ఆర్థిక మంత్రిత్వ శాఖ
2021-22 లో గణనీయంగా పుంజుకున్న భారత విదేశీ వాణిజ్యం
2021-22 నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా అడుగులు
2021-22 లో 400 బిలియన్ అమెరికా డాలర్ల ఎగుమతులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న భారత్
23.2% వృద్ధి సాధించిన వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతులు
భారీగా విదేశీ పెట్టుబడులు రావడంతో విదేశీ మారక నిల్వలు పెరిగాయని వెల్లడించిన ఆర్థిక సర్వే
పెద్ద మొత్తంలో విదేశీ మారక నిల్వలు కలిగివున్న ప్రపంచ దేశాల్లో నాల్గవ స్థానంలో నిలిచిన భారతదేశం
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతున్న విదేశీ వాణిజ్యం
సవాళ్ళను ఎదుర్కొనేందుకు విదేశీ వాణిజ్య రంగం సిద్ధంగా ఉందని పేర్కొన్న సర్వే
Posted On:
31 JAN 2022 2:59PM by PIB Hyderabad
కోవిడ్ ప్రభావం తో తిరోగమన పరిస్థితిని ఎదుర్కొన్న భారత ఆర్థిక వ్యవస్థ 2021-22 లో పుంజుకుని అభివృద్ధి పధంలో పయనిస్తోంది. పెట్టుబడుల ప్రవాహం పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి. ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22 ఆర్థిక సర్వే నివేదికలో తాజా ఆర్థిక పరిస్థితిని పొందుపరిచారు. పెరుగుతున్న విదేశీ వాణిజ్య కార్యకలాపాలు దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు తోడ్పడుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కోవిడ్-19 తిరిగి తలెత్తడం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, పెరుగుతున్న రవాణా ఖర్చులు లాంటి అంశాల పట్ల దేశం అప్రమత్తంగా ఉండాలని నివేదిక హెచ్చరించింది.
విదేశీ వాణిజ్యం :
దేశంలో ఆర్థిక కార్యక్రమాలు పుంజుకోవడం, విదేశాల్లో డిమాండ్ పెరగడంతో దేశ ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి. కోవిడ్-19 ముందు నాటి స్థాయికి మించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు, దిగుమతులు జరిగాయని ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ప్రభుత్వం సరైన అమలు చేసిన చర్యల ప్రభావంతో ఎగుమతులు పెరిగాయని నివేదిక పేర్కొంది. 2021 ఏప్రిల్- నవంబర్ నెలల మధ్య అమెరికా, యూఏఈ, చైనా దేశాలకు ఎక్కువగా ఎగుమతులు జరిగాయి. చైనా, యూఏఈ, అమెరికా దేశాల నుంచి దిగుమతులు ఎక్కువగా జరిగాయి. పర్యాటక ఆదాయం తగ్గినప్పటికీ సాఫ్ట్‌వేర్ మరియు వ్యాపార లావాదేవీలు పెరిగాయి. దీనితో కోవిడ్-19 పూర్వ స్థితికి మించి రాబడులు, చెల్లింపులు జరిగాయి.

2021 మొదటి ఆరు నెలల కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమన దిశలో ప్రయాణం మొదలు పెట్టిందని ఆర్థిక సర్వే నివేదిక పేర్కొంది. దీనితో వ్యాపార లావాదేవీలు పుంజుకుని మహమ్మారి ఏర్పడక ముందు ఉన్న స్థాయికి చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. 2021 ఏప్రిల్-డిసెంబర్ నెలల మధ్య ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిమాణాలకు అనుగుణంగా భారత వస్తువుల ఎగుమతులు జరిగాయి. గత ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే ఈ వృద్ధి 49.7% వరకు, 2019-20 ( ఏప్రిల్-డిసెంబర్) తో పోల్చి చూస్తే 26.5% వరకు ఉందని నివేదికలో పేర్కొన్నారు. 2021-22 లో 400 బిలియన్ అమెరికా డాలర్ల విలువ చేసే ఎగుమతులు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న భారతదేశం ఇప్పటికే 75% లక్ష్యాలను చేరుకుంది. 2021-22 లక్ష్యాలను దేశం పూర్తిగా సాదిస్తుందని నివేదిక పేర్కొంది. ముఖ్యమైన మార్కెట్ లలో వస్తున్న సానుకూల మార్పులు, పెరిగిన వినియోగదారుల వ్యయం, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ఉద్దీపన చర్యలు, ఎగుమతుల ప్రోత్సాహక చర్యల వల్ల 2021-22 లో దేశ ఎగుమతుల రంగం అభివృద్ధి సాధించింది. అన్ని రకాల ఉత్పతుల ఎగుమతుల్లో పెరుగుదల కనిపించింది. గత ఏడాది ఇదే సమయంలో జరిగిన ఎగుమతులతో పోల్చి చూస్తే 2021 ఏప్రిల్-నవంబర్ నెలల మధ్య వ్యవసాయం, దాని అనుబంధ ఉత్పత్తుల ఎగుమతులు 23.2% వరకు వృద్ధి చెందాయి. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దిశగా ముందుకు సాగడం భారత దేశ ఎగుమతుల వైవిధ్యీకరణకు సంస్థాగత ఏర్పాట్లను అందించడంలో సహాయపడుతుందని సర్వే సిఫార్సు చేసింది.
