భారత ఎన్నికల సంఘం
ర్యాలీలు ,రోడ్ షోలపై జనవరి 31, 2022 వరకు నిషేధం పొడిగించిన కేంద్ర ఎన్నికల సంఘం
మొదటి దశ ఎన్నికలకు రాజకీయ పార్టీలు లేదా పోటీ చేసే అభ్యర్థుల బహిరంగ సభలకు జనవరి 28 నుంచి, రెండవ దశ ఎన్నికలకు ఫిబ్రవరి 1 నుంచి అనుమతి
ఇంటింటి ప్రచారానికి 5 మంది వ్యక్తుల పరిమితి ని 10 మందికి పెంపు
నిర్ధారిత బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం కోసం కోవిడ్ పరిమితులతో వీడియో వ్యాన్ లకు అనుమతి
Posted On:
22 JAN 2022 6:51PM by PIB Hyderabad
భారత ఎన్నికల సంఘం ఈ రోజు వర్చువల్ విధానం ద్వారా భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో సమీక్షా సమావేశం నిర్వహించింది. ఎన్నికలు జరగనున్న గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శులు, ప్రధాన ఎన్నికల అధికారులు, ఆరోగ్య కార్యదర్శులతో కూడా కమిషన్ వర్చువల్ సమావేశాలు నిర్వహించింది.
ఎన్నికల కమిషనర్లు శ్రీ రాజీవ్ కుమార్, శ్రీ అనుప్ చంద్ర పాండే తో పాటు సెక్రటరీ జనరల్ , సంబంధిత డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లతో కలిసి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ సుశీల్ చంద్ర ఐదు ఎన్నికల రాష్ట్రాల్లో కోవిడ్ మహమ్మారి ప్రస్తుత పరిస్థితి, అంచనా పోకడలకు సంబంధించి సమగ్ర సమీక్ష నిర్వహించారు. వాక్సినేషన్ పరిస్థితిని, పోలింగ్ సిబ్బందిలో అర్హులైన వారికి 1వ, 2వ, బూస్టర్ మోతాదు లను త్వరితగతిన పూర్తి చేయడానికి ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికను కూడా కమిషన్ సమీక్షించింది. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలకు ఆంక్షలను సడలించడంపై కమిషన్ చర్చించింది.
అధికారుల నుండి సమాచారాన్ని, క్షేత్ర స్థాయి నివేదికలను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ జనవరి 27న మొదటి దశ, ఫేజ్ 2 కొరకు జనవరి 31 న రెండవ దశ అభ్యర్థుల జాబితా ఖరారు చేయబడే దశల్లో ప్రచార సమయం అవసరాలపై కూడా చర్చించింది.
ప్రస్తుత పరిస్థితి, వాస్తవాలు , సందర్భాలను అదేవిధంగా ఈ సమావేశాల్లో అందుకున్న నివేదికలను పరిగణనలోకి తీసుకున్న తరువాత, కమిషన్ ఈ క్రింది నిర్ణయాలు తీసుకుంది.
(1) రోడ్డు షో, పాదయాత్ర, సైకిల్/బైక్/
వెహికల్ ర్యాలీ , ఊరేగింపులకు జనవరి 31, 2022 వరకు అనుమతి లేదు.
(2) మొదటి దశ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను జనవరి 27, 2022న ఖరారు చేస్తారు కనుక, సంబంధిత రాజకీయ పార్టీల బహిరంగ సభలకు నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఇస్తారు. ఈ బహిరంగ సభలకు గరిష్టంగా 500 మంది లేదా గ్రౌండ్ సామర్ధ్యం లో 50% లేదా ఎస్ డి ఎం ఎ నిర్దేశించిన పరిమితిని ఏ సంఖ్య తక్కువైతే ఆ మేరకు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8, 2022 వరకు (నిశ్శబ్ద కాలాన్ని మినహాయిం ) అనుమతించాలని కమిషన్ నిర్ణయించింది,
(3) రెండవ దశ ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను జనవరి 31, 2022న ఖరారు చేస్తారు కనుక, సంబంధిత రాజకీయ పార్టీల బహిరంగ సభలకు నిర్దేశిత బహిరంగ ప్రదేశాల్లో అనుమతి ఇస్తారు. ఈ బహిరంగ సభలకు గరిష్టంగా 500 మంది లేదా గ్రౌండ్ సామర్ధ్యం లో 50% లేదా ఎస్ డి ఎం ఎ నిర్దేశించిన పరిమితిని ఏ సంఖ్య తక్కువైతే ఆ మేరకు ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 12 వరకు (నిశ్శబ్ద కాలాన్ని మినహాయించి) అనుమతించాలని కమిషన్ నిర్ణయించింది,
(4) ఇంటింటి ప్రచారం పరిమితిని కూడా కమిషన్ పెంచింది. 5 మందికి బదులుగా, ఇప్పుడు భద్రతా సిబ్బందిని మినహాయించి 10 మంది వ్యక్తులకు ఇంటింటి ప్రచారాలకు అనుమతి ఇస్తారు. ఇంటింటి ప్రచారాలపై ఇతర సూచనలు కొనసాగుతాయి.
(5) ఇండోర్ సమావేశాలను గరిష్టంగా 300 మంది లేదా హాల్ సామర్థ్యంలో 50% మంది లేదా ఎస్ డిఎంఎ నిర్దేశించిన నిర్ణీత పరిమితి మేరకు నిర్వహించుకోవచ్చు.
(6) ఎన్నికలు జరిగే రాష్ట్రాలలో గరిష్టంగా 500 మంది వీక్షకులు లేదా ఎస్ డిఎంఎ నిర్దేశించిన సామర్థ్యం లేదా పరిమితిలో 50% ఏ సంఖ్య తక్కువైతే ఆ సంఖ్యతో నిర్ధారిత బహిరంగ ప్రదేశాల్లో సాధారణ కోవిడ్ పరిమితులతో ప్రచారం కోసం వీడియో వ్యాన్లను కమిషన్ అనుమతించింది. ఇది ప్రజా సౌకర్యానికి లోబడి ఉండాలి. ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎలాంటి ఆటంకం ఉండరాదు. లేదు. (దీనికి సంబంధించిన సూచనలను సిఈవోలకు వేరుగా జారీ చేస్తారు.).
(7) రాజకీయ పార్టీలు , పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికలతో ముడిపడి ఉన్న కార్యకలాపాల సమయంలో అన్ని సందర్భాల్లో కోవిడ్ సముచిత ప్రవర్తన , మార్గదర్శకాలు ,మోడల్ ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించేలా చూడాలి.
(8) పైన పేర్కొన్న అవసరాల కోసం నిర్ధారిత స్థలాలను ముందస్తుగా గుర్తించడం , నోటిఫై చేయడం సంబంధిత డిఈవో ల బాధ్యత
(9) 2022 ఎన్నికల నిర్వహణ కోసం జనవరి 8,2022 న జారీ చేసిన సవరించిన విస్తృత మార్గదర్శకాల్లో ఉన్న అన్ని మిగిలిన ఆంక్షలు కూడా కొనసాగుతాయి.
సంబంధిత రాష్ట్ర/జిల్లా అధికారులు అందరూ కూడా ఈ ఆదేశాలను పూర్తిగా పాటించేలా చూడాలి.
ఈ సూచనలను కమిషన్ తదుపరి తేదీలో సమీక్షిస్తుంది.
***
(Release ID: 1791861)