వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం నాటి వరకు, ఈ 75 వారాల వ్యవధిలో కనీసం 75 యునికార్న్‌ లను లక్ష్యంగా పెట్టుకుందాం": శ్రీ పీయూష్ గోయల్

ఏ.ఐ; ఐ.ఓ.టి; బిగ్ డేటా; డేటా అనలిటిక్స్, బ్లాక్‌చెయిన్; వర్చువల్ రియాలిటీ; 3డి ప్రింటింగ్; డ్రోన్లు మొదలైన స్థానిక, అంతర్జాతీయ మార్కెట్ల కోసం పరిష్కారాలను రూపొందించడానికి "డీప్-టెక్"ను ఉపయోగించుకోవాలని అంకుర సంస్థలకు పిలుపునిచ్చిన - శ్రీ పీయూష్ గోయల్


మహమ్మారి ఉన్నప్పటికీ గత సంవత్సరంలో రికార్డు స్థాయిలో సేవల ఎగుమతులు చేసినందుకు బి.పి.ఓ. రంగం తో సహా ఐ.టి.ఈ.ఎస్. పరిశ్రమను ప్రశంసించిన - శ్రీ గోయల్


వారం రోజుల క్రితం ప్రధానమంత్రి అంకుర సంస్థల ప్రతినిధులతో జరిపిన సంప్రదింపులు మన ఆవిష్కర్తలను ఆకట్టుకున్నాయని పేర్కొన్న - శ్రీ పీయూష్ గోయల్


తదుపరి “యు.పి.ఐ. మూమెంట్” ఓ.ఎన్.డి.సి. (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌ వర్క్) - శ్రీ గోయల్


నూతన భారతదేశం ఈ రోజు ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థాపకత (ఐ.టి.ఈ) అనే మూడు కొత్త అంశాల నేతృత్వంలో నడుస్తోంది; 'ఇండియా ఎట్ 100' స్టార్టప్ దేశంగా ప్రసిద్ధి చెందుతుంది: శ్రీ గోయల్


నాస్కామ్ టెక్ స్టార్ట్ అప్ నివేదిక 2022 ను విడుదల చేసిన - శ్రీ పీయూష్ గోయల్

Posted On: 21 JAN 2022 2:40PM by PIB Hyderabad

వచ్చే ఏడాది 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి 75 వారాల్లో 75 యునికార్న్‌ లను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని, కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్, ఈరోజు భారతీయ పరిశ్రమ రంగానికి పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా, ఆయన, నాస్కామ్-టెక్ అంకుర సంస్థల నివేదిక, 2022 ని విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, “2021 మర్చి, 12వ తేదీన, ‘ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్’ ప్రారంభమైనప్పటి నుండి 45 వారాల్లో, మనం 43 యునికార్న్‌లను ప్రారంభించాము.  75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం నాటి వరకు, ఈ 75 వారాల వ్యవధిలో కనీసం 75 యునికార్న్‌ లు ప్రారంభించాలని, లక్ష్యంగా పెట్టుకుందాం.", అని పేర్కొన్నారు. 

స్టార్టప్-ఇండియా ఆరేళ్ల క్రితం ఒక విప్లవాన్ని ప్రారంభించగా, ఈ రోజు, ‘స్టార్టప్’ అనేది ఒక సాధారణమైన, అలవాటు పదంగా మారిందని శ్రీ గోయల్ అన్నారు. భారతీయ అంకురసంస్థలు, భారత కంపెనీల స్థాపన చరిత్రలో, అతివేగంగా, ఛాంపియన్‌ లుగా మారుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

“భారతదేశం ఇప్పుడు ట్రయల్‌ బ్లేజర్ ముఖ్య లక్షణంగా మారింది.  అంకుర సంస్థల ప్రపంచంలో తన ముద్రను నిలిపింది. భారతీయ అంకుర సంస్థల ద్వారా వచ్చిన పెట్టుబడులు మహమ్మారి ముందు స్థాయికి చేరుకున్నాయి.  భారతీయ అంకుర సంస్థలు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకున్న సంవత్సరంగా 2021 గుర్తుండిపోతుంది; ఎడ్‌-టెక్, హెల్త్‌-టెక్; అగ్రి-టెక్‌ లలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి." అని ఆయన వివరించారు.

