కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కోవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో వ‌ల‌స‌కార్మికుల‌కు సంబంధించి స‌న్న‌ద్థ‌త‌ను స‌మీక్షించేందుకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌తో స‌మావేశం ఏర్పాటు.


కార్మికులు పెద్ద ఎత్తున త‌ర‌లిపోవ‌డం కానీ, ప్ర‌త్యేకించి వ‌ల‌స కార్మికులు త‌ర‌లివెళుతుండ‌డం కానీ లేవు : రాష్ట్రాల కార్మిక క‌మిష‌న‌ర్లు

ఈ- శ్ర‌మ్ లో పేర్లు న‌మోదు చేసుకున్న 21 కోట్ల మంది అసంఘ‌టితరంగ కార్మికులు- కార్య‌ద‌ర్శి, కార్మిక , ఉపాధి శాఖ‌
దేశ‌వ్యాప్తంగా క్రియాశీల‌మైన‌ 21 మానిట‌రింగ్ సెంట‌ర్లు

Posted On: 13 JAN 2022 5:10PM by PIB Hyderabad

ప్ర‌స్తుతం దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా నెల‌కొన్న కోవిడ్ మ‌హ‌మ్మారి ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్ర కార్మిక‌, ఉపాధి మంత్రిత్వశాఖ కార్య‌ద‌ర్శి శ్రీ సునీల్ బ‌ర్త్ వాల్ 12-01-2022న వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స‌మ‌న్వ‌య స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. ఈ స‌మావేశంలో  రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల స‌న్న‌ద్ధ‌త కు సంబంధించిన‌ సాధార‌ణ అంశాలు, ప్ర‌త్యేకించి వ‌ల‌స కార్మికుల కు సంబంధించిన అంశాల‌ను చ‌ర్చించారు.

అద‌న‌పు ఛీఫ్ సెక్ర‌ట‌రీలు, ప్రిన్సిల్ సెక్ర‌ట‌రీలు, రాష్ట్రాల కార్మిక విభాగాల కార్య‌ద‌ర్శులు, అన్ని రాష్ట్రాల , కేంద్ర‌పాలిత ప్రాంతాల కార్మిక క‌మిష‌న‌ర్లు, రైల్వే మంత్రిత్వ‌శాఖ అధికారులు, ఆహారం, ప్ర‌జాపంపిణీ విభాగం అధికారులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

కోవిడ్ కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌లో,  కొన్ని చోట్ల‌ రాత్రి క‌ర్ఫ్యూలు, వారాంత‌పు క‌ర్ఫ్యూలు మిన‌హా నిర్మాణ ప‌నుల‌పై ఆంక్ష‌లు కానీ, వ్యాపార కార్య‌క‌లాపాల‌పై న ఆంక్ష‌లు లేదా, షాపులు న‌డ‌ప‌డం, పారిశ్రామిక కార్య‌క‌లాపాల వంటి వాటిపై ఆంక్ష‌లు ఏవీ లేవ‌ని రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు తెలిపాయి. ఇప్ప‌టివ‌ర‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం, ప్ర‌భుత్వాలు ప‌రిమిత స్థాయిలో ఆంక్ష‌లు విధించినందువ‌ల్ల వ‌ల‌స కార్మికులు అసాధార‌ణంగా ఒక చోట‌నుంచి మ‌రో చోటికి త‌ర‌లిపోతున్న‌ట్టు స‌మాచారం ఏదీ లేద‌ని తెలిపారు. వ‌ల‌స‌కార్మికులు పెద్ద ఎత్తున త‌మ స్వ‌రాష్ట్రాల‌కు త‌ర‌లివెళుతున్న‌ట్టు  వ‌చ్చిన కొన్ని మీడియా వార్త‌లు అవాస్త‌వ‌మైన‌వి. ఇలాంటి వార్త‌లు పాత ఫోటోల ఆధారంగా చేసిన రిపోర్టింగ్ గా కూడా గమ‌నించ‌డం జ‌రిగింది. స‌మీక్ష జ‌రుగుతున్న రోజు వ‌ర‌కు చూసిన‌పుడు , కొన్ని ప్రాంతాల‌లో  50 శాతం ఆంక్ష‌లు మిన‌హా వ్యాపార కార్య‌క‌లాపాలు  మామూలుగా సాగుతున్నాయి.

