రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌టీపీసీ సీబీటీ-1 ఫలితాలపై అభ్యర్థుల ఆందోళనలను పరిశీలించడానికి రైల్వే హైపవర్ కమిటీని ఏర్పాటు

- అభ్యర్థులు తమ ఫిర్యాదులను 16 ఫిబ్రవరి, 2022 వరకు కమిటీకి సమర్పించవచ్చు

Posted On: 26 JAN 2022 11:16AM by PIB Hyderabad

రైల్వే జారీ చేసిన నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల (ఎన్‌టీపీసీ) యొక్క రిక్రూట్‌మెంట్ బోర్డులు(ఆర్ఆర్‌బీ) జారీ చేసిన సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫికేషన్ సీఈఎన్ 01/ 2019 యొక్క 1వ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఫలితాలకు సంబంధించి అభ్యర్థులు లేవనెత్తిన ఆందోళనలు మ‌రియు సందేహాల పరిశీల‌న‌కు 14-15 జనవరి 2022న ఒక ఉన్న‌తస్థాయి కమిటీ ఏర్పాటు చేయబడింది.
అభ్యర్థులు లేవనెత్తిన ఈ క్రింది అంశాలక కమిటీ ప‌రిశీలించి త‌గిన‌ సిఫార్సులు ఇస్తుంది:

1. సీఈఎన్ 01/ 2019  (ఎన్‌టీపీసీ) యొక్క 1వ దశ సీబీటీ ఫలితాలు మరియు ఇప్పటికే ఉన్న షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను ప్రభావితం చేయకుండా 2వ దశ సీబీటీ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేయడానికి ఉపయోగించే పద్దతి
2. సీఈఎన్ ఆర్ఆర్‌సీ  01/2019లో 2వ దశ సీబీటీ పరిచయం
అభ్యర్థులు తమ ఆందోళనలు మరియు సూచనలను ఈ క్రింది ఇమెయిల్ ఐడీ ద్వారా కమిటీకి తెలియజేయవచ్చు:
rrbcommittee@railnet.gov.in. ఆర్ఆర్‌బీల‌ ఛైర్‌పర్సన్‌లందరూ తమ ప్రస్తుత మార్గాల ద్వారా అభ్యర్థుల ఫిర్యాదులను స్వీకరించాలని, ఈ ఫిర్యాదులను సంకలనం చేసి కమిటీకి పంపాలని ఆదేశించ‌డ‌మైంది. ఈ అభ్యర్థులకు తమ ఆందోళనలను సమర్పించడానికి 16.02.2022 వరకు మూడు వారాల సమయం ఇవ్వబడుతుంది. ఈ ఆందోళనలను పరిశీలించిన తర్వాత కమిటీ 04.03.2022లోపు త‌న‌ సిఫార్సులను సమర్పిస్తుంది. సీఈఎన్‌ 01/2019 (ఎన్‌టీపీసీ) యొక్క 2వ దశ సీబీటీ పై దృష్టిలో 15 ఫిబ్రవరి 2022 నుంచి జ‌ర‌గాల్సిన‌ మరియు సీఈఎన్ ఆర్ఆర్‌సీ 01/2019 యొక్క 1వ దశ, సీబీటీ  ప‌రీక్ష ఫిబ్రవరి 23 నుంచి జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ వాయిదా వేయ‌డ‌మైంది.

***(Release ID: 1792825) Visitor Counter : 235