మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఉన్నత విద్యాసంస్థలు భారతీయ ఆవిష్కరణలు , స్టార్టప్ ల పర్యావరణ వ్యవస్థకు ఉన్నత విద్యాసంస్థలు దోహకారులుగా పనిచేస్తాయి - శ్రీ రాజ్కుమార్ రంజన్ సింగ్


విద్యా సంస్థల్లో సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను నిర్మించడం' పై ఇ- సింపోజియంను ప్రారంభించిన శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్

వ్యవస్థాపకత్వాన్ని జరుపుకోవడానికి , సృజనాత్మకతను ప్రోత్సహించడానికి దేశంలోని కీలక స్టార్టప్ లు, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ఇంక్యుబేటర్లు, ఫండింగ్ ఎంటిటీలు, బ్యాంకులు, విధాన కర్తలు మొదలైనవాటిని ఒకే వేదిక కింద తీసుకురావడం ఈ-సింపోజియం లక్ష్యం.

Posted On: 11 JAN 2022 5:34PM by PIB Hyderabad

భారతీయ సృజనాత్మకత ,స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థలో దోహదకారులుగా పనిచేయడానికి మన  ఉన్నత విద్యా సంస్థలకు అపారమైన సామర్థ్యం ఉందని విద్యా శాఖ సహాయ మంత్రి శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్  చెప్పారు. విద్యా మంత్రిత్వ శాఖ, డిపిఐఐటి, ఎఐసిటిఈ, ఎంఒఇ లోని ఇన్నోవేషన్ సెల్ నిర్వహించిన 'విద్యా సంస్థలలో ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం' పై ఇ- సింపోజియంను  శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ ప్రారంభించారు. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పై ఒక సినిమాను కూడా ఆయన ప్రారంభించారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక నూతన , ఆత్మ నిర్భర్ భార త్ ను నిర్మించాలన్న తన దార్శనికత ను పంచుకున్నారని, మన ఆవిష్క ర్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సపోర్టివ్ ఎకోసిస్టమ్,అంకిత భావం,ప్రయత్నాల ద్వారా దీనిని సాధించవలసి ఉంటుందని  శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అన్నారు. రేపటి భారత దేశం మన సంప్రదాయానికి సంబంధించిన ఉత్తమమైన వాటిని ఆధునిక ప్రపంచ దృక్పథంలో ఉత్తమమైనదిగా విలీనం చేయాలని ఆయన స్పష్టం చేసారు.

మన దేశం అతి పెద్ద ఉన్నత విద్యా వ్యవస్థలలో ఒకటిగా, ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్ గా ఉందని శ్రీ సింగ్ అన్నారు. నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా ఉండ డానికి మనం చేస్తున్న కృషి మన విద్యాసంస్థల్లో సృజనాత్మక స్పూర్తి , ఎంటర్ప్రెన్యూర్ షిప్ లేకుండా ఫలించదని ఆయన అన్నారు. భారతదేశంలోని విద్యా సంస్థలు తమ దృక్ఫధాన్ని మార్చి వాణిజ్యీకరణ , సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి దారితీసే ఉన్నత ప్రమాణాలు గల పరిశోధన, ఆవిష్కరణ ,వ్యవస్థాపకత్వానికి మద్దతు ఇచ్చే వాతావరణాన్ని సృష్టించాలని మంత్రి కోరారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా విద్యా మంత్రిత్వ శాఖ గుర్తించిన 75 స్టార్ట్-అప్ లను శ్రీ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అభినందించారు. విద్యార్థులు, అధ్యాపకుల ఈ 75 స్టార్ట్-అప్ లు సృజనాత్మక సాంకేతికతలను అభివృద్ధి చేశాయని, భారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. ఒక్కొక్క  స్టార్ట్-అప్ కు ఒక్కొక్కరికి రూ. 10.00 లక్షల వరకు ఆర్ధిక సహాయం లభించింది.  ఇంకా భాగస్వామ్య ఏజెన్సీల సహకారంతో మెంటరింగ్ ,ఇంక్యుబేషన్ సపోర్ట్ కూడా లభిస్తోంది.

భారత దేశంలో ప్రస్తుతం 2500 ఇన్నోవేషన్ సెల్ ఉన్నాయని, భవిష్యత్తులో అదనంగా మరో 5000 సెల్ ను చేర్చనున్నట్లు ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె. సంజయ్ మూర్తి తెలిపారు.  అంబాసిడర్ ప్రోగ్రామ్ కింద 50,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నామని, ఇది విద్యా రంగంలో భారీ మార్పు తెస్తుందని ఆయన తెలియజేశారు. ఇది సృజనాత్మకత సంస్కృతి అని, ఈ య్తరహా సంఘటనలు యువతను ముందుకు తీసుకువచ్చి కొత్త ఆలోచనలు, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ప