యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో భాగమైన దీక్షా డాగర్, యష్ ఝంగాస్‌ల
Posted On:
13 JAN 2022 3:58PM by PIB Hyderabad
హర్యానాకు చెందిన గోల్ఫ్ క్రీడాకారిణి దీక్షా డాగర్, జుడోకా యష్ ఝంగాస్ ను టార్గెట్ ఒలింపిక్ స్కీమ్ (టిఒపిఎస్)కు చెందిన మౌలిక, అభివృద్ధి (కోర్ అండ్ డెవలప్‌మెంట్ ) బృందాలలో చేర్చారు.
హర్యానాకు చెందిన ఝజ్జార్‌కు చెందిన లెఫ్ట్ హ్యాండర్ అయిన 21 ఏళ్ళ దీక్షా డాగర్ 2017 వేసవి డెఫ్లింపిక్స్ లో రజత పతకాన్ని గెలుచుకుని, గత ఏడాది ఒలింపిక్ క్రీడలలో 50వ స్థానంలో నిలిచింది. కాగా, హర్యానాలోని పానిపట్ నుంచి యష్, మ్యాట్‌పై తనను తాను వ్యక్తం చేసుకునేందుకు వచ్చాడు.
జాతీయ క్రీడా సమాఖ్య శిక్షణ, పోటీ వార్షిక క్యాలెండర్ (ఎసిటిసి) కింద కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా ఉన్నత స్థాయి అథ్లీట్లకు తోడ్పాటును అందిస్తుంది.
బజ్రింగ్, సునీల్‌కు ఆర్థిక సహాయం
క్రీడా మంత్రిత్వ శాఖ మిషన్ ఒలింపిక్ సెల్ (ఎంఒసి) రెజ్లర్లు బజరంగ్ పునియా, సునీల్ కుమార్‌ల విదేశీ శిక్షణ కోసం ఆర్ధిక సహాయాన్ని ఆమోదించింది.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంశ్య పతకాన్ని సాధించిన బజరంగ్‌కు ఇంతకు ముందు, బిజీ సీజన్ ముందుగా మాస్కోలో 26 రోజుల శిక్షణా శిబిరానికి వెళ్ళేందుకు రూ. 7.53 లక్షల మొత్తాన్ని ఆమోదించింది. అతడికి డిసెంబర్ 27న ప్రారంభమై నడుస్తున్న శిక్షణా శిబిరంలో కొనసాగేందుకు ఇప్పుడు అదనంగా రూ. 1.76 లక్షల అదనపు సహాయాన్ని అందించింది. ఈ 26 రోజుల శిబిరం జనవరి 2022న ముగియనుంది.
జితేందర్, ఆనంద్‌కుమార్‌లు మల్లయుద్ధ భాగస్వామి, ఫిజయోథెరపిస్టుగా బజరంగ్ వెంట ఉన్నారు. బజరంగ్ యుడబ్ల్యుడబ్ల్యు ర్యాంకింగ్ ఈవెంట్లు, బర్హింగ్‌హామ్‌లో కామన్‌వెల్త్ క్రీడలు, చైనాలోని హాంగ్‌ఝౌలో జరుగనున్న ఆసియా క్రీడలు సహా అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో పోటీ పడనున్నారు. నేను ఈ ఫిబ్రవరిలో ఇటలీ, టర్కీలలో జరుగనున్న ర్యాంకింగ్ సిరీస్‌లో, తర్వాత ఏప్రిల్‌లో మంగోలియాలో జరుగనున్న ఏషియన్ ఛాంపియన్ షిప్ లలో పోటీ పడాలి. ప్యారిస్ 2024లో పతకం వర్ణాన్ని మార్చుకోవాలన్న లక్ష్యంతో నేను సాధ్యమైనంత ఉత్తమంగా పోటీపడతాను, అని బజరంగ్ పేర్కొన్నాడు.
గ్రీకో-రోమన్ రెజ్లర్ అయిన సునీల్ కుమార్, రొమేనియా, హంగరీలో జరుగనున్న ప్రత్యేక శిక్షణా శిబిరంలో తన మల్లయుద్ధ భాగస్వామి, కోచ్‌తో సహా పాల్గొనేందుకు రూ. 10.85 లక్షల రూపాయలను మొత్తాన్ని ఆమోదించారు. టిఒపిఎస్ డెవలప్‌మెంట్ గ్రూప్ లో భాగమైన సునీల్ ఈ విదేశీ ట్రిప్‌ను త్వరలో జరుగబోయే యునైటెడ్ వరల్డ్ ర్యాంకింగ్ రెజ్లింగ్ ర్యాంకింగ్ ఈవెంట్లకు సిద్ధం కావడానికి ఉపయోగించుకోనున్నాడు.
సీనియర్ నేషనల్ చాంపియన్ షిప్స్ 2019, 2020, ఏషియన్ చాంపియన్‌షిప్ 2020, సీనియర్ నేషనల్స్ 2021లో సునీల్ స్వర్ణ పతకాలను గెలుచుకున్నాడు.
***
(Release ID: 1789829)
Visitor Counter : 163