దేశంలో ప‌రిస్థితుల‌ను  కేంద్ర‌, రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నాయి. అలాగే ప‌రిస్థితుల‌ను బ‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకునేందుకు పూర్తి స‌న్న‌ద్ధ‌త‌తో ఉన్నాయి. కొన్నిరాష్ట్ర‌ప్ర‌భుత్వాలు అవ‌స‌ర‌మైన కార్మికుల‌కు డ్రై రేష‌న్‌ను పంపిణీచేసేందుకు ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు రూపొందించాయి. కొన్నిరాష్ట్రాలు కేంద్ర‌పాలిత ప్రాంతాలు ఆర్థిక స‌హాయం అందించేందుకు  భ‌వ‌న నిర్మాణ‌, ఇత‌ర నిర్మాణ రంగ కార్మికుల‌ (బి.ఒ.సి.డ‌బ్ల్యు) సెస్ ఫండ్‌, సామాజిక భ‌ద్ర‌తా ఫండ్ నుంచి ఆర్ధిక స‌హాయం అందించేందుకు ఏర్పాట్లు చేశాయి.  రైల్వేలు ప్ర‌స్తుత ప‌రిస్థితిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నాయి. ముఖ్యంగా ముంబాయి, ఢిల్లీ, చెన్నై, కోల్ క‌తా, బెంగళూరు, సికింద్రాబాద్ స్టేష‌న్ ల‌లో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్నాయి. ఒక వేళ అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక రైళ్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. స్థానిక రైల్వే అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు సంప్ర‌దిస్తూ ప‌రిస్థితిని జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు సూచించ‌డం జ‌రిగింది.

నిర్మాణ కార్య‌క‌లాపాలు జ‌రిగే ప్రాంతాలు, ఫ్యాక్ట‌రీలు, ఆయా సంస్థ‌ల కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి అంత‌రాయం క‌ల‌గ‌లేద‌ని అవి కొన‌సాగుతున్నాయ‌ని కార్మిక క‌మిష‌న‌ర్లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌స్తుతం కార్మికులు పెద్ద ఎత్తున త‌ర‌లిపోతున్న ప‌రిస్థితి లేద‌ని, ప్ర‌త్యేకించి వ‌ల‌స కార్మికులు తిరిగి త‌మ స్వ‌రాష్ట్రాలకు  వెళుతున్న ప‌రిస్థితిలేద‌ని వారు తెలిపారు. వ‌ల‌స కార్మికుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు పరిస్థితిని జాగ్రత్త‌గా గ‌మ‌నిస్తున్నాయి.  కార్మికుల‌కు ఎలాంటి క‌ష్టం క‌ల‌గ‌కుండా చూసేందుకు సిద్ధంగా ఉన్నాయి.అవ‌స‌రైతే, వ‌ల‌స కార్మికుల ప‌రిస్థితిని ఎదుర్కొనేందుకు కార్మికుల‌ను స‌ర‌ఫ‌రా చేసే రాష్ట్రాలు, కార్మికుల‌ను అందుకుంటున్న రాష్ట్రాలు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి అవ‌స‌ర‌మైతే వ‌ల‌స కార్మికుల స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేంద‌కు కృషి చేయాల్సిందిగా ఇరు రాష్ట్రాల‌ను కోర‌డం జ‌రిగింది. 

మరో వైపు 21 కోట్ల మంది అసంఘ‌టిత‌రంగ కార్మికులు త‌మ పేర్ల‌ను శ్ర‌మ్ పోర్ట‌ల్ లో న‌మోదు చేసుకున్న‌ట్టు తెలిపారు.  వలస కార్మికుల రికార్డును నిర్వహించడానికి , ఇ-శ్రమ్ పోర్టల్‌లో ఇంకా నమోదు చేసుకోని మిగిలిన కార్మికులందరినీ నమోదు చేయించ‌డానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్ర/కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ ప్రభుత్వాలను కోరారు. అలాగే ఈ- శ్ర‌మ్ పోర్ట‌ల్ లో ఇంకా త‌మ పేర్లు న‌మోదు చేయించుకోని వారిని న‌మోదు చేయించుకునేట్టు చూడాల‌న్నారు. దీనివ‌ల్ల రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు ఆర్ధిక  , త‌దిత‌ర స‌హాయాన్ని త‌గిన స‌మ‌యంలో అందించేందుకు ఇది వీలు క‌ల్పించ‌నుంది..

కేంద్ర ఛీఫ్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం, దేశ‌వ్యాప్తంగా 21 ప‌రిశీల‌క కేంద్రాల‌ను యాక్టివేట్ చేసింది.
రాష్ట్రాలు ఇందుకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబ‌ర్ల‌ను ఏర్పాటు చేశాయి. ఒక దేశం, ఒక రేష‌న్‌కార్డు కింద రేష‌న్ తీసుకోవ‌డానికి సంబంధించి అసాధార‌ణ హెచ్చుత‌గ్గుద‌ల‌లు ఏవీ  లేవు.  అలాగే తిరిగివ‌చ్చిన వ‌ల‌స కూలీల‌కు సంబంధించి అలాంటి వారు, ఎవ‌రైనా ఉంటే రికార్డులు జాగ్ర‌త్త చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరారు. వ‌ల‌స‌ల‌పై పుకార్లు వ్యాపింప చేసేవారిప‌ట్ల  అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందిగా రాష్ట్రాల‌ను కోరారు.. ఇలాంటి పుకార్ల‌ను ఎదుర్కొనేందుకు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించ‌డం జ‌రిగింది.  భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ‌, జీవ‌నోపాధి కి సంబంధించి వ‌ల‌స కార్మికుల‌కు   భ‌రోసా క‌లిగించాల‌ని రాష్ట్రాల‌కు సూచించారు.

 

***



(Release ID: 1789834) Visitor Counter : 120