ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సూక్ష్మ పరిశ్రమలకు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ
Posted On:
04 FEB 2022 2:13PM by PIB Hyderabad
అత్మనిర్భర్ భారత్ చొరవ లో భాగంగా, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రాయోజిత -మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పిఎమ్ ఎఫ్ ఎమ్ ఈ) పథకాన్ని అమలు చేస్తోంది, 2020-21 నుంచి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలంలో క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ ద్వారా 2 లక్షల మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఏర్పాటు/అప్ గ్రేడేషన్ కోసం ఆర్థిక, సాంకేతిక వ్యాపార మద్దతును అందించడానికి.రూ.10,000 కోట్ల గ్రాంట్ మంజూరు చేసింది.
రుణ లభ్యత పెంపు, బ్రాండింగ్ ,మార్కెటింగ్ ను బలోపేతం చేయడం ద్వారా వ్యవస్థీకృత సరఫరా గొలుసుతో ఇంటిగ్రేషన్, సాధారణ సేవలకు ప్రాప్యత పెరగడం, సంస్థలను బలోపేతం చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిశోధన -శిక్షణ ద్వారా సూక్ష్మ సంస్థలకు మద్దతు ఇవ్వడం ఈ పథకం లో భాగం.
ఈ పథకం కింద మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లకు మద్దతు వివరాలు దిగువ పేర్కొన్న విధంగా ఉన్నాయి.
(i). వ్యక్తిగత సూక్ష్మ సంస్థలకు మద్దతు: క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ గ్రాంట్ @అర్హత కలిగిన ప్రాజెక్ట్ ఖర్చులో 35%, గరిష్ట సీలింగ్ యూనిట్ కు రూ.10 లక్షలు;
(ii). ఎఫ్ పివోలు/ఎస్ హెచ్ జిలు/ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ లకు మద్దతు: సార్టింగ్, గ్రేడింగ్, స్టోరేజీ, కామన్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, టెస్టింగ్ మొదలైన వాటి మొత్తం విలువ గొలుసు వెంబడి ఎఫ్ పివోలు/ఎస్ హెచ్ జిలు/ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ లు వంటి క్లస్టర్ లు , గ్రూపులకు మద్దతు ఇవ్వడానికి క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ @35%.
(iii). స్వయం సహాయక సంస్థలకు సీడ్ క్యాపిటల్ మద్దతు: ఫుడ్ ప్రాసెసింగ్ లో ఉన్న ఎస్ హెచ్ జి సభ్యుడికి వర్కింగ్ క్యాపిటల్ , చిన్న పని ముట్లు కొనుగోలు కోసం
సీడ్ క్యాపిటల్ @ రూ. 40,000/- .
(iv). ఉమ్మడి మౌలిక సదుపాయాలకు మద్దతు: ఎఫ్ పిఒలు, ఎస్ హెచ్ జిలు, కోఆపరేటివ్ లు, ఏదైనా ప్రభుత్వ ఏజెన్సీ లేదా ప్రయివేట్ సంస్థలు ఉమ్మడి మౌలిక సదుపాయాలు కోసం మద్దతు ఇవ్వడానికి క్రెడిట్ లింక్డ్ గ్రాంట్ @ 35%. సామర్ధ్యంలో గణనీయమైన భాగాన్ని అద్దె ప్రాతిపదికన ఇతర యూనిట్లు , ప్రజలకు కూడా ఉమ్మడి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
(v). బ్రాండింగ్ , మార్కెటింగ్ సపోర్ట్: ఎఫ్ పివోలు/ఎస్ హెచ్ జిలు/కోఆపరేటివ్ లు లేదా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల ఎస్ పివి కి బ్రాండింగ్ , మార్కెటింగ్ కోసం 50% వరకు గ్రాంట్ .
(vi). కెపాసిటీ బిల్డింగ్: ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ,ప్రొడక్ట్ నిర్ధిష్ట స్కిల్లింగ్
అవసరాలను తీర్చడం కోసం ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ కింద శిక్షణ
ఈ పథకం మార్కెటింగ్ , బ్రాండింగ్ కాంపోనెంట్ కింద, సూక్ష్మ సంస్థలకు దిగువ మద్దతు కల్పించారు:
(i) ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్ సహా కామన్ బ్రాండ్, ప్యాకేజింగ్ అభివృద్ధి (2) జాతీయ, ప్రాంతీయ రిటైల్ చైన్లు, రాష్ట్ర స్థాయి సంస్థలతో మార్కెటింగ్ అనుసంధానం
(iii) ప్రొడక్ట్ నాణ్యత అవసరమైన ప్రమాణాలను చేరుకునేలా చూడటం కోసం నాణ్యతా నియంత్రణ (iv) మార్కెటింగ్ కు సంబంధించిన ట్రైనింగ్.
మార్కెట్ అధ్యయనం, ప్రొడక్ట్ ప్రామాణీకరణ (నాణ్యతా భరోసాతో సహా), ప్యాకేజింగ్ మెటీరియల్, గ్రాఫిక్ డిజైనింగ్, గోదాము/స్టోరేజీ అద్దెలు, ప్రమోషనల్ యాక్టివిటీస్, సేల్స్ ,మార్కెటింగ్ ,ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన ట్రైనింగ్ మొదలైనవి ఈ పథకం కింద మద్దతు పొందడానికి ప్రధాన అర్హత కలిగిన కాంపోనెంట్ లు.
ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ శుక్రవారం రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
*****
(Release ID: 1795664)
Visitor Counter : 195