భారత ఎన్నికల సంఘం
20 ఫిబ్రవరి 2022న (ఆదివారం) పంజాబ్ రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు
Posted On:
17 JAN 2022 3:24PM by PIB Hyderabad
అందుబాటులో ఉన్న అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం 8 జనవరి, 2022న.. పంజాబ్ రాష్ట్ర శాసనసభకు సాధారణ ఎన్నికలు -2022ను ప్రకటించింది. దీని ప్రకారం పంజాబ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల నోటిఫికేషన్ 21 జనవరి 2022న జారీ చేయబడుతుంది. పంజాబ్ రాష్ట్ర శాసనసభకు పోలింగ్ ఫిబ్రవరి 14న 2022 జరుగుతుంది. 16 ఫిబ్రవరి 2022న జరుపుకునే శ్రీ గురు రవిదాస్ జీ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు.. పంజాబ్ నుండి వారణాసి నగరానకి పెద్ద సంఖ్యలో భక్తుల తరలి నున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, పలు ఇతర సంస్థలు నుంచి కమిషన్ అనేక ప్రాతినిధ్యాలను అందాయి. ఈ కారణంగా వారణాసికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిపోవడం ప్రారంభిస్తారని. దీంతో 2022 ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించడం వల్ల.. పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటు వేయకుండా మిగిలిపోతారని వారు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యాంలో వారు పోలింగ్ తేదీని 16 ఫిబ్రవరి 2022 తర్వాత కొన్ని రోజులకు మార్చాలని అభ్యర్థించారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రధాన ఎన్నికల అధికారి నుండి కూడా కమిషన్ వివరణలు తీసుకుంది. ఈ ప్రాతినిధ్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుండి వచ్చిన ఇన్‌పుట్‌లు, గత ప్రాధాన్యత, వాస్తవాలు, ఇతర పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు కమిషన్ ఈ క్రింది పద్ధతిలో పంజాబ్ శాసనసభకు సాధారణ ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించింది. :
1. నోటిఫికేషన్ తేదీ: 25 జనవరి 2022 (మంగళవారం)
2. నామినేషన్ చివరి తేదీ: 1 ఫిబ్రవరి 2022 (మంగళవారం)
3. నామినేషన్ల పరిశీలన తేదీ: 2 ఫిబ్రవరి 2022 (బుధవారం)
4. నామినేషన్ల ఉపసంహరణ తేదీ: 4 ఫిబ్రవరి 2022 (శుక్రవారం)
5. పోలింగ్ తేదీ: 20 ఫిబ్రవరి 2022 (ఆదివారం).
6. ఓట్ల లెక్కింపు 10 మార్చి 2022న (గురువారం) చేపడుతారు.
****
(Release ID: 1790601)
Visitor Counter : 174