ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

విద్యుత్ రంగ సంస్కరణలను చేపట్టేందుకు రాష్ట్రాలకు అదనంగా రూ. 7,309 కోట్లు అందుబాటులోకి వచ్చాయి.


విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణల ఆధారంగా 11 రాష్ట్రాలు అదనపు రుణాలను పొందగలిగాయి.

Posted On: 28 JAN 2022 6:12PM by PIB Hyderabad

విద్యుత్ రంగంలో నిర్ణీత సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్, ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు రుణాలకు అనుమతి ఇచ్చింది.  సంస్కరణలు చేపట్టిన రెండు రాష్ట్రాలకు రూ.7,309 కోట్లు అందాయి. కాగా, రాజస్థాన్‌కు అదనంగా రూ. 5,186 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా రూ. 2,123 కోట్లను సంస్కరణ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రోత్సాహకంగా అందించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా, 2021–-22 నుండి 2024–25 వరకు నాలుగు సంవత్సరాల కాలానికి ప్రతి సంవత్సరం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్డీపీ)లో 0.5 శాతం వరకు అదనపు రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. - విద్యుత్ రంగంలో రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా 2021-–22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇది రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల కంటే ఎక్కువ అదనపు వనరులను అందుబాటులోకి తెస్తుంది.  ఈ రంగం  కార్యాచరణ,  ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం,  చెల్లింపు విద్యుత్ వినియోగంలో స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించడం కోసం అదనపు రుణ అనుమతులను ఇస్తున్నారు. విద్యుత్ రంగ సంస్కరణలకు అనుసంధామైన అదనపు రుణాలను పొందేందుకు, రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి సంస్కరణల సమితిని చేపట్టాలి.  నిర్ణీత పనితీరు ప్రమాణాలను కూడా పాటించాలి.  ప్రభుత్వ రంగ పంపిణీ సంస్థల (డిస్కామ్‌లు) నష్టాలకు ప్రగతిశీల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అవుతుంది.

డిస్కమ్‌లకు రాయితీల చెల్లింపు,   డిస్కమ్‌లు చెల్లించాల్సినవి సంబంధిత సంస్థలకు చెల్లించడం ప్రభుత్వాల బాధ్యత. విద్యుత్ రంగం ఆర్థిక వ్యవహారాల రిపోర్టింగ్‌లో పారదర్శకత పాటించాలి. ఆర్థిక,  ఇంధన ఖాతాలను సకాలంలో అందించడం  సకాలంలో ఆడిట్ చేయడం చాలా ముఖ్యం. ఇవి చట్టపరమైన  నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండాలి. పైన పేర్కొన్న సంస్కరణలను రాష్ట్రం చేపట్టిన తర్వాత, 2021–-22లో అదనపు రుణం తీసుకోవడానికి అర్హతను నిర్ణయించడానికి కింది ప్రమాణాల ఆధారంగా రాష్ట్ర పనితీరును అంచనా వేస్తారు.

–వ్యవసాయ కనెక్షన్లతో సహా మొత్తం శక్తి వినియోగం కొలవడానికి మీటర్ విద్యుత్ వినియోగం శాతం

–వినియోగదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా సబ్సిడీ చెల్లింపు

ప్రభుత్వ శాఖలు  స్థానిక సంస్థల ద్వారా విద్యుత్ బిల్లుల చెల్లింపు

–ప్రభుత్వ కార్యాలయంలో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు

–ఇన్నోవేషన్స్  ఇన్నోవేటివ్ టెక్నాలజీల ఉపయోగం

–అదనంగా, విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ కోసం రాష్ట్రాలు బోనస్ మార్కులకు కూడా అర్హులు.

విద్యుత్ మంత్రిత్వ శాఖ అనేది రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి  అదనపు రుణ అనుమతిని మంజూరు చేయడానికి వారి అర్హతను నిర్ణయించడానికి నోడల్ మంత్రిత్వ శాఖ. రాజస్థాన్,  ఆంధ్రప్రదేశ్‌తో పాటు, అస్సాం, గోవా, కేరళ, మణిపూర్, మేఘాలయ, ఒడిశా, సిక్కిం, తమిళనాడు  ఉత్తరప్రదేశ్ వంటి తొమ్మిది రాష్ట్రాలు కూడా తమ ప్రతిపాదనలను విద్యుత్ మంత్రిత్వ శాఖకు సమర్పించాయి, అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. విద్యుత్ మంత్రిత్వ శాఖ నుండి సిఫార్సును స్వీకరించిన తర్వాత అర్హత కలిగిన రాష్ట్రాలకు అదనపు రుణ అనుమతి మంజూరు చేయడం జరుగుతుంది.

***



(Release ID: 1793558) Visitor Counter : 129