భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

రోడ్‌షోలు, పాద యాత్ర‌లు, సైకిల్‌/ బైక్‌/ వాహ‌నాల ర్యాలీలు, ఊరేగింపుల‌పై నిషేధాన్ని ఫిబ్ర‌వ‌రి 11, 2022వ‌ర‌కు పొడిగించిన ఇసిఐ


భౌతిక ప్ర‌జా స‌మావేశాలు, ఇన్‌డోర్ స‌మావేశాలు, ఇంటింటి ప్ర‌చారాల‌కు అనుమ‌తించిన సంఖ్య‌ల‌లో స‌డ‌లింపు

ఇన్ఫెక్ష‌న్ ప్ర‌బ‌ల‌డాన్ని నివారించేందుకు అనుస‌రించ‌వ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల కొన‌సాగింపు

నాడు పోస్టు చేయడమైనది: 31 JAN 2022 5:53PM by PIB Hyderabad

నిర్ధిష్టంగా గోవా, మ‌ణిపూర్‌, పంజాబ్‌, ఉత్త‌రాఖండ్, ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు స‌హా కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తి పై సోమ‌వారం నాడు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ్రీ సుశీల్ చంద్ర‌, ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు శ్రీ రాజీవ్ కుమార్‌, శ్రీ అనూప్ చంద్ర పాండేతో క‌లిసి స‌మ‌గ్ర స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. సెక్రెట‌రీ జ‌న‌ర‌ల్‌, సంబంధిత డిప్యూటీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ల‌తో క‌లిసి క‌మిష‌న్ భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న ఐదు రాష్ట్రాల ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారుల‌తో దృశ్య మాధ్యమం ద్వారా ప్ర‌స్తుత ప‌రిస్థితిని, కోవిడ్ మ‌హ‌మ్మారికి సంబంధించి అంచ‌నా వేసిన పోక‌డ‌లను అంచ‌నా వేశారు. ఈ రాష్ట్రాల‌లో అర్హులైన వ్య‌క్తుల‌కు తొలి, రెండ‌వ డోసు టీకాక‌ర‌ణ ప్ర‌స్తుత ప‌రిస్థితిని, అలాగే ఎన్నిక‌ల సిబ్బందికి చేస్తున్న ఏర్పాట్ల‌ను గురించి లోతుగా చ‌ర్చించారు. 
అన్ని రాష్ట్రాల ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నేటి తేదీకి కోవిడ్ 19 ఇన్ఫెక్ష‌న్ చ‌దునుగా ఉండ‌టం లేదా త‌గ్గుతున్న దాఖ‌లాలు క‌నిపిస్తున్న‌ట్టు క‌మిష‌న్‌కు తెలియ‌చేశారు. పాజిటివిటీ రేటు త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని, ఆసుప‌త్రిలో చేరుతున్నవారి కేసుల సంఖ్య కూడా త‌గ్గుతున్న సూచ‌న‌లు ఉన్నాయ‌ని కూడా వారు తెలిపారు. అయితే, కోవిడ్ ప్రోటోకాల్‌కు సంబంధించిన జాగ్ర‌త్త‌లను పాటించ‌డాన్ని కొన‌సాగించాల‌ని, త‌ద్వారా రాజ‌కీయ కార్య‌క‌లాపం తీవ్ర‌మైన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఒక‌చోట గుమిగూడ‌డంతో మ‌ళ్ళీ విజృంభించ‌కుండా ఉంటుంద‌ని రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. భౌతిక ర్యాలీలు, అంత‌ర్గ‌త‌/ బ‌హిరంగ స‌మావేశాలుపై ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంపై చ‌ర్చిస్తూ, ఇంటింటికీ వెళ్లి ప్ర‌చారం, క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌లు ఉత్త‌ర్వుల‌ను అమ‌లు అన్న‌వి ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఖ‌రారు చేయాల‌ని ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ శ్రీ సుశీల్ చంద్ర ఉద్ఘాటించారు. 
