రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నవ భారతానికి కొత్త దార్శనికతను ఇస్తున్న ఈ బడ్జెట్ చారిత్రాత్మకమని కొనియాడిన శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 01 FEB 2022 4:39PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ బడ్జెట్, కొత్త భారతదేశానికి కొత్త దార్శనికతను అందించే చారిత్రాత్మకమైనదిగా కొనియాడారు. ఇది ఖచ్చితంగా 21వ శతాబ్దపు దార్శనికమని, ఆర్థిక దృష్టి మరియు ప్రాధాన్యత ఈ బడ్జెట్ ద్వారా ఇప్పటికే నిర్ధారణ అయిందని ఆయన అన్నారు. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, రైతులు, గ్రామీణ భారతదేశం, వ్యవసాయ భారతదేశం గిరిజన భారతదేశం, గావ్, గరీబ్ మజ్దూర్ ఇన్సాన్, అన్ని రంగాల సంక్షేమం  ఈ బడ్జెట్‌లో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని శ్రీ గడ్కరీ అన్నారు. భారత్‌ మాల , సాగర్‌ మాలాతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు నిజంగా సంతోషంగా ఉందని, ఇప్పుడు పర్వత మాల కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. దీనిలో భాగంగా రోప్ వే, కేబుల్ కార్ ఏర్పాటు... దేశంలోని ముఖ్యంగా కొండ ప్రాంతాలకు గొప్ప బహుమతి అని తెలిపారు. ఇది ఈశాన్య, ఉత్తరాఖండ్, హిమాచల్, కాశ్మీర్‌లకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆయన అన్నారు. ఇది కేవలం వస్తువులకే కాకుండా పర్యాటక రంగానికి కూడా చాలా ముఖ్యమైనది, ఇది మరింత ఉపాధి అవకాశాలను సృష్టించగలదని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ బడ్జెట్‌ ప్రధానమంత్రి కొత్త దార్శనికతను ప్రతిబింబిస్తోందని, దేశం కోసం ఇంత అద్భుతమైన బడ్జెట్‌ను అందించినందుకు ఆర్థిక మంత్రికి ధన్యవాదాలని ఆయన తెలిపారు.

 

*****



(Release ID: 1794556) Visitor Counter : 142