నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav g20-india-2023

' ఎలక్ట్రిక్ వాహనాల బ్యాంకింగ్ ' నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎంఐ), ఆర్ఎంఐ ఇండియా


ప్రాధాన్యతా రంగంగా గుర్తించి రుణాలు అందిస్తే 2025 నాటికి 40,000 కోట్ల ఈవి మార్కెట్ సాధించి, కాప్ 26 లక్ష్యాలను చేరుకోవచ్చు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలను సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యతా రంగం జాబితాలో చేర్చాలని సూచించిన నీతి ఆయోగ్- ఆర్ఎంఐ నివేదిక

Posted On: 21 JAN 2022 3:20PM by PIB Hyderabad

ఎలక్ట్రిక్  వాహనాల బ్యాంకింగ్ అనే అంశంపై రూపొందించిన  నివేదికను ఈ రోజు  నీతి ఆయోగ్రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఎంఐ)ఆర్ఎంఐ ఇండియా విడుదల చేశాయి. రవాణా రంగంలో ఎలక్ట్రిక్  వాహనాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకు  ప్రాధాన్యత ఇచ్చి అమలు చేయాల్సిన చర్యలను ఈ నివేదికలో పొందుపరిచారు. ప్రాధాన్యతా రంగాలకు రుణ పరపతి అందించేందుకు  భారత రిజర్వు బ్యాంకు రూపొందించి అమలు చేస్తున్న మార్గదర్శకాల్లో ఎలక్ట్రిక్  వాహనాల రంగాన్ని కూడా చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించిన నివేదిక దీనికోసం సిఫార్సులను జత చేసింది. 

భారతదేశంలో  ఎలక్ట్రిక్  వాహనాల రంగం ద్వారా 2025 నాటికి 40,000 కోట్ల రూపాయలు, 2030 నాటికి 3.7 లక్షల కోట్లు ( 50 బిలియన్ అమెరికా డాలర్లు)  రూపాయల లావాదేవీలను సాగించడానికి బ్యాంకింగ్నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితేఎలక్ట్రిక్  వాహనాలకు అందిస్తున్న రిటైల్ ఫైనాన్స్ ఆశించినంత వేగం పుంజుకోలేదని నివేదికలో పేర్కొన్నారు.

భారతదేశంలో ఎలక్ట్రిక్  వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించి తద్వారా కర్బన విడుదలను తగ్గించే అంశంలో ఆర్థిక సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అని నీతి ఆయోగ్ సీఈఓ శ్రీ అమితాబ్ కాంత్ అన్నారు. జాతీయ ప్రాధాన్యత గల అంశాలకు రుణాలను అందించేందుకు భారత రిజర్వు బ్యాంకు రూపొందించి అమలు చేస్తున్న మార్గదర్శకాలు సమర్ధంగా అమలవుతూ ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్  వాహనాల రంగానికి ప్రాధాన్యత క్రమంలో రుణాలు అందించేలా బ్యాంకులు,  నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలకు భారత రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాలు జారీ చేయాలి.అని ఆయన అన్నారు. 

ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చి ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలన్న లక్ష్యంతో ప్రాధాన్యతా రంగాలకు రుణాలు అందించే కార్యక్రమం అమలు జరుగుతోంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు వివిధ ఎలక్ట్రిక్  వాహనాల రంగాలను పరిగణనలోకి తీసుకునిఅయిదు అంశాల ప్రాతిపదికన భారత రిజర్వు బ్యాంకు ప్రణాళిక రూపొందించాలని నివేదికలో పేర్కొన్నారు. సామాజిక-ఆర్థిక అంశాలుజీవనోపాధి మార్గాలను మెరుగు పరిచే సామర్థ్యంవివిధ దశలుసాంకేతిక ఆర్థిక వెసులుబాటుఆమోదయోగ్యత అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంకు నిర్ణయాలు తీసుకోవాలని నివేదికలో పేర్కొన్నారు. 

ఎలక్ట్రిక్  వాహనాల నాణ్యతఎలక్ట్రిక్  వాహనాలను తిరిగి అమ్మినప్పుడు వుండే విలువపై స్పష్టత లేకపోవడంతో తక్కువ వడ్డీ రేట్లతో   దీర్ఘ కాల రుణాలను అందించేందుకు సందేహిస్తున్నాయని ఆర్ఎంఐ మేనేజింగ్ డైరెక్టర్ క్లే స్ట్రేంజర్ అన్నారు. ఎలక్ట్రిక్  వాహనాల రంగాన్ని ప్రాధాన్యతా రంగం జాబితాలో చేరిస్తే బ్యాంకులు ఈ రంగానికి త్వరితగతిన వేగంగా  రుణాలు అందిస్తాయని అన్నారు. దీనివల్ల 2070 వాతావరణ లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. 

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలుమూడు చక్రాల వాహనాలు మరియు వాణిజ్య వాహనాలను  సాధ్యమైనంత త్వరగా ప్రాధాన్యతా రంగం జాబితాలో చేర్చాలని నివేదిక సిఫార్సు చేసింది. ఈ అంశంలో ముందడుగు వేసిఎలక్ట్రిక్ వాహనాల రంగంలో పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడే మార్గదర్శకాలు రూపొందించేందుకు ఇతర మంత్రిత్వ శాఖలు, పరిశ్రమ వర్గాలు కలిసి పని చేయవలసి ఉంటుంది. 

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఎక్కువ చేసేందుకుపునరుత్పాదక ఇంధన, ఎలక్ట్రిక్ వాహనాల రంగాలకు ప్రత్యేకంగా లక్ష్యాలను నిర్దేశించాలని నివేదిక సూచించింది. దీనికోసం ప్రత్యేక వ్యవస్థకు రూపకల్పన చేయాలని నివేదిక పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని  మౌలిక సదుపాయాల ఉప-రంగంగా గుర్తించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు నివేదికలో సూచించారు. భారత రిజర్వు బ్యాంకు   ప్రత్యేక రిపోర్టింగ్ కేటగిరీగా ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని గుర్తించాలని   సూచించారు. ఈ చర్యల వల్ల   ఎలక్ట్రిక్ వాహనాల రంగం అభివృద్ధికి మాత్రమే కాకుండా  వాణిజ్య  ఆర్థిక రంగ అభివృద్ధికి తోడ్పడి 2070 నాటికి సాదించాలని నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు ఉపకరిస్తాయని నివేదిక పేర్కొంది. 

పూర్తి నివేదికను ఇక్కడ here చూడవచ్చు.  

***(Release ID: 1791686) Visitor Counter : 212