ పాద్ నాయక్, ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాలు ,పర్యాటక శాఖల సహాయ మంత్రి, శ్రీ శాంతను ఠాకూర్, ఓడరేవులు, షిప్పింగ్ ,జలమార్గాల సహాయమంత్రి, బీహార్ డిప్యూటీ సిఎంలు, పార్లమెంటు సభ్యులు శ్రీ రవిశంకర్ ప్రసాద్, శ్రీ సుశీల్ కుమార్ మోడీ, శ్రీ సుశీల్ కుమార్ మోడీ శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ, శ్రీ నంద్ కిశోర్ యాదవ్, ఎమ్మెల్యే పాట్నా సాహిబ్ ఐడబ్ల్యుఎఐ అధ్యక్షుడు 'ఎంవి లాల్ బహదూర్ శాస్త్రి' నౌకను జెండా ఊపి కలూ ఘాట్ (బీహార్) వద్ద టెర్మినల్ కు పునాది రాయి ఫలకాన్ని ఆవిష్కరించారు. ఇన్ లాండ్ వెసల్స్ పై సిబ్బంది కోసం శిక్షణా పత్రాలను కూడా ప్రముఖులు విడుదల చేశారు. శ్రీ పీయూష్ గోయల్ ఈ కార్యక్రమంలో వర్చువల్ గా చేరారు. శ్రీ ఖలీద్ మొహద్. బంగ్లాదేశ్ షిప్పింగ్ మంత్రి చౌదరి కూడా ఈ కార్యక్రమానికి వర్చువల్ గా హాజరయ్యారు.నౌకాశ్రయాలు, షిప్పింగ్ ,జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఎఐ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
నేపథ్య సమాచారం
పాట్నా నుండి పండూకు ఆహార ధాన్యాలను తీసుకువెళుతున్న ‘ఎంవి లాల్ బహదూర్ శాస్త్రి నౌక ‘ ను ఫ్లాగ్ ఆఫ్ చేశారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన 200 మెట్రిక్ టన్ను ఆహార ధాన్యాలను తీసుకువెళుతున్న ఇన్లాండ్ నౌక ఎంవి లాల్ బహదూర్ శాస్త్రిని ఇన్ లాండ్ వాటర్ టెర్మినల్ గైఘాట్ పాట్నా నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఇన్ లాండ్ వాటర్ ట్రాన్స్ పోర్ట్ (ఐడబ్ల్యుటి) మార్గంలో ఇది మొదటి ఆహార ధాన్యాల రవాణా. 25-30 రోజుల సముద్రయానం నేషనల్ వాటర్ వే-1 (గంగా నది), ఎన్ డబ్ల్యు-97 (సుందర్ బన్స్), ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ (ఐబిపి) మార్గం, ఎన్ డబ్ల్యు-2 (బ్రహ్మపుత్ర నది) ద్వారా సమీకృత ఐడబ్ల్యుటి ఉద్యమంగా ఉంటుంది.
పాట్నా నుండి పండూ (గౌహతి) కు ప్రయాణంలో ఉన్నప్పుడు, లాల్ బహదూర్ శాస్త్రి నౌక భాగల్పూర్, మణిహరి, సాహిబ్ గంజ్, ఫరక్కా, త్రిబేనీ, కోల్ కతా, హల్దియా, హేమ్ నగర్, ఖుల్నా, నారాయణ్ గంజ్ సిరాజ్ గంజ్, చిల్మారి, ధుబ్రి మరియు జోగిఘోపా గుండా ప్రయాణిస్తుంది. 2350 కిలోమీటర్ల పొడవైన మార్గం ఈ బహుళ జలమార్గాలను ఉపయోగించి ఐడబ్ల్యుటి విధానం సాంకేతిక, వాణిజ్య సాధ్యతను స్థాపించాలని భావిస్తున్నారు. వస్తువుల రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాన్ని తెరవడం ద్వారా ఈశాన్య ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందించడమే ఐడబ్ల్యుటి కార్యాచరణ లక్ష్యం.
బీహార్ శరణ్ జిల్లాలోని కలూఘాట్ వద్ద ఐడబ్ల్యుఎఐ టెర్మినల్ పునాది రాతి ఫలకాన్ని ఆవిష్కరించడం: ఈ ప్రదేశం బీహార్ లోని శరణ్ జిల్లా వద్ద గంగా నదిపై ఉంది (పాట్నా ప్రధాన నగరం నుండి రహదారి ద్వారా ~25 కిలోమీటర్లు) మరియు టెర్మినల్ నేరుగా ఎన్ హెచ్ 19కు అనుసంధాన మయింది. ఈ టెర్మినల్ ను రూ.78.28 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఒక బెర్త్ తో టెర్మినల్ సామర్థ్యం సంవత్సరానికి 77,000 టిఇయు గా ఉంటుంది. కంటైనర్ ట్రాఫిక్ ను
నిర్వహించేలా టెర్మినల్ నూ డిజైన్. చేశారు.
ట్రక్కులు, వాహనాలు, ఆపరేటింగ్, మెయింటెనెన్స్ ఎక్విప్ మెంట్ కదలిక కోసం అప్రోచ్ ట్రెస్టిల్స్ ద్వారా బెర్త్ కనెక్ట్ చేయబడుతుంది. రోడ్లు, డ్రైనేజీ, మురుగునీరు, నీటి సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థ వంటి తీర ప్రాంత సౌకర్యాలను టెర్మినల్ అభివృద్ధిలో భాగంగా అభివృద్ధి చేస్తారు.
ఈ టెర్మినల్ నిర్మాణం ఉత్తర బీహార్ లోని క్రిక్కిరిసిన రోడ్ల పై రద్దీ తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంకా ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా నేపాల్ కు సరుకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తుంది.
****
(Release ID: 1795820)
Visitor Counter : 161