శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంతో పాటు యూఎస్‌ఏలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు & శాస్త్రవేత్తలు స్పేస్ రేడియేషన్ వాతావరణం గురించి చర్చించారు
Posted On:
28 JAN 2022 3:32PM by PIB Hyderabad
"స్పేస్ రేడియేషన్ వర్క్‌షాప్: రేడియేషన్ క్యారెక్టరైజేషన్ ఫ్రమ్ సన్‌టు ఎర్త్, మూన్, మార్స్ అండ్ బియాండ్" అనే అంశంపై జనవరి 24 నుండి 28, 2022 వరకు నిర్వహించబడిన ఇండో-యుఎస్ వర్క్‌షాప్‌లో భారతదేశం మరియు యూఎస్‌కు నుండి డొమైన్ నిపుణులు మరియు విద్యార్థులు అంతరిక్ష రేడియేషన్ వాతావరణాన్ని వర్గీకరించడం నుండి ఆస్ట్రోబయాలజీ మరియు అందులో కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాస సాధనాల అప్లికేషన్ వరకు అనేక ఆంశాలపై చర్చించారు.
ఇస్రో మాజీ ఛైర్మన్ శ్రీ కిరణ్ కుమార్ జనవరి 26, 2022న తన ముఖ్య ఉపన్యాసంలో భారతదేశం గతంలో చేసిన అంతరిక్ష యాత్రల యొక్క అవలోకనాన్ని అందించారు. అలాగే 2025 వరకు కొత్త మిషన్ల యొక్క రోడ్‌మ్యాప్‌ను అందించారు. పరిమిత వనరులతో ఇస్రో నిరాడంబరమైన ప్రారంభంతో ఎలా ప్రారంభించబడిందో ఆయన హైలైట్ చేశారు. ఇస్రో చేసిన కొన్ని ముఖ్యమైన అంతరిక్ష యాత్రల గురించి వివరించారు.
ఇస్రోకు చంద్రయాన్-1 ఒక ముఖ్యమైన మిషన్ అని అది చంద్రునిపై ఓహెచ్ మరియు నీటి అణువుల ఆవిష్కరణతో పాటు మనకు చంద్రుని గురించి మన అవగాహనను మార్చిందని ఆయన అన్నారు. "మార్స్ ఆర్బిటర్ మిషన్ అంగారక గ్రహంపై అధ్యయనం చేస్తూ 7 సంవత్సరాలు పూర్తి చేసింది. ఆస్ట్రోశాట్ మిషన్ భారతదేశం కక్ష్యలోకి ప్రవేశపెట్టిన మొదటి అంకితమైన ఖగోళ అబ్జర్వేటరీ. ఇది అనేక జాతీయ సంస్థల మధ్య పెద్ద సహకారం మరియు ఖగోళ పరిశోధనలో పెద్ద సంఖ్యలో ముఖ్యమైన అధ్యయనాల కోసం డేటాను అందించింది. చంద్రయాన్ 2 ఆర్బిటర్ చక్కగా ఉంది మరియు అన్ని పేలోడ్‌లు పని చేస్తున్నాయి. అంతరిక్ష నౌక ఇంకా చాలా సంవత్సరాలు పని చేస్తుంది. ఇప్పటి వరకు పొందిన డేటా అనేక ప్రచురణలకు దారితీసింది, "అన్నారాయన. సూర్యునిపై అధ్యయనం చేసే ఆదిత్య-ఎల్1 మిషన్‌కు సంబంధించిన ఉపగ్రహం తయారీ పూర్తవుతుందని, ఈ ఏడాది ప్రయోగించే అవకాశం ఉందని కూడా ఆయన సూచించారు. భవిష్యత్తులో ఇస్రో మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) చంద్రుని అన్వేషణ మిషన్‌లో కలిసి పనిచేస్తాయని కూడా ఆయన చెప్పారు.
ఈ వర్క్‌షాప్‌కు ఇండో-యుఎస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరమ్ మద్దతు ఇచ్చింది మరియు ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సైన్సెస్ (ఎఆర్‌ఐఈఎస్), నైనిటాల్, భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ, మరియు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్), పూణే ద్వారా నిర్వహించబడింది. ఇది ఎఆర్‌ఐఈఎస్‌లో "భారత స్వాతంత్ర్యం యొక్క 75 సంవత్సరాలు: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" స్మారక కార్యక్రమాలలో ఒక భాగంగా నిర్వహించబడింది.
5-రోజుల వర్క్‌షాప్‌లో ప్రతి రోజు భూమి, గాలి మరియు అంతరిక్షయానం, అన్వేషణ, అంతరిక్ష రేడియేషన్ & జీవశాస్త్రం, అంతరిక్ష పరిస్థితుల అవగాహన & అవకాశాలు అనే థీమ్ ఉంది. ఇందులో కాస్మిక్ కిరణాలు, సౌర పర్యవేక్షణ, అంతరిక్ష అన్వేషణ, అంతరిక్ష వాతావరణం మరియు ఉపగ్రహాలు మరియు వ్యోమగాములపై దాని ప్రభావాలు, ఖగోళ జీవశాస్త్రం, ఆయా ప్రాంతాలలో పనిచేసే నిపుణుల బెలూన్ ఆధారిత అధ్యయనాలు వంటి అనేక రకాల చర్చలు ఉన్నాయి. ఆధునిక డేటా విశ్లేషణలు మరియు మోడలింగ్ టెక్నిక్‌లలో ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ అప్లికేషన్‌పై హ్యాండ్-ఆన్ సెషన్‌లు కూడా నిర్వహించబడ్డాయి. ఈ వర్క్‌షాప్‌లో భారతదేశం మరియు యూఎస్‌ఏ నుండి ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్న యూఎస్-ఇండియా అంతరిక్ష పరిశోధన సంభాషణ సెషన్ కూడా ఉంది.
ఇస్రో మాజీ చైర్మన్ శ్రీ ఎ.ఎస్.కిరణ్ కుమార్ కీలకోపన్యాసం చేశారు
శ్రీ ఎ. ఎస్. కిరణ్ కుమార్ ముఖ్యోపన్యాసం చేస్తున్నప్పుడు గ్రూప్ ఫోటో
<><><><><>
(Release ID: 1793416)
Visitor Counter : 215