గత సంవత్సరం రికార్డు స్థాయిలో సేవలఎగుమతి జరిగినందుకు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బి.పి.ఓ) రంగంతో సహా ఐ.టి.ఈ.ఎస్. (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్) పరిశ్రమను శ్రీ గోయల్ ప్రశంసించారు.

"2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలో, కోవిడ్-19 మహమ్మారి సమయంలో, ప్రయాణాలు, ఆతిధ్యం, పర్యాటక రంగాలు గణనీయంగా పడిపోయినప్పటికీ,  సేవల ఎగుమతి 78 బిలియన్ డాలర్లకు చేరుకుంది" అని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 16వ తేదీని జాతీయ అంకుర సంస్థల దినోత్సవంగా ప్రకటించారని, దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతానికి ఆవిష్కరణల సంస్కృతిని విస్తరింపజేయాలనే ఆయన నిబద్ధతకు ఇది అద్దం పడుతోందని, శ్రీ గోయల్ పేర్కొన్నారు. 

“ఆజాదీ-కా-అమృత్-మహోత్సవ్‌ లో భాగంగా గత వారంలో స్టార్టప్ ఇండియా ఆవిష్కరణల వారోత్సవాలు నిర్వహించడం ద్వారా మనమందరం ఈ ఆవిష్కరణల స్ఫూర్తిని జరుపుకున్నాము. వారం క్రితం అంకుర సంస్థల ప్రతినిధులతో ప్రధానమంత్రి సంభాషించడం, మన ఆవిష్కర్తల ధైర్యాన్ని పెంచింది,” అని ఆయన అన్నారు.

అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని శ్రీ గోయల్ చెప్పారు, -

*     ‘ఏంజెల్ టాక్స్’ సమస్యలను తొలగించడం; పన్ను విధానాన్ని సరళీకృతం చేయడం; స్వీయ-ధృవీకరణతో పాటు స్వీయ-నియంత్రణను అనుమతించడం

*     26,500 కంపెనీల భారాన్ని తగ్గించడం; 

*     770 ఫిర్యాదుల పరిష్కారం

నూతన భారతదేశాన్ని ఈ రోజు ఆవిష్కరణ, సాంకేతికత, వ్యవస్థాపకత (ఐ.టి.ఈ) అనే మూడు కొత్త అంశాలు నడిపిస్తున్నాయని, శ్రీ గోయల్ పేర్కొన్నారు.  ఇది ఒక విధంగా ప్రాథమిక ఐ.సి.ఈ. (సమాచారం, కమ్యూనికేషన్, వినోదం) నుండి మరింత అభివృద్ధి చెందింది. 

"చాలా సంవత్సరాల క్రితం ఐ.సి.ఈ. పరిచయం చేసిన సమయంలో, కొత్త సమాచార యుగం గురించి మేము సంతోషించాము.  ఈ రోజు, ఐ.టీ.ఈ. రంగాల్లో మన అంకురసంస్థలు అభివృద్ధి చెందుతున్న తీరులో అదే చైతన్యం, ఉత్సాహం కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.

భారతదేశపు ప్రత్యేకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు - ఆధార్, డిజి-లాకర్, ఫాస్టాగ్, కోవిన్, యు.పి.ఐ. మొదలైనవి వినియోగానికి అనువుగా, అందుబాటు ధరల్లో లభించాయని శ్రీ గోయల్ చెప్పారు.

"ప్రపంచంలోని అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని భారతీయులు సమర్ధవంతంగా, ప్రభావవంతంగా, డిజిటల్‌ గా, పూర్తి మ్యాపింగ్ మరియు పర్యవేక్షణతో నిర్వహించగలరని కోవిన్ పోర్టల్ ప్రపంచానికి తెలియజేసింది. సరసమైన ధరలలో సామాన్యులకు చేరువయ్యేందుకు నూతన యుగ సాంకేతికతలకు యు.పి.ఐ. సహాయపడింది” అని శ్రీ గోయల్ అన్నారు.

