భారత పోటీ ప్రోత్సాహక సంఘం
సదర్ ల్యాండ్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ వాటాలను కొనుగోలు చేయడానికి కోరల్ బ్లూ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ను ఆమోదించిన - సి.సి.ఐ.
Posted On:
11 JAN 2022 4:54PM by PIB Hyderabad
సదర్లాండ్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ వాటాలను కోరల్ బ్లూ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) ఆమోదించింది.
ప్రతిపాదిత కలయిక, సదర్ ల్యాండ్ గ్లోబల్ హోల్డింగ్స్ (సదర్ ల్యాండ్) సంస్థ కు చెందిన సాధారణ వాటాలుగా మార్చదగిన "సీరీస్-సి ప్రిఫర్డ్ స్టాక్" ను సంబంధిత షరతులకు లోబడి, కోరల్ బ్లూ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ (జి.ఐ.సి. ఇన్వెస్టర్) రెండు విడతలుగా కొనుగోలు చేయడానికి సంబంధించినది.
పూర్తిగా జి.ఐ.సి. బ్లూ హోల్డింగ్స్ సంస్థ యాజమాన్యంలో ఉన్న జి.ఐ.సి. ఇన్వెస్టర్ సంస్థ, తద్వారా, జి.ఐ.సి. (వెంచర్స్) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం లోని ఒక సంస్థ గా ఉంది. జి.ఐ.సి. ఇన్వెస్టర్ సంస్థ - సింగపూర్‌లో ఒక ప్రత్యేక ప్రయోజనం కోసం పనిచేస్తున్న ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది (i) జి.ఐ.సి. ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పూర్తి యాజమాన్యం లో ఉన్న జి.ఐ.సి. స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు (ii) జి.ఐ.సి. కి చెందిన ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజీస్ గ్రూప్ సంస్థల యాజమాన్యం ద్వారా నిర్వహించబడే పెట్టుబడి హోల్డింగ్ కంపెనీ ల సమూహం లో ఒక భాగం.
సదర్లాండ్ సంస్థ అమెరికాలో ఒక చట్టబద్ధమైన సంస్థ గా ఏర్పడిన ఒక ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీ. సదర్లాండ్ సంస్థ హోల్డింగ్ కంపెనీ గా పనిచేస్తూ, ఇంటిగ్రేటెడ్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ (బి.పి.ఓ); బిజినెస్ ట్రాన్స్‌ఫర్మేషన్; క్లౌడ్; బ్యాక్ ఆఫీస్ సేవలు; ఫ్రంట్ ఆఫీస్ సేవలు; వ్యాపార ప్రక్రియ సేవలు; సాంకేతిక నిర్వహణ సేవలు అందించడంలో ప్రత్యేకత కలిగిన అంతర్జాతీయ సమాచార సాంకేతిక సేవలు అందిస్తుంది. ఇది భారతదేశంలో నాలుగు పరోక్ష అనుబంధ సంస్థల ద్వారా పనిచేస్తుంది. అవి - (i) సదర్లాండ్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్; (ii) సదర్లాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్; (iii) అడ్వెంటిటీ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్; మరియు (iv) సదర్లాండ్ హెల్త్‌కేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్.
సి.సి.ఐ. జారీ చేసిన సవివరమైన ఆదేశాన్ని త్వరలో జతచేయటం జరుగుతుంది.
*****
(Release ID: 1789299)
Visitor Counter : 147