యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఖేలో ఇండియా పధకానికి 2022-23 బడ్జెట్ లో 48% పెరిగిన కేటాయింపులు


ఖేలో ఇండియా పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించిన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 02 FEB 2022 7:49PM by PIB Hyderabad

క్రీడల్లో ఎక్కువ మంది పాల్గొనేలా చూసిక్రీడాకారుల ప్రతిభను పెంచాలన్న లక్ష్యంతో ప్రారంభించిన ఖేలో ఇండియా జాతీయ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 15 వ ఆర్థిక సంఘం (2021-22 నుంచి 2025-26) కాలపరిమితిలో దీనిని 3165.50 కోట్ల రూపాయల ఖర్చుతో అమలు చేయడం జరుగుతుంది.

పథకాన్ని కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి క్రీడలుయువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఖేలో ఇండియా పథకాన్ని మరో అయిదు సంవత్సరాల వరకు కొనసాగించేందుకు ఆమోదం తెలిపిన ప్రధానమంత్రి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేసి క్రీడలకు జాతీయ స్థాయి ప్రాధాన్యత కల్పించారని శ్రీ అనురాగ్ ఠాకూర్ అన్నారు. 2022 బడ్జెట్ లో  పథకం కేటాయింపులు 48% పెరిగాయనిపథకం ప్రధానమంత్రి అవార్డుల పరిధిలో చేరిందని ఆయన వెల్లడించారు.

ఖేలో   ఇండియా పథకాన్ని  క్రీడలు యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ కింద కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ ప్రాధాన్యత కార్యక్రమంగా అమలు చేస్తోంది. దేశంలో క్రీడా సంస్కృతి ని పెంపొందించిక్రీడా ప్రమాణాలు మెరుగు పరిచి, ప్రజల్లో దాగి ఉన్న క్రీడా సామర్థ్యాన్ని వెలికి తీసి క్రీడా రంగంలో దేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లాలన్నది పథకం ప్రధాన లక్ష్యాలలో ఒకటి. క్రీడా మైదానాల అభివృద్ధి, శిక్షణలో ప్రజల భాగస్వామ్యం, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే విధంగా  క్రీడా పోటీలను నిర్వహించడం, పాఠశాల, విశ్వవిద్యాలయ స్థాయిలలో పాటు గ్రామీణ / సాంప్రదాయ క్రీడల పోటీలను నిర్వహించడంఅంగవైకల్యం కలిగి ఉన్నవారికిమహిళలకు క్రీడలను నిర్వహించడం, క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం,  విశ్వవిద్యాలయాల్లో క్రీడా కేంద్రాలను నెలకొల్పడం, ప్రతిభను గుర్తించి ప్రోత్సాహించడం, విద్యారంగంలో క్రీడలకు సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టడం, పాఠశాల విద్యార్థుల కోసం జాతీయ స్థాయి సౌష్టవ కార్యక్రమాన్ని అమలు చేయడం, శాంతి అభివృద్ధికి క్రీడలను ఉపయోగించడం లక్ష్యంగా ఖేలో ఇండియా పథకం అమలు జరుగుతోంది. 

ప్రస్తుతం ఉన్న ఖేలో ఇండియా పథకం ప్రాథమిక లక్ష్యాలుదృష్టి మరియు నిర్మాణం అలాగే ఉంచబడ్డాయి. అయితేఈ మంత్రిత్వ శాఖ ప్రస్తుత పథకాన్ని అమలు చేస్తున్న సమయంలో మంత్రిత్వ శాఖ, ఇతర సంస్థలు నిర్వహించిన సమీక్షల ద్వారా వెలుగు చూసిన అంశాలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పథకంలో ఒకే విధంగా ఉన్న కొన్ని అంశాలను  విలీనం చేయడం/ఉపయోగించడం ద్వారా పునర్వ్యవస్థీకరించి,  హేతుబద్దంగా  పథకాన్ని   అమలు చేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా గతంలో అమలు చేసిన విధంగా కాకుండా అయిదు భాగాలుగా అమలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇకపై  పథకం కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి అమలు జరుగుతుంది. 