“తదుపరి “యు.పి.ఐ. మూమెంట్” ఓ.ఎన్.డి.సి. (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్‌ వర్క్) అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా, ఈ-కామర్స్ కంపెనీల మధ్య ఇంటర్‌ ఆపరేబిలిటీని ప్రారంభించడానికి ఓ.ఎం..డి.సి. చిన్న, పెద్ద వినియోగదారులకు సమాన అవకాశాన్ని కల్పిస్తుంది, డిజిటల్ గుత్తాధిపత్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. కొనుగోలుదారులు, అమ్మకందారుల కోసం పరిశ్రమను మరింత కలుపుకొని, ఆవిష్కరణ, విలువను అన్‌-లాక్ చేయడానికి ఎం.ఎస్.ఎం.ఈ. లను శక్తివంతం చేస్తుంది.” అని, ఆయన చెప్పారు. 

నాస్కామ్ కోసం ముందుకు వెళ్లేందుకు శ్రీ గోయల్ ఐదు అంశాలతో ఒక ప్రణాళికను ఆవిష్కరించారు:

1.     ప్రజల ప్రాథమిక, ప్రధాన అవసరాలను నొక్కి చెప్పడం, - ఆర్థిక సేవలు, విద్య, ఆరోగ్య సంరక్షణకు మెరుగైన ప్రాప్యతను అందించడం; రైతుల సమస్యలకు పరిష్కారాలు మొదలైనవి.

2.     అధిక వృద్ధి, ఉద్యోగాలను సృష్టించే రంగాలపై దృష్టి పెట్టండి, - అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, వృత్తిపరమైన సేవలు, ఫిట్‌నెస్, వెల్నెస్ (యోగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతోంది), గేమింగ్, స్పోర్ట్స్, ఆడియో-విజువల్ సేవలు

3.     స్థానిక, అంతర్జాతీయ మార్కెట్‌ల కోసం పరిష్కారాలను రూపొందించడానికి మరిన్ని పెద్ద సంఖ్యలో అంకురసంస్థలు డీప్-టెక్‌ని ఉపయోగించాలి - ఏ.ఐ., ఐ.ఓ.టి., బిగ్ డేటా, సమాచార విశ్లేషణలు; బ్లాక్‌చెయిన్; వర్చువల్ రియాలిటీ; 3డి. ప్రింటింగ్, డ్రోన్లు మొదలైనవి.

4.     ద్వితీయ, తృతీయ స్థాయి నగరాల్లో అంకుర సంస్థల స్థాపనకు మంచి అవకాశాలు ఉన్నాయి.  వారికి మరింత మద్దతు, తగిన మార్గదర్శకత్వం అందించినట్లయితే, వారు రాబోయే సంవత్సరాల్లో మరింత గొప్ప పాత్రను పోషించగలరు.

5.     భారతదేశం 2023లో జి.20 దేశాల కూటమి అధ్యక్ష పదవిని చేపడుతుంది - ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి, మన దృష్టితో ప్రతిధ్వనించే ఇతివృత్తాలపై మీ ఆలోచనలను సూచించండి.

ప్రస్తుతం అమలులో ఉన్న భారతీయ అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థ ఉత్సాహం, రాబోయే సంవత్సరాల్లో కూడా  కొనసాగుతుందని శ్రీ గోయల్ ఆకాంక్షించారు.

“2021, మనం అన్ని అసమానతలను అధిగమించిన సంవత్సరం, 2022,  దేశం యొక్క ఘాతాంక విలువను అన్‌లాక్ చేసే పురోగతి సంవత్సరం. ‘ఇండియా ఎట్ 100’ అంకుర సంస్థల దేశంగా పేరు పొందుతుంది. అయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పినట్లుగా- రాబోయే 25 సంవత్సరాలు “అమృత కాలం” -- అత్యంత శ్రమ, త్యాగం, తపస్సు యొక్క కాలం,”అని ఆయన పేర్కొన్నారు.

*****


(Release ID: 1791694) Visitor Counter : 168


Read this release in: Urdu , English , Tamil , Malayalam