కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉపాధి కల్పించడానికి పట్టణ ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఏ. కార్యక్రమం

Posted On: 03 FEB 2022 3:44PM by PIB Hyderabad

కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (ఎం.ఓ.ఎస్.పి.ఐ) కు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్.ఎస్.ఓ) నిర్వహించిన నిర్ణీత కాలపరిమితిలో చేసిన కార్మిక శక్తి సర్వే (పి.ఎల్.ఎఫ్.ఎస్) ద్వారా 2017-18 నుంచి ఉపాధి / నిరుద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడం జరిగింది.   2019-20 సంవత్సరానికి చెందిన తాజా పి.ఎల్.ఎఫ్.ఎస్. నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో సాధారణ స్థితి ఆధారంగా 15 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల నిరుద్యోగం రేటు 6.9 శాతంగా ఉంది.  కాగా, ఇది 2018-19 సంవత్సరంలో 7.6 శాతం, 2017-18 సంవత్సరంలో 7.7 శాతంగా ఉంది. 

2021 ఏప్రిల్ నెలలో, ప్రభుత్వం, సంస్థల ఆధారంగా అఖిల భారత త్రైమాసిక ఉపాధి సర్వే (ఏ.క్యూ.ఈ.ఈ.ఎస్) ని ప్రారంభించింది.  క్యూ.ఈ.ఎస్. మొదటి విడత (2021 ఏప్రిల్-జూన్) లో  3.08 కోట్లు గా ఉన్న ఆర్థిక వ్యవస్థ లోని ఎంపిక చేసిన తొమ్మిది రంగాల్లో ఉపాధి, 2021 జూలై-సెప్టెంబర్ కాలానికి రెండవ విడత త్రైమాసిక ఉపాధి (క్యూ.ఈ.ఎస్) ఫలితాల ప్రకారం, 3.10 కోట్లకు పెరిగింది. కాగా, ఆరవ ఆర్థిక గణన (2013-14) ప్రకారం, ఈ రంగాల్లో మొత్తం ఉపాధి 2.37 కోట్లుగా ఉంది. ఎంచుకున్న ఈ తొమ్మిది రంగాల్లో అంచనా వేసిన మొత్తం ఉపాధిలో, తయారీ రంగం దాదాపు 39 శాతం కాగా,  ఆ తర్వాతి స్థానాల్లో విద్య 22 శాతం; ఆరోగ్యంతో పాటు ఐ.టి/బి.పి.ఓ. రంగాలు రెండు కలిపి సుమారు 10 శాతం తో ఉన్నాయి.  మొత్తం అంచనా కార్మికులలో వాణిజ్య రంగంలో 5.3 శాతం; రవాణా రంగంలో 4.6 శాతం కార్మికులు నిమగ్నమై ఉన్నారు.

కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ ఈ రోజు రాజ్యసభలో ఈ సమాచారాన్ని తెలియజేశారు.

*****

 


(Release ID: 1795294) Visitor Counter : 178