నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన ఓడరేవుల‌లో నేతాజీ జయంతి వేడుక‌లు

Posted On: 24 JAN 2022 12:57PM by PIB Hyderabad

మన దేశ చరిత్ర ,  సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్ర‌ధానంగా స్ర‌వంతిలోకి తేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా..  నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని చేర్చేందుకు వీలుగా ఈ ఏడాది  గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 23వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి. పారాదీప్ ఓడ‌రేవు స‌మీపంలోని పారాదీప్ బస్టాండ్ వ‌ద్ల ఉన్న నేతాజీ విగ్రహానికి  ఓడ‌రేవు చైర్మెన్ శ్రీ పి.ఎల్.హరనాధ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద‌ర్భంగా శ్రీ హరనాధ్ జగత్‌సింగ్‌పూర్‌లో గ‌త  స్థానిక స్వాతంత్ర్య సమరయోధులు నువాపరా గ్రామానికి చెందిన శ్రీ మధబానంద మనోహరి, ఇచ్ఛాపూర్ గ్రామానికి చెందిన శ్రీ భాగీరథి స్వైన్, ఆనల్లా గ్రామానికి చెందిన శ్రీ జోగేంద్ర మహారాణా ఇండ్ల‌ను సందర్శించి వారిని సత్కరించారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో పరస్పర చర్చ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు తామ యుక్తవయస్సులో ఉన్న‌ప్పుడు  స్వాతంత్ర్య పోరాటంలో ఏ విధంగాపాల్గొన్నారు.  స్వాతంత్య్రానంతర యుగంలో దేశ నిర్మాణ సాధనకు ఎలా సహకరించార‌న్న విష‌యాన్ని వివరించారు. ఈ సంద‌ర్భంగా వారు ఆరోగ్యంగా జీవించాలని శ్రీ హ‌ర‌నాథ్ ఆకాంక్షించారు. ఈ సజీవ దేశభక్తుల నుంఢి యువత‌ స్ఫూర్తి పొందాలని  కూడా ఆయ‌న కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా దీనదయాళ్ పోర్ట్ ట్రస్ట్, కాండ్ల ఆయనకు నివాళులర్పించింది.

 


ఈ సంద‌ర్భంగా పోర్ట్ ఒక ట్వీట్ సందేశం ఇస్తూ పోర్ట్ నేతాజీ స్వేచ్ఛా భారతదేశం  - ఆజాద్ హింద్ వంటి ఆలోచనకు తన తీవ్రమైన నిబద్ధతను నెరవేర్చడానికి తీసుకున్న సాహసోపేతమైన మరియు సాహసోపేతమైన చర్యలు ఆయ‌న‌ను జాతీయ చిహ్నంగా మార్చాయని పేర్కొంది. శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్, కోల్‌కతా నేతాజీకి ఘనంగా నివాళులు అర్పించింది.  రాబోయే తరాలకు ఆయన మనకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు.
                                                                                 

***


(Release ID: 1792186)