 

 (i)         క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి 

 (ii)        క్రీడా పోటీలు మరియు ప్రతిభ అభివృద్ధి 

 (iii)       ఖేలో ఇండియా కేంద్రాలు మరియు స్పోర్ట్స్ అకాడమీలు 

 (iv)       ఫిట్ ఇండియా ఉద్యమం 

 (v)        క్రీడల ద్వారా సమగ్రతను ప్రోత్సహించడం

పథకంలో ఇతర అంశాలు, ఉత్తమ విధానాలను కొనసాగించి వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   అంతేకాకుండాపథకాన్ని సరళీకృత విధానంలో అమలు చేసికొన్ని అవసరం లేని అంశాలను తొలగించి పథకం  హేతుబద్ధీకరించబడింది. అలాగే, 'ఖేలో ఇండియా వింటర్ గేమ్స్' 'క్రీడల పోటీలు మరియు ప్రతిభ అభివృద్ధిభాగం కింద చేర్చబడ్డాయి. ఫిట్ ఇండియా ఉద్యమం’ ఒక ప్రత్యేక మరియు అంకితమైన అంశంగా ప్రవేశపెట్టబడింది.

అథ్లెట్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు జాతీయ స్థాయి వేదికను అందుబాటులోకి తెచ్చి, వారి ప్రతిభకు సాన పెట్టి దానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించాలన్న  ప్రాథమిక లక్ష్యంతో పథకం రూపొందింది.  ఖేలో ఇండియా గేమ్స్ ఈ ప్రయత్నానికి నాంది పలికాయి. 2017 నుండి 2021 వరకు ఖేలో ఇండియాలో భాగంగా మూడు సార్లు పాఠశాల, యువజన క్రీడా పోటీలను నిర్వహించడం జరిగింది. వీటితో పాటు  ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి పోటీలు, రెండు సార్లు  ఖేలో ఇండియా వింటర్ గేమ్స్  నిర్వహించడం జరిగింది. 

ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ఖేలో ఇండియా స్కాలర్‌షిప్‌ను గెలుచుకునే అవకాశం కల్పించడం,  అత్యుత్తమ కోచ్‌లు మరియు అత్యాధునిక స్పోర్టింగ్ కాంప్లెక్స్‌ల ద్వారా ఉన్నత స్థాయి పోటీల కోసం శిక్షణ పొందే అవకాశం కల్పించాలన్న లక్ష్యంతో నిర్వహించిన పోటీల్లో  20,000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు.  దాదాపు 3,000 మంది అథ్లెట్లు ఖేలో ఇండియా అథ్లెట్స్ గా గుర్తించబడ్డారువీరు ప్రస్తుతం ఖేలో ఇండియా అకాడమీలో, ఆధునీకరించిన సాయ్ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్నారువీరికి  నెలకు 10,000 రూపాయలను అవుట్ ఆఫ్ పాకెట్ అలవెన్స్ అందిస్తున్నారు. వీరికి  శిక్షణపరికరాలుఆహారం మరియు విద్య కోసం సహకారం అందిస్తున్నారు. 

ఖేలో ఇండియా పథకంలోని  యుటిలైజేషన్ అండ్ క్రియేషన్/అప్‌గ్రేడేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్” కింద మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కోసం  గ్రాంట్-ఇన్-ఎయిడ్ కూడా ఇవ్వబడింది. గత అయిదు సంవత్సరాల కాలంలో ఈ మంత్రిత్వ శాఖ వివిధ క్రీడా విభాగాలు మరియు క్రీడాకారులకు అవసరమైన  మౌలిక సదుపాయాలను కల్పించేందుకు 2,328.39 కోట్ల రూపాయల వ్యయంతో 282 పథకాల అమలుకు ఆమోదం తెలిపింది.   

 

***




(Release ID: 1794970) Visitor Counter : 150


Read this release in: Urdu , English , Hindi , Punjabi