ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఈశాన్యప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ -ఎన్ఇసి ఆధ్వర్యంలో నమోదు చేసుకున్న సంస్థ ఎన్ఇఆర్‌సిఆర్ఎంఎస్ స్వయం సమృద్ధి చొరవ వడ్రంగి పనికి మార్గం
Posted On:
23 JAN 2022 9:11AM by PIB Hyderabad
తన కుటుంబాన్ని పోషించే ప్రక్రియలో చురాచంద్‌పూర్ జిల్లాలోని ఖోచిజంగా్ గ్రామానికి చెందిన మాంగ్మిన్‌లున్ సింగ్ సుత్ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి పరిమిత వనరులు, ప్రాథమిక సేవలు అందుకోవడంలో నిమగ్నమై ఉంది. వారి జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. అయితే, అతడు అదృష్టం కలిగిన వడ్రంగి పనివాడు. అతడు పట్టణంలోని పెద్ద వడ్రంగి వర్క్‌షాప్‌లో పని చేయడం ప్రారంభించి, రోజుకు కేవలం రూ.300/-లను ఆర్జించడం మొదలు పెట్టాడు. అంత తక్కువ డబ్బు కారణంగా అతడు తన కుటుంబ ప్రాథమిక అవసరాలను తీర్చలేకపోయేవాడు.
కాగా, 2028-2019ల7 అతడు వడ్రంగి పని లబ్ధిదారుగా ఎంపికై, రూ. 18000 /- (పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే) భారత ప్రభుత్వానికి చెందిన ఈశాన్యప్రాంత అభివృద్ధి శాఖ కింద చేపట్టిన ఎన్ ఇసి, ఎన్ ఇఆర్‌సిఆర్ ఎంఎస్‌కు చెందిన ఎన్ఇ ఆర్ సిఒఆర్ ఎం ప్రాజెక్టు మూడవ దశ కింద పొందాడు. ఆ డబ్బుతో అతడు తన వడ్రంగి కార్యకలాపాలను సాగించేందుకు అతడు అవసరమైన పరికరాలను కొనుగోలు చేశాడు. వడ్రంగి కార్యకలాపం పై వచ్చే రెగ్యులర్ ఆదాయం అతడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు, తన పిల్లలను గుణాత్మక విద్య కోసం బడికి పంపడానికి అవకాశాన్ని ఇచ్చింది,
నన్ను ఎంపిక చేసినందుకు ఎన్ఎఆర్ఎంజికి నా కృతజ్ఞతలు, నాకు ఆశాకిరణాన్ని ఇచ్చిన ఎన్ఇఆర్‌సిఒఆర్ఎం ప్రాజెక్టుకు రుణపడి ఉంటాను. మా గ్రామంలో తన అందమైన ప్రయాణాన్ని ప్రాజెక్టు కొనసాగించాలని ప్రార్థిస్తున్నానని,చురాచంద్‌పూర్ లో ప్రాజెక్టు లబ్ధిదారు అయిన మాంగ్మిన్‌లున్ సింగ్ సుత్ అన్నాడు.
అనంతరం అతడు ఒక మాదిరి వడ్రంగి దుకాణాన్ని స్వంతం చేసుకుని, తన వ్యాపారాన్ని విస్తరించాడు. కేవలం తన గ్రామంలోనే కాక పట్టణమంతా ప్రముఖ వడ్రంగి పనివాడిగా కీర్తినార్జించాలన్న తపన అతడిని అందుకు ప్రోత్సహించింది. ఎన్ఎఆర్ఎంజి మద్దతుతో అతడు విజయవంతమైన వ్యాపారవేత్త కావడమే కాక మాస్టర్ ట్రైనర్ అయ్యాడు. అతడి అభిరుచి, నిబద్ధత కారణంగానే నేడు అతడు సమూహంలో ప్రత్యేకంగా నిలిచాడు.
***
(Release ID: 1792004)
Visitor Counter : 124