సరుకుల దిగుమతుల అంశాన్ని ప్రస్తావించిన సర్వే నివేదిక భారతదేశం దేశీయ డిమాండ్‌లో పునరుద్ధరణను జరిగిందని దీనితో దిగుమతులు పెరిగాయని పేర్కొంది. గత సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ ల మధ్య జరిగిన దిగుమతులతో పోల్చి చూస్తే 2021 ఏప్రిల్-డిసెంబర్ ల మధ్య సరుకుల దిగుమతులు 68.9% , ఏప్రిల్-డిసెంబర్ 2019 ఏప్రిల్-డిసెంబర్ లతో పోల్చి చూస్తే 21.9% వృద్ధి చెందాయి, ఇది మహమ్మారి ముందు స్థాయిని దాటింది. ఏప్రిల్-నవంబర్ మధ్య చైనా నుంచి జరుగుతున్న దిగుబడులు 17.7% నుంచి 15.5%కితగ్గాయి. ఇది భారతదేశం దిగుమతుల మూలాల వైవిధ్యం పెరిగినట్లు సర్వే పేర్కొంది. ఏప్రిల్-డిసెంబర్ 2021లో సరుకుల వాణిజ్య లోటు 142.4 బిలియన్ అమెరికా డాలర్లకు పెరిగిందని సర్వే వెల్లడించింది.
సేవల రంగం :
కోవిడ్-19 అనంతర కాలంలో ప్రపంచ సేవల వాణిజ్యంలో భారతదేశం తన అద్భుతమైన పనితీరును కొనసాగించింది. 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో సేవల ఎగుమతులు 18.4% పెరిగి 177.7 బిలియన్ అమెరికా డాల్లర్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చి చూస్తే ఏప్రిల్-డిసెంబర్ 2021లో సేవల దిగుమతులు 21.5% పెరిగి 103.3 బిలియన్ అమెరికా డాల్లర్లకు చేరుకున్నాయి. సేవల ఎగుమతుల్లో బలమైన వృద్ధిని సాధించడానికి ప్రభుత్వం చేపట్టిన కీలక సంస్కరణలు కూడా కారణమని సర్వే పేర్కొంది.
ప్రస్తుత ఖాతా నిల్వ:
2021-22 ప్రథమార్థంలో భారతదేశ కరెంట్ ఖాతా నిల్వలు జీడీపీలో 0.2 శాతం లోటు గా ఉన్నాయి. వాణిజ్య ఖాతా లోటు ఎక్కువగా ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. నిరంతర విదేశీ పెట్టుబడుల ప్రవాహం, నికర బాహ్య వాణిజ్య రుణాలు , అధిక బ్యాంకింగ్ మూలధనం మరియు అదనపు ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ కేటాయింపుల కారణంగా 2021-22 ప్రథమార్థంలో నికర మూలధన ప్రవాహం 65.6 బిలియన్ అమెరికా డాల్లర్లలుగా ఉంది. భారతదేశం విదేశీ రుణం సెప్టెంబర్ 2021 చివరి నాటికి 593.1 బిలియన్ అమెరికా డాల్లర్లకు పెరిగింది. ఇది ఒక సంవత్సరం క్రితం 556.8 బిలియన్ అమెరికా డాలర్ల వరకు ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ద్వారా అదనపు అదనపు ప్రత్యేక డ్రాయింగ్ రైట్స్ కేటాయింపులు, అధిక వాణిజ్య రుణాలు ఉన్నాయి.
మూలధన ఖాతా:
2021 ఆర్థిక సంవత్సరం తో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో నికర విదేశీ పెట్టుబడుల ప్రవాహం 25.4 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుందని సర్వే పేర్కొంది. నవంబర్ 2021 వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నికర ఎఫ్డీఐ మరియు స్థూల ఎఫ్డీఐ ప్రవాహాలు మధ్యస్తంగా ఉన్నాయి. తక్కువ ఈక్విటీ పెట్టుబడి, ప్రపంచ అనిశ్చితి కారణంగా విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు అస్థిరంగానే ఉన్నాయని సర్వే పేర్కొంది.
