రక్షణ మంత్రిత్వ శాఖ
సముద్రంలో గాయపడిన మత్స్యకారునికి వైద్య సహాయం అందించిన ఐఎన్ఎస్ ఆదిత్య
Posted On:
04 FEB 2022 12:13PM by PIB Hyderabad
03 ఫిబ్రవరి 2022న గోవాకు పశ్చిమాన 75 నాటికల్ మైళ్ల దూరంలో తీవ్రంగా గాయపడిన ఎఫ్ఓ హోనాథన్ అనే ఫిషింగ్ బోట్‌కు చెందిన మత్స్యకారుడు గాయపడి బాధలో ఉన్నట్టుగా సమాచారం అందుకున్న ఐఎన్ఎస్ ఆదిత్య ఆయనకు తక్షణ వైద్య సహాయం అందించింది. విపిన్ అనే మత్స్యకారుని కుడి చేతికి తీవ్రమైన గాయం తగిలింది, ఫలితంగా అధిక రక్తస్రావం మరియు రక్తం-ఆక్సిజన్ స్థాయిలు తగ్గాయి. సమాచారం అందుకున్న ఐఎన్ఎస్ ఆదిత్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన మత్స్యకారున్ని పైకి తీసుకువచ్చి. ఫిషింగ్ బోట్‌లోనే ఆయనుకు ఆక్సిజన్ మరియు ప్రథమ చికిత్స అందించింది. విపిన్ కుడి చేతికి సంబంధించిన పలు వేళ్లపై గాయం కలిగింది. ఆయన వేళ్లు పగిలి బాధను ఎదుర్కొన్నాడు. రక్తస్రావం ఆపడానికి మరియు హేమోడైనమిక్ స్టెబిలైజేషన్ సాధించేలా చేసేందుకు ఆయనకు విమానంలో చికిత్స అందించారు. ఐఎన్‌ఎస్ ఆధిత్య పడవలోని సిబ్బందికి తగినంత వండిన ఆహారాన్ని అందించింది. గాయపడిన మత్స్యకారుడి పరిస్థితి నిలకడగా ఉంది. చికిత్స అనంతరం ఆయనను తన పడవలోని సహోద్యోగులతో చేర్చారు.
***
(Release ID: 1795667)
Visitor Counter : 148