శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

2022 లో చేపట్టే కార్యక్రమాలను చర్చించిన బ్రిక్స్ స్టీరింగ్ కమిటీ 2022 లో అయిదు కార్యక్రమాలకు ఆతిధ్యం ఇవ్వనున్న భారతదేశం

Posted On: 18 JAN 2022 4:07PM by PIB Hyderabad

2022 లో భారతదేశంలో  అయిదు బ్రిక్స్ సమావేశాలు జరగనున్నాయి. భారతదేశంలో అంకుర సంస్థల వేదిక ,ఇంధనశక్తిపై వర్కింగ్ గ్రూపుల సమావేశాలుబయోటెక్నాలజీ  బయోమెడిసిన్,  ఐసీటీ మరియు  హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్;  స్టెప్  (సైన్స్టెక్నాలజీఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్టనర్‌షిప్) వర్కింగ్ గ్రూప్ సమావేశం తో పాటు బ్రిక్స్ ఇన్నోవేషన్ లాంచ్‌ప్యాడ్‌ను మైక్రోసైట్ (నాలెడ్జ్ హబ్) సమావేశాలకు భారతదేశం ఆతిధ్యం ఇస్తుంది. 2022 జనవరి 17 వ తేదీన జరిగిన బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ (ఎస్ టీ ఐస్టీరింగ్ కమిటీ 15వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 

వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో 2022 లో నిర్వహించే  బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ కార్యక్రమాలను, వీటివల్ల కలిగే ప్రయోజనాలను విపులంగా చర్చించారు. బ్రిక్స్ అధ్యక్ష భాద్యతలను భారతదేశం నుంచి చైనా స్వీకరించింది. 2022 జనవరి నుంచి బ్రిక్స్ చైర్మన్ గా చైనా వ్యవహరిస్తుంది. ' బ్రిక్స్ భాగస్వామ్య విలువలను ఉన్నత స్థానాలకు తీసుకుని వెళ్లి ప్రపంచ అభివృదిలో నూతన శకానికి నాంది పలకడం' అన్న అంశంపై 2022 లో బ్రిక్స్ దృష్టి సారించి కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఈ ఏడాది మంత్రుల స్థాయి సమావేశాలను, బ్రిక్స్ సదస్సు,  వివిధ రంగాలకు సంబంధించిన చర్చలు సమావేశాలు జరగనున్నాయి. 

బ్రిక్స్ దేశాలకు చెందిన శాస్త్ర మంత్రులు, విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధులు బ్రిక్స్ సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ (ఎస్ టీ ఐసమావేశంలో పాల్గొన్నారు.  శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ సలహాదారుఅంతర్జాతీయ సహకారం అధిపతి శ్రీ సంజీవ్ కుమార్ వర్సనే నాయకత్వంలో భారత బృందం సమావేశంలో పాల్గొంది. 

ఈ ఏడాది చేపట్టిఅమలు చేసే కార్యక్రమాలపై చైనా బృందం సంక్షిప్తంగా వర్చువల్ విధానంలో వివరించింది. బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల శిఖరాగ్ర సదస్సువివిధ అంశాలపై సదస్సులుసీనియర్ అధికారులుమంత్రుల స్థాయి సమావేశంలో ఈ ఏడాది నిర్వహించాలని చైనా ప్రతిపాదించింది. ఈ ఏడాది బ్రిక్స్ నిర్వహించనున్న 25 కార్యక్రమాల్లో అయిదు కార్యక్రమాలు భారతదేశంలో జరుగుతాయి. పరిశ్రమలుఅంతర్గత వాణిజ్య ప్రోత్సాహక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బ్రిక్స్ అంకుర సంస్థల వేదిక, మరియు ఇన్నోవేషన్ నాలెడ్జ్ హబ్‌ సమావేశాలు జరుగుతాయి. బ్రిక్స్ యువ శాస్త్రవేత్తల శిఖరాగ్ర సమావేశం వర్చువల్ విధానంలో జరుగుతుంది. కర్బన ఉద్గారాల తగ్గింపు, బయో మెడిసిన్, కృత్రిమ మేధస్సు, మెటీరియల్ సైన్స్, ఆధునిక వ్యవసాయం లాంటి అంశాలపై శిఖరాగ్ర సదస్సు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

2022 సెప్టెంబర్ నెలలో  శాస్త్ర సాంకేతిక మంత్రుల స్థాయి సమావేశాలను, సీనియర్ అధికారుల సమావేశాలను నిర్వహిస్తామని చైనా ప్రతినిధి వర్గం తెలిపింది.  ఓపెన్ఇన్‌క్లూజివ్ మరియు షేర్డ్ సైన్స్టెక్నాలజీ మరియు ఆవిష్కరణలు ప్రోత్సాహం అంశాలపై ఈ సమావేశాలు జరుగుతాయి. మంత్రుల స్థాయి  సమావేశంలో భాగంగా  బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్ ప్రోగ్రామ్ (2015-2022) కింద మద్దతు పొంది  విజయవంతమైన ప్రాజెక్ట్‌ల వివరాలతో  ఒక ప్రదర్శనను నిర్వహించడం జరుగుతుంది. 

బ్రిక్స్ నిర్వహించే శాస్త్రీయ కార్యక్రమాలను చర్చించిన సమావేశం దీనికి సంబంధించి కార్యక్రమాలను ఖరారు చేసింది. సమావేశాలు జరిగే తేదీ, వేదిక, చర్చించే అంశాలపై ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలు అందించేందుకు సభ్య దేశాలు అంగీకరించాయి.ఇన్నోవేషన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పార్టనర్‌షిప్) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు 2022 మార్చి 23,24 తేదీలు, 2022 మే/జూన్ నెలలో అంకుర సంస్థల వేదిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని భారతదేశం సూత్రప్రాయంగా తెలిపింది.  

 

 

 

***



(Release ID: 1790793) Visitor Counter : 536