చెల్లింపులు మరియు విదేశీ మారక నిల్వలు:
కరెంట్ ఖాతా లోటు పూడ్చేందుకు పెరిగిన మూలధన పెట్టుబడులు సరిపోతాయని ఆర్థిక సర్వే పేర్కొంది. దీని ఫలితంగా 2021-22 మొదటి అర్ధ భాగంలో మొత్తం చెల్లింపుల నిల్వల్లో 63.1 బిలియన్ అమెరికా డాల్లర్ల మిగులు కనిపించింది. ఇది విదేశీ మారక నిల్వలు పెరుగుదలకు దారితీసిందని ఆర్థిక సర్వే పేర్కొంది. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ అమెరికా డాల్లర్ల మైలురాయిని దాటాయి. డిసెంబర్ 31, 2021 నాటికి విదేశీ మారక నిల్వలు 633.6 బిలియన్ అమెరికా డాల్లర్ల వరకు ఉన్నాయి. నవంబర్ 2021 చివరి నాటికి చైనా, జపాన్ మరియు స్విట్జర్లాండ్ తర్వాత భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విదేశీ మారక నిల్వలు కలిగిఉన్న దేశంగా గుర్తింపు పొందింది.

మారకపు రేటు కదలిక అంశాన్ని ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తావించింది. ఏప్రిల్-డిసెంబర్ 2021లో అమెరికా డాలర్ తో రూపాయి విలువలో హెచ్చు తగ్గులు కనిపించాయి. మార్చి 2021 కంటే డిసెంబర్ 2021లో రూపాయి విలువ 3.4% క్షీణించింది. అయితే రూపాయి క్షీణత దాని అభివృద్ధి చెందుతున్న మార్కెట్ పరిస్థితితో పోల్చి చూస్తే తక్కువగా ఉంది . యూరో, జపనీస్ యెన్ మరియు పౌండ్స్ స్టెర్లింగ్‌ల విలువలో రూపాయి విలువ పెరిగింది.
విదేశీ రుణం:
భారతదేశం విదేశీ రుణం 2021 సెప్టెంబర్ చివరి నాటికి 593.1 బిలియన్ అమెరికా డాల్లర్లుగా ఉంది, ఇది జూన్ 2021 చివరి స్థాయి కంటే ఇది 3.9% ఎక్కువ. 2021 మార్చి చివరి నాటికి సంక్షోభానికి ముందు స్థాయిని దాటిన భారతదేశ విదేశీ రుణం, 2021 సెప్టెంబర్ చివరి నాటికి మరింత ఏకీకృతమైందని సర్వే పేర్కొంది.ఎన్నారై డిపాజిట్లలో పునరుద్ధరణ మరియు అంతర్జాతీయ ద్రవ్య నిది నుంచి అందిన అదనపు కేటాయింపులు దీనికి సహాయపడ్డాయని సర్వే పేర్కొంది. మొత్తం విదేశీ రుణంలో స్వల్పకాలిక రుణం వాటా 2021 మార్చి చివరి నాటికి 17.7% నుంచి 2021 సెప్టెంబర్ చివరి నాటికి 17%కి స్వల్పంగా తగ్గింది. మధ్యకాలిక దృక్కోణంలో భారతదేశం విదేశీ రుణం అంచనా వేసిన దాని కంటే తక్కువగానే కొనసాగుతుందని సర్వే పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థకు ఇది అనుకూల పరిమాణంగా ఉంటుంది.
భారతదేశ దృఢత్వం:
రిజర్వ్‌లలో గణనీయమైన పెరుగుదల కారణంగా విదేశీ నిల్వలు మొత్తం విదేశీ రుణాలు, స్వల్పకాలిక రుణాలు విదేశీ మారక నిల్వలు, మొదలైనవి వంటి బాహ్య దుర్బలత్వ సూచనల మధ్య మెరుగుదలకు దారితీసిందని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా పెరిగిన ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా ఫెడ్‌తో సహా క్రమపద్ధతిలో ముఖ్యమైన కేంద్ర బ్యాంకుల ద్వారా ద్రవ్య విధానం వేగవంతమైన సాధారణీకరణ సంభావ్యత నుంచి ఉత్పన్నమయ్యే లిక్విడిటీ లాంటి ఎలాంటి విఘాతాన్ని అయినా ఎదుర్కొనేందుకు భారతదేశం విదేశీ రంగం సిద్ధంగా ఉందని సర్వే నివేదిక వెల్లడించింది.
***
(Release ID: 1793892)
Visitor Counter : 1423