శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016లో ప్రారంభించిన స్టార్టప్స్ ఇండియా కార్యక్రమానికి జమ్ము కాశ్మీర్ వంతు సహకారం పర్పుల్ రెవల్యూషన్ అని అన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
దేశం ఈరోజు తొలి నేషనల్ స్టార్టప్ దినోత్సవాన్ని జరుపుకుంటోంది.
జమ్ము కాశ్మీర్ లో వ్యవసాయ స్టార్టప్‌లు ఎక్కువగా సుగంధాలు, లావెండర్ సాగును ఎంచుకుంటున్నాయి : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
16 JAN 2022 5:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016లో ప్రారంబించిన స్టార్టప్ ఇండియా కార్యక్రమానికి జమ్ము కాశ్మీర్ వంతు పాత్ర పర్పుల్ రెవల్యూషన్ అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), భూ విజ్ఞాన, శాఖ సహాయ మంత్రి (స్వంతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్, అణు ఇంధనం, అంతరిక్ష శాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు దేశం తొలి జాతీయ స్టార్టప్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నది.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ, కౌన్సిల్ ౠఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సిఎస్ ఐ ఆర్) ప్రారంభించిన సుగంధద్రవ్యాల మిషన్, ఇండియాలో బహుళ ప్రచారం పొందిన పర్పుల్ రెవల్యూషన్ గా ప్రసిద్ధి కెక్కిందని అన్నారు. సిఎస్ ఐ ఆర్ సంస్థ జమ్ములోని తమ లేబరెటరీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ (ఐఐఐఎం) ద్వారా అత్యంత విలువ కలిగిన ఆయిల్‌తో కూడిన లావెండర్ పంటను పరిచయం చేసినట్టు తెలిపారు. దీనిని దోడా, కిస్టవర్, రాజౌరి, జిల్లాలలో అలాగే ఇతర జిల్లాలైన రామ్‌బన్ , పుల్వామా, తితర జిల్లాలలో సాగు ప్రారంభింపచేసినట్టు తెలిపారు. స్వల్ప వ్యవధిలోనే అరోమా , లావెండర్ సాగు జమ్ముకాశ్మీర్‌లోని వ్యవసాయ స్టార్టప్ లకు ప్రముఖ ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుందని ఆయన అన్నారు.
దోడా జిల్లాలోని మారుమూల గ్రామమైన ఖిలాని కి చెందిన భరత్ భూషన్ విజయం సాధించిన యువకుడిగా ఇతరులకు మార్గదర్శిగా నిలుస్తున్నారని అతని విజయ గాధను తెలిపారు . భూషణ్ కేవలం 0.1 హెక్టారు భూమిలో సిఎస్ ఐ ఆర్-ఐఐఐఎం మద్దతుతో లావెండర్ సాగు ప్రారంభించారు. లాభాలు రావడం మొదలు పెట్టడంతో తనకు గల మొక్కజొన్న పంటను కూడా లావెండర్ సాగుకు మార్చాడు. ఇవాళ తనతోపాటు మరో 20 మంది తన లావెండర్ పొలంలో ,నర్సరీలో పనిచేస్తున్నారు. ఇదే జిల్లానుంచి మరో 500 మంది అతనిని అనుసరిస్తూ మొక్కజొన్న పంటనుంచి లావెండర్ సాగుకు మారినట్టు ఆయన తెలిపారు.
అయితే దురదృష్ట వశాత్తూ ఇది స్థానిక మీడియాలో ఎన్నడూ రిపోర్టు కాలేదని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అరోమా, లావెండర్ ల సాగు నుంచి వాటి అమ్మకం వరకు స్టార్టప్ లకు ఐఐఐఎం ,జమ్ము సహాయపడుతున్నదని అన్నారు. ముంబాయికి చెందిన ప్రముఖ కంపెనీలైన అజమల్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, అదితి ఇంటర్నేషనల్,నవనైత్రి గమిక తదితర సంస్థలు ప్రాథమికంగా వీటి కొనుగోలు దారులుగా ఉన్నాయి
అరోమా మిషన్ 1ని పూర్తి చేసుకుని రెండో దశను సిఎస్ ఐ ఆర్ ప్రారంభించినట్టు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా డాక్టర్‌జితేంద్ర సింగ్ ప్రకటించారు. దీనికి తోడు ఐఐఐఎం, సిఎస్ ఐఆర్-ఐహెచ్ బిటి, సిఎస్ఐఆర్ - ఎన్ బిఆర్ ఐ, సిఎస్ ఐఆర్- ఎన్ ఇ ఐ ఎస్ టి సంస్థలు కూడా అరోమా మిషన్ లో ఇప్పుడు పాల్గొంటున్నాయి.
ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అంశం ఏమంటే,అరోమా మిషన్ దేశవ్యాప్తంగా గల స్టార్టప్ లను ఆకర్షిస్తోంది. తొలి దశలో సిఎస్ ఐఆర్ దేశవ్యాప్తంగా గల 46 ఆకాంక్షిత జిల్లాలలోని 6000 హెక్టార్లలో అరోమా సాగుకు సహాయపడింది.44,000 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. కోట్లాది రూపాయలను రైతులు ఆర్జించారు. రెండో దశ అరోమా మిషన్ లో 45,000 మంది నైపుణ్యంగల వారి సేవలను వినియోగించుకోవాలని ప్రతిపాదించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 75,000 రైతు కుటుంబాలు ప్రయోజనం పొందుతాయి.
***
(Release ID: 1790440)
Visitor Counter : 214