రాష్ట్ర అధికారులు, భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య కార్య‌ద‌ర్శి ఇన్‌పుట్ల‌ను, వాస్త‌వాలు, ప‌రిస్థితులు, క్షేత్ర‌స్థాయి నివేదిక‌ల‌ను  ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత‌, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల కోసం రాజ‌కీయ పార్టీలు అవ‌స‌ర‌మైన రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను సాగించేందుకు, క‌మిష‌న్ దిగువ‌న పేర్కొన్న నిర్ణ‌యాల‌ను తీసుకుందిః 
ఫిబ్ర‌వ‌రి 11, 2022 వ‌ర‌కు రోడ్‌షోలు, పాద యాత్ర‌లు, సైకిల్‌/  బైక్‌/  వాహ‌నాల ర్యాలీలు, ఊరేగింపుల‌కు అనుమ‌తి లేదు.
ప్ర‌స్తుతం క‌మిష‌న్ నిర్దేశిత బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో గ‌రిష్టంగా 1000 వ్య‌క్తులు (ప్ర‌స్తుత‌మున్న 500కు బ‌దులుగా) లేదా గ్రౌండ్‌లో 50% సామ‌ర్ధ్యంతో లేక ఎస్‌డిఎంఎ నిర్దేశించిన ప‌రిమితులు - ఏసంఖ్య త‌క్కువ అయితే దానితో రాజ‌కీయ పార్టీలు లేదా పోటీ చేస్తున్న అభ్య‌ర్థులు  బ‌హిరంగ స‌మావేశాల‌ను ఫిబ్రవ‌రి 1, 2022 నుంచి అన్ని ద‌శ‌ల్లోనూ అనుమ‌తించాల‌ని క‌మిష‌న్ నిర్ణ‌యించింది. 
ఇంటింటికీ వెళ్ళి చేసే ప్ర‌చారాల ప‌రిమితిని క‌మిష‌న్ పెంచింది. భ‌ద్ర‌తా సిబ్బందిని మిన‌హాయించి 10మంది వ్య‌క్తుల‌కు బ‌దులుగా 20 మంది వ్య‌క్తుల‌ను ఇంటింటికి వెళ్ళి ప్ర‌చారం చేసేందుకు అనుమ‌తిస్తారు. ఇంటింటి ప్ర‌చారానికి సంబంధించి ఇత‌ర ఆదేశాలు కొన‌సాగుతాయి. 
అలాగే 500 మంది వ్య‌క్తుల‌తో (300మందికి బ‌దులుగా) లేదా హాల్ సామ‌ర్ధ్యంలో 50% లేదా ఎస్‌డిఎంఎ నిర్దేశించిన ప‌రిమితుల‌కు లోబ‌డి ఇన్‌డోర్ స‌మావేశాల‌ను రాజ‌కీయ పార్టీలు నిర్వ‌హించేందుకు నిబంధ‌న‌ల‌ను క‌మిష‌న్ స‌డ‌లించింది.
 ఎన్నిక‌ల‌కు సంబంధించిన కార్య‌క‌లాపాల సంద‌ర్భంగా అన్ని స‌మ‌యాల్లోనూ రాజ‌కీయ పార్టీలు, పోటీ చేస్తున్న అభ్య‌ర్ధులు కోవిడ్ త‌గిన ప్ర‌వ‌ర్త‌ను & మార్గ‌ద‌ర్శ‌కాల‌ను, ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళిని అనుస‌రించ‌వ‌ల‌సి ఉంటుంది. 
పైన పేర్కొన్న కార్య‌క్ర‌మాల కోసం ముంద‌స్తుగా నిర్దేశిత ప్రదేశాల‌ను గుర్తించి నోటిఫై చేయ‌వ‌ల‌సిన బాధ్య‌త స‌బంధిత డిఇఒల‌ది. 
ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు జ‌న‌వ‌రి 8, 2022న జారీ చేసిన  స‌వ‌రించిన విస్త్ర‌త మార్గ‌ద‌ర్శ‌కాల‌లో పేర్కొన్న నిబంధ‌న‌లు కొన‌సాగుతాయి. 

***


(రిలీజ్ ఐడి: 1794020) సందర్శకుల సూచీ సంఖ్య : : 154
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Manipuri , English , Urdu , हिन्दी , Bengali , Punjabi