సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

కోవిడ్ సమయంలో ఎం.ఎస్.ఎం.ఈ. లకు ఆర్థిక సహాయం

Posted On: 03 FEB 2022 5:21PM by PIB Hyderabad

భారత ప్రభుత్వం స్వావలంబన భారతదేశం (ఎస్.ఆర్.ఐ) నిధిని ప్రారంభించింది, ఇది ఎం.ఎస్.ఎం.ఈ. ల వృద్ధికి వినియోగించే నిధులను విస్తరించడానికి ఉద్దేశించిన నిధుల నిధి. 

ఎస్.ఆర్.ఐ. నిధి ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:-

· ఈక్విటీ, క్వాసీ-ఈక్విటీ, రుణాలు (సంబంధిత సెబీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించబడిన విధంగా) ద్వారా వృద్ధి మూలధనంగా అనుబంధ నిధులకు, నిధుల మద్దతును అందించడం.

· ఎం.ఎస్.ఎం.ఈ. ల వేగవంతమైన వృద్ధికి మద్దతు ఇవ్వడం; తద్వారా ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం; ఉపాధి అవకాశాలను సృష్టించడం.

· ఎం.ఎస్.ఎం.ఈ. పరిధి దాటి క్రమంగా అభివృద్ధి చెందడానికి; జాతీయ / అంతర్జాతీయ ఛాంపియన్లు గా మారడానికి ఎం.ఎస్.ఎం.ఈ. లకు మద్దతు ఇవ్వడానికి.

· సంబంధిత సాంకేతికతలు, వస్తువులు, సేవలను ఉత్పత్తి చేయడం ద్వారా భారతదేశాన్ని స్వావలంబన దిశగా మార్చడంలో సహాయపడే ఎం.ఎస్.ఎం.ఈ. లకు మద్దతు ఇవ్వడం.

·     ఎం.ఎస్.ఎం.ఈ.లలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి ఉన్న ఇతర చిన్న నిధుల జాబితా తయారు చేయడం.

·     ఎం.ఎస్.ఎం.ఈ.లలో పెట్టుబడి పెట్టిన నిధుల్లో 20 శాతం ఎస్.ఆర్.ఐ. నిధి ద్వారా అందించడం జరుగుతుంది.

·     ఎం.ఎస్.ఎం.ఈ.డి. చట్టంలో ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఎం.ఎస్.ఎం.ఈ. లు, సానుకూల వృద్ధి పథాన్ని కలిగి, వృద్ధి కోసం నిర్వచించిన వ్యాపార ప్రణాళికను కలిగి ఉన్నట్లు, అంచనా వేసిన తర్వాత, వాటిని, ఆచరణీయమైనవిగా గుర్తించడం జరుగుతుంది.  ఇందుకోసం, గడిచిన మూడు సంవత్సరాల సి.ఏ.జి.ఆర్. ను పరిగణించడం జరుగుతుంది. 

· లాభాపేక్ష లేని సంస్థలు, ఎన్.బి.ఎఫ్.సి., ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ సెక్టార్, మైక్రో క్రెడిట్ సెక్టార్, ఇతర ఆర్థిక మధ్యవర్తులు పరిశీలనకు అర్హులు కాదు.

ఒక్కో ఎం.ఎస్.ఎం.ఈ. కి సగటున 10.00 కోట్ల రూపాయలు చొప్పున పెట్టుబడి అనుకుంటే, దాదాపు 5,000 ఎం.ఎస్.ఎం.ఈ.లు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

ఈ పథకం కింద ఆర్థిక సహాయం వారి వ్యాపారాన్ని విస్తరించడానికి, జాతీయ / అంతర్జాతీయ ఛాంపియన్లు గా మారడానికి,  ఆచరణీయ ఎం.ఎస్.ఎం.ఈ. ల ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్దేశించబడింది.

"ఎన్.ఎస్.ఓ.సి. వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్" అనే పేరుతో ఒక ప్రత్యేక ప్రయోజన సంస్థ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతోంది.   ఎన్.ఎస్.ఓ.సి. వెంచర్ క్యాపిటల్ ఫండ్ లిమిటెడ్ అందజేసిన సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 1,080 కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని ఆమోదించడం జరిగింది. 

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే ఈ రోజు లోక్‌సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

*****



(Release ID: 1795296) Visitor Counter : 115


Read this release in: English , Urdu , Manipuri , Tamil