వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ (నేషనల్ సింగిల్ విండో సిస్టమ్)ని పెద్ద పెద్ద సంస్థలు మరియు విదేశాలలోని భారతీయ మిషన్‌లకు తీసుకెళ్లండి - పీయూష్ గోయల్
ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్ భద్రత మరియు ప్రమాద పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నామినేట్ చేయాలి: గోయల్
నో యువర్ అప్రూవల్స్ (కేవైఏ) సర్వీస్ ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ లో 32 కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్లలో 544 ఆమోదాలతో ఉంటుంది
కార్యకలాపాల సరళత మరియు పారదర్శకతపై జాతీయ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్) దృష్టి ఉండాలి అన్న పీయూష్ గోయల్
ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ వేదిక సమీక్షా సమావేశానికి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు
గుజరాత్‌లో రీసైక్లింగ్ వెహికల్ స్క్రాపేజ్ ఫెసిలిటీ కోసం జనవరి 11న ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్ ద్వారా మొదటి ఆమోదం లభించింది.
Posted On:
21 JAN 2022 3:31PM by PIB Hyderabad
జాతీయ సింగిల్ విండో సిస్టమ్ (ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్)లో కార్యకలాపాల సరళత మరియు పారదర్శకత దృష్టి కేంద్రీకరించాలని వాణిజ్యం మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ కార్యక్రమాల సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ గోయల్ మాట్లాడుతూ, ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్‌లో ప్రతి సమీకృత మంత్రిత్వ శాఖలకు ఒక సెట్ ఆమోదాల పూర్తి ముగింపు పరీక్ష ఉండాలన్నారు.
ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ పెట్టుబడిదారులను గుర్తించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇది 32 కేంద్ర మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లలో సమాచారానికి మద్దతు ఇస్తుంది మరియు ప్లాట్‌ఫారమ్‌లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ వంటి 14 రాష్ట్రాలు ఉన్నాయి. మరో 6 రాష్ట్రాలను చేర్చే ప్రక్రియ పురోగతిలో ఉంది.
శ్రీ గోయల్ మాట్లాడుతూ, వేగవంతమైన ఆమోదాలను నిర్ధారించడానికి మరియు సమయాన్ని ఆదా చేయడానికి, మెరుగైన కమ్యూనికేషన్ వ్యూహాన్ని ప్లాన్ చేయాలని ప్లాట్‌ఫారమ్ గురించి అవగాహన కల్పించడానికి, పెద్ద పెద్ద సంస్థల ముందు, విదేశాలలో ఉన్న భారతీయ మిషన్‌లకు ప్రదర్శనలు ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్ భద్రత మరియు ప్రమాద పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పని చేయడానికి చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌ను నామినేట్ చేయాలని మంత్రి అన్నారు.
67,000 వాహనాల సామర్థ్యంతో గుజరాత్‌లోని ఖేడాలోని వెహికల్ స్క్రాపేజ్ ఫెసిలిటీ ఆర్ వి ఎస్ ఎఫ్ కోసం సిఎంఆర్-కటారియా రీసైక్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎన్‌ఎస్‌డబ్ల్యుఎస్ పోర్టల్ ద్వారా మొదటి ఆమోదం 11 జనవరి 2022న మంజూరు చేయబడింది. ఆర్ వి ఎస్ ఎఫ్ దరఖాస్తును 08 నవంబర్ 2021న ఆన్‌లైన్‌లో సమర్పించినప్పటి నుండి 63 రోజుల కాలక్రమంలో ఆమోదం సాధ్యమైంది.
*****
(Release ID: 1791693)
Visitor Counter : 163