ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

162.92 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


గత 24 గంటల్లో 62 లక్షలకుపైగా డోసులు నిర్వహణ

ప్రస్తుత రికవరీ రేటు 93.15%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,55,874

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,36,842

వారపు పాజిటివిటీ రేటు 17.17%

Posted On: 25 JAN 2022 9:21AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; గత 24 గంటల్లో ఇచ్చిన 62 లక్షలకు పైగా ( 62,29,956 ) డోసులతో కలిపి, 162.92 కోట్ల ( 1,62,92,09,308 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 1,77,12,517 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం:

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,03,92,701

రెండో డోసు

98,26,681

ముందు జాగ్రత్త డోసు

28,42,155

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,83,91,675

రెండో డోసు

1,71,52,993

ముందు జాగ్రత్త డోసు

28,26,940

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

4,27,23,464

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

53,55,80,374

రెండో డోసు

39,10,87,802

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

19,93,26,389

రెండో డోసు

16,73,04,587

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,42,30,375

రెండో డోసు

10,43,90,089

ముందు జాగ్రత్త డోసు

31,33,083

ముందు జాగ్రత్త డోసులు

88,02,178

మొత్తం డోసులు

1,62,92,09,308

 

 

గత 24 గంటల్లో 2,67,753 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల మొత్తం సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 3,70,71,898 కు పెరిగింది.

దేశవ్యాప్త రికవరీ రేటు 93.15 శాతానికి చేరింది.

 

గత 24 గంటల్లో 2,55,874 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 22,36,842. ఇది మొత్తం కేసుల్లో 5.62 శాతం.

 

దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 16,49,108 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 71.88 కోట్లకు పైగా ( 71,88,02,433 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 17.17 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.52 శాతంగా నమోదైంది.

 

****



(Release ID: 1792430) Visitor Counter : 126