రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నావవికాదళానికి కృత్రిమ మేథస్సు (ఎఐ) ఉపయోగించడంపై
ఐఎన్ఎస్ వల్సురాలో వర్క్‌షాప్
Posted On:
27 JAN 2022 2:16PM by PIB Hyderabad
భారత నావికాదళ ప్రముఖ సాంకేతిక శిక్షణా సంస్థ ఐఎన్ఎస్ వల్సూరా 19 జనవరి నుంచి 21, 2022న సమకాలీన అంశమైన భారతీయ నావికాదళం కోసం కృత్రిమ మేథస్సును (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను ఉపయోగించుకోవడం అన్న అంశంపై వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
దక్షిణా నావికాదళ కమాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గూగుల్, ఐబిఎం, ఇన్ఫోసిస్, టిసిఎస్ నుంచి వచ్చిన వక్తలు ఈ మూడు రోజుల కార్యక్రమంలో పరిశ్రమ దృష్టికోణాన్ని పంచుకున్నారు. ఐఐటి ఢిల్లీ, న్యూయార్క్ యూనివర్సిటీ, అమృతా యూనివర్సిటీ, డిఎ-ఐఐసిటి నుంచి వచ్చిన ప్రముఖ విద్యావేత్తలు ఎఐ నూతన సరళులు, అప్లికేషన్ల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యోపన్యాసం చేస్తూ, ఈ సముచిత సాంకేతిక, భారతీయ నావికాదళానికి అనువర్తనం చేయాల్సిన వ్యూహాత్మక ప్రాముఖ్యతను వైస్ అడ్మిరల్, దక్షిణ నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఎంఎ హంపిహోలి నొక్కి చెప్పారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ వెబినార్‌లో దేశం నలుమూలల నుంచి దాదాపు 500మందికిపైగా పాల్గొన్నారు.
కీలక మిషన్ ప్రాంతాలలో కృత్రిమ మేథస్సు (ఎఐ)ను, మెషీన్ లెర్నింగ్‌ను కలుపుకోవడంపై భారతీయ నావికాదళం దృష్టి పెడుతోంది. జామ్‌నగర్‌లో ఉన్న ఐఎన్ఎస్ వల్సురా ఇప్పటికే బిగ్ డేటా రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ)గా గుర్తింపు పొందడమే కాదు, ఎఐ, బిగ్ డాటా విశ్లేషణ (బిడిఎ) కోసం అత్యధునాతన ప్రయోగశాలను జనవరి 2020న ఏర్పాటు చేయడం జరిగింది. విద్యావేత్తలు, పరిశ్రమల సహకారంతో హెచ్ఆర్ అండ్ పర్సెప్షన్ అసెస్‌మెంట్, నిర్వహణ పరిధుల్లో, ఎఐ- బిడిఎను అందిపుచ్చుకోవడానికి సంబంధించి పైలెట్ ప్రాజెక్టుల పురోగతికి సాధనంగా ఉన్న ఐఎన్ఎస్ వల్సురాలో ఎఐ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఇ)ను సృష్టించే ప్రక్రియలో నావికాదళం ఉంది. ఇందుకు అదనంగా, ఎఐ ఇంజిన్లకు డేటా అన్నది ఇంధనం కనుక, తన ఎంటర్‌ప్రైజ్ డాటాను ఏకీకరించడం, పునర్వ్యవస్థీకరించడంలో నావికాదళం లోతుగా నిమగ్నమై ఉంది.
సంస్థాపరంగా, నావికాదళం ఎఐ మూల బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి ఎఐ/ ఎంఎల్ చొరవలను అంచనా వేసేందుకు ఏడాదిలో రెండుసార్ల సమావేశం అవుతాయి. నావికాదళం నిర్వహిస్తున్న ఎఐ కార్యక్రమాలు వ్యూహాత్మక, యుద్ధ కుశలత స్థాయి ప్రభావాన్ని రెండింటినీ కలిగి ఉంటాయి. ప్రకటించిన సమయానికి కట్టుబడి ఉండడాన్ని చూసేందుకు ఎఐ ప్రాజెక్టుల ను ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారు. తన అధికారులు, నావికులకు అన్ని స్థాయిల ప్రత్యేకతలలో ఎఐ/ ఎంఎల్ శిక్షణను కూడా నావికాదళం నిర్వహిస్తోంది. ఈ శిక్షణను నావికాదళ స్వంత శిక్షణా కళాశాలల్లోనే కాక ప్రముఖ ఐఐటిలలో కూడా నిర్వహిస్తున్నారు. గత మూడు ఏళ్ళల్లో అనేకమంది ఉద్యోగులు ఎఐకి సంబంధించిన పెద్ద, చిన్న కోర్సులలో శిక్షణ పొందారు.
భారతీయ నావికాదళం చేపట్టిన ఈ చొరవలు, ఎఐలో భారతదేశాన్ని అంతర్జాతీయ స్థాయి నాయకుడిగా మార్చడం, అందరికీ బాధ్యతాయుతమైన, పరివర్తనాత్మక ఎఐ అందేలా హామీ ఇవ్వడం అన్న దేశ దార్శనికతకు అనుగుణంగా ఉన్నాయి.
***
(Release ID: 1793094)
Visitor Counter : 176