అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

2022 ఆగస్టు లో చంద్రయాన్-3 ప్రయోగం .. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 03 FEB 2022 1:27PM by PIB Hyderabad

చంద్రయాన్-ని 2022 ఆగస్టు నెలలో ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తునట్టు కేంద్ర శాస్త్ర సాంకేతికభూ శాస్త్రసిబ్బంది వ్యవహారాలుప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష వ్యవహారాల సహాయ మంత్రి ( స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. నిన్న లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మంత్రి  ఈ వివరాలు అందించారు.  చంద్రయాన్-ప్రయోగంతో గడించిన అనుభవంజాతీయ నిపుణులు అందించిన సలహాలతో చంద్రయాన్-రూపు దిద్దుకుంటున్నదని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన హార్డువేర్ప్రత్యేక పరీక్షలు విజయవంతం అయ్యాయని అన్నారు. 2022 ఆగస్టులో చంద్రయాన్-ని ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. 

2022 లో ( జనవరి నుంచి డిసెంబర్ వరకు) 19 ప్రయోగాలను నిర్వహిస్తామని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు.  వీటిలో 

08 లాంచ్ వెహికల్ మిషన్‌లు, 07 స్పేస్‌క్రాఫ్ట్ మిషన్‌లు మరియు 04 టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్ మిషన్‌లు ఉన్నాయని  మంత్రి తెలియజేశారు.

కోవిడ్-19 వల్ల కొన్ని ప్రయాగాలకు అంతరాయం కలిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అంతరిక్ష రంగంలో అమలు చేసిన సంస్కరణలు, కొత్తగా ప్రవేశపెట్టిన డిమాండ్ ఆధారిత విధానాలతో కొన్ని ప్రాజెక్టుల ప్రాధాన్యతలు మారాయని ఆయన పేర్కొన్నారు. 

గత మూడు సంవత్సరాల్లో ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలు.. 

ఉపగ్రహం పేరు

ప్రయోగించిన  తేదీ

 

ఈఓఎస్-03

ఆగస్ట్ 12, 2021

అమెజోనియా-1

ఫిబ్రవరి 28, 2021

సతీష్ ధావన్ ఉపగ్రహం )

ఫిబ్రవరి 28, 2021

యూనిటీ శాట్ 

ఫిబ్రవరి 28, 2021

సీఎంఎస్-01

డిసెంబర్ 17, 2020

ఈఓఎస్-01

నవంబర్ 07, 2020

జి శాట్ -30

జనవరి 17, 2020

రి శాట్ -2బి ఆర్ ఐ 

డిసెంబర్ 11, 2019

కార్టోశాట్-3

నవంబర్ 27, 2019

చంద్రయాన్-2 

జూలై 22, 2019

రి శాట్ -2బి

మే 22, 2019

ఎమి శాట్ 

ఏప్రిల్ 01, 2019

జి శాట్ -31

ఫిబ్రవరి 06, 2019

మైక్రోసాట్-ఆర్

జనవరి 24, 2019

కలంశాట్-వి2

జనవరి 24, 2019

                                          

 ***


(Release ID: 1795274) Visitor Counter : 260