రైల్వే మంత్రిత్వ శాఖ
ఆర్ ఆర్ బి , ఎన్టీపీసీ పరీక్షపై అభ్యర్థులు లేవనెత్తిన సందేహాలు, అనుమానాలు నివృత్తి చేసేందుకు తక్షణం స్పందించిన రైల్వే శాఖ
అభ్యర్థులు/ఆశావహుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు
Posted On:
28 JAN 2022 3:56PM by PIB Hyderabad
కేంద్రీకృత ఉపాధి నోటీసు నెంబర్ 01/2019 (నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ కోసం గ్రాడ్యుయేట్ మరియు అండర్-గ్రాడ్యుయేట్) ప్రకారం పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న ప్రక్రియపై కొంతమంది అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు/ సందేహాలపై రైల్వే శాఖ స్పందించింది. పరీక్ష రెండవ దశకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు అనుసరిస్తున్న విధానం పట్ల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు/ అనుమానులు వ్యక్తమయ్యాయి. వీటిపై స్పందించిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు ఎన్టీపీసీ కి సంబంధించి సీబీటీ, మొదటి దశ సీబీటీ ని వాయిదా వేశాయి.
ఎన్టీపీసీ కోసం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఫలితాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించేందుకు ఇప్పటికే సీనియర్ అధికారులు సభ్యులుగా ఒక ఉన్నతాధికార కమిటీ ఏర్పాటయింది. CEN RRC 01/2019 ప్రకారం ఇప్పటికే షార్ట్ లిస్ట్ లో ద్వారా పరీక్ష రెండవ దశకు ఎంపిక అయిన అభ్యర్థుల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చూసే విధంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలు సూచనలను 16.02.2022 లోగా rrbcommittee@railnet.gov.in ఇమెయిల్ ఐడి ద్వారా కమిటీకి తెలియజేయవచ్చు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత కమిటీ తన సిఫార్సులను 04 మార్చి, 2022 నాటికి సమర్పిస్తుంది.
సందేహాలను నివృత్తి చేసేందుకు పరీక్ష నిర్వహించిన విధానాన్ని కింద వివరించడం జరిగింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష( సీబీటీ) రెండవ దశపై వస్తున్న అభ్యంతరాలు/సందేహాలపై రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. ప్రకటనకు స్పందించి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో రెండు దశల్లో పరీక్షలు నిర్వహించవలసి ఉంటుంది. ప్రస్తుత ప్రకటనకు స్పందించి దరఖాస్తు చేసిన వారి సంఖ్య కోటికి మించి ఉంది. దీనితో రెండు దశల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. అభ్యర్థుల వివరాలను పరిశీలించేందుకు మొదటి దశ పరీక్ష జరిగింది. దీని ద్వారా రెండో దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. తుది జాబితాను స్వేచ్ఛగా న్యాయంగా సిద్ధం చేసేందుకు ఒకేసారి ఎక్కువ మందిని పరీక్షించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అనుసరించడం జరిగింది.
సీబీటీ రెండో దశ కోసం ఎంపిక చేసిన అభ్యర్థుల సంఖ్యపై కూడా రైల్వే వివరణ ఇచ్చింది. కేంద్రీకృత ఉపాధి నోటిఫికేషన్ (CEN) 01/2019 కింద గ్రాడ్యుయేట్‌లు మరియు 10+2 ఉత్తీర్ణులైన అభ్యర్థులకు 1వ దశ పరీక్షను కలిపి నిర్వహించడం జరిగింది. ప్రకటించిన ఖాళీలకు 20 రెట్లు అధికంగా రెండో దశకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని CENలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సీబీటీ 1వ దశ స్క్రీనింగ్ తర్వాత 2వ దశకు ఎక్కువ మంది ఎంపిక అయ్యేలా చూసేందుకు ఈ విధానాన్ని అనుసరించడం జరిగింది.
రెండో దశ సీబీటీ పరీక్షకు ఎంపిక అయిన అభ్యర్థుల సంఖ్యపై కూడా రైల్వే వివరణ ఇచ్చింది.
“7 లక్షల మంది అభ్యర్థులను షార్ట్ లిస్టింగ్ చేయాలి గాని 7 లక్షల రోల్ నంబర్లు కాదు" అన్న అంశంపై వివరణ ఇచ్చారు. 7 లక్షల మంది అభ్యర్థులను సీబీటీ రెండో దశ కోసం ఎంపిక చేయడం జరుగుతుందని ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేసింది. సీబీటీ రెండవ పరీక్ష అయిదు దశల్లో నిర్వహించడం జరుగుతుంది. అర్హత, మెరిట్ మరియు ఎంపిక ఆధారంగా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ స్థాయిలకు షార్ట్‌లిస్ట్ చేయబడే అవకాశం ఉంది. దీనితో 7 లక్షల రోల్ నంబర్‌ల జాబితాలలో ఒకటి కంటే ఎక్కువ జాబితాలో కొన్ని పేర్లు కనిపిస్తాయి. నోటిఫికేషన్‌లోని 13వ పేరాలో వివరించిన విధంగా నోటిఫై చేయబడిన ఖాళీలకు 20 రెట్ల అభ్యర్థుల చొప్పున స్థాయి/పోస్టుల వారీగా షార్ట్ లిస్టి జాబితా సిద్ధం చేయ బడింది. జాబితాలో 7,05,446 రోల్ నెంబర్లు ఉన్నాయి. నోటిఫై చేసిన 35281 ఖాళీలకు ఈ సంఖ్య 20 రెట్లు అధికంగా ఉంది. పరీక్ష ముగిసిన తర్వాత 35,281 పోస్టుల భర్తీ జరుగుతుంది. మెరిట్ మరియు ప్రాధాన్యత ఆధారంగా ఒక అభ్యర్థిని ఒక పోస్ట్‌కు మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. దీంతో ఒక్క పోస్ట్ కూడా ఖాళీగా ఉండదు.
గ్రాడ్యుయేట్ మరియు 10+2 అర్హత కలిగిన వారికి కలిసి పరీక్ష నిర్వహించడం వల్ల గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ప్రయోజనం పొందుతున్నారు అన్న అంశంపై కూడా రైల్వే స్పందించింది. సమయం, శక్తి, ఏర్పాట్లను ఆదా చేసేందుకు గ్రాడ్యుయేట్ మరియు 10+2 స్థాయి పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ల ఏకీకరణ జరిగిందని రైల్వే వివరించింది.కోవిడ్ -19 మహమ్మారి సమయంలో అనుసరించిన ఈ విధానం వల్ల ఆశించిన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 1 ( సీబీటీ 1) ప్రమాణాలు 10+2 స్థాయి విద్యార్థులకు నష్టం జరగకుండా 10+2 స్థాయిలో ఉంచబడ్డాయి మరియు సీబీటీ 2లో మాత్రమే వివిధ స్థాయిలలో వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యంపై రైల్వే వివరణ ఇచ్చింది. మార్చి 2020 నుండి కోవిడ్ 19 మహమ్మారి మరియు వివిధ రాష్ట్రాలు విధించిన అనేక పరిమితుల కారణంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఆలస్యమైందని రైల్వేవివరించింది. సామాజిక దూరం నిబంధనల ప్రభావం సీబీటీ నిర్వహణపై కనిపించింది. CEN 01/2019 1వ దశ సీబీటీ పరీక్షలను 133 షిఫ్ట్‌ల్లో నిర్వహించారు.
***
(Release ID: 1793353)
Visitor Counter : 301