మంత్రిమండలి
నిర్దిష్ట రుణ ఖాతాల్లో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ ,సరళ వడ్డీ మధ్య వ్యత్యాస ఎక్స్ గ్రేషియా చెల్లింపు మంజూరు పథకానికి మంత్రిమండలి ఆమోదం
Posted On:
19 JAN 2022 3:35PM by PIB Hyderabad
నిర్దిష్ట రుణ ఖాతాలలో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు (1.3.2020 to 31.8.2020)
చక్రవడ్డీ ,సరళ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మంజూరు చేసే పథకం కింద రుణ సంస్థలు (ఎల్ ఐలు) సమర్పించిన మిగిలిన క్లెయింలకు సంబంధించి రూ.973.74 కోట్ల ఎక్స్ గ్రేషియా మొత్తాన్ని చెల్లించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
రుణగ్రహీత మారటోరియంను పొందారా లేదా అనే దానితో సంబంధం లేకుండా, ఆరు నెలల మారటోరియం వ్యవధిలో చక్రవడ్డీ మరియు సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసానికి ఎక్స్-గ్రేషియా చెల్లింపును మంజూరు చేయడం ద్వారా బాధలో ఉన్న/దుర్బలంగా ఉన్న రుణగ్రహీతలకు ఈ పథకం చిన్న రుణగ్రహీతలకు మహమ్మారి కారణంగా ఒత్తిడిని భరించడానికి , తిరిగి నిలదొక్కుకోవడానికి సమానంగా సహాయపడుతుంది.
ఈ పథకానికి సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదంతో జారీ అయ్యాయి. ఈ ఆపరేషనల్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ. 973.74 కోట్లు పంపిణీ చేస్తారు.
నేపథ్యం:
కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో, "నిర్దిష్ట రుణ ఖాతాల్లో రుణగ్రహీతలకు ఆరు నెలల పాటు చక్రవడ్డీ ,సరళ వడ్డీ మధ్య వ్యత్యాసాన్ని మంజూరు చేసే పథకం (1.3.2020 నుండి 31.8.2020)" ను అక్టోబర్, 2020లో మంత్రివర్గం ఆమోదించింది, దీనిలో రూ. 5,500 కోట్ల పెట్టుబడిని ఉద్దేశించారు. ఈ పథకం కింద దిగువ కేటగిరీ రుణగ్రహీతలు ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు అర్హులు.
రూ. 2 కోట్ల వరకు ఎమ్ ఎస్ ఎమ్ ఈ రుణాలు
II. రూ.2 కోట్ల వరకు విద్యా రుణాలు
III. రూ.2 కోట్ల వరకు గృహ రుణాలు
iv. రూ.2 కోట్ల వరకు కన్స్యూమర్ డ్యూరబుల్ రుణాలు
v. రూ.2 కోట్ల వరకు క్రెడిట్ కార్డు బకాయిలు
Vi. రూ.2 కోట్ల వరకు ఆటో రుణాలు
vii. రూ. 2 కోట్ల వరకు ప్రొఫెషనల్స్ కు వ్యక్తిగత రుణాలు
viii. రూ. 2 కోట్ల వరకు వినియోగ రుణాలు
2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి రూ.5,500 కోట్ల బడ్జెట్ కేటాయింపు జరిగింది. క్యాబినెట్ ఆమోదం తో రూ.5,500 కోట్ల మొత్తాన్ని ఈ పథకం కింద నోడల్ ఏజెన్సీ అయిన ఎస్ బిఐ కి రుణ సంస్థలకు తిరిగి చెల్లించడానికి పంపిణీ చేశారు.
పైన పేర్కొన్న రుణాల కేటగిరీ కి ఎస్ బిఐ ,షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల వాటాను బహిర్గతం చేయడం ద్వారా రూ. 5,500 కోట్ల అంచనా మొత్తం వచ్చింది.వ్యక్తిగత రుణ సంస్థలు తమ ప్రీ ఆడిట్ ఖాతా వారీగా క్లెయింలను సమర్పించిన తర్వాత వాస్తవ మొత్తం తెలుస్తుంది అని కూడా మంత్రివర్గానికి నివేదించారు.
ఇప్పుడు, ఎస్ బిఐ రుణ సంస్థల నుండి సుమారు రూ.6,473.74 కోట్ల ఏకీకృత క్లెయింలను అందుకున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ఎస్ బిఐకి రూ.5,500 కోట్లు పంపిణీ చేసినందున, ఇప్పుడు రూ.973.74 కోట్ల బ్యాలెన్స్ మొత్తానికి మంత్రివర్గం ఆమోదం కోరారు.
***
(Release ID: 1791014)
Visitor Counter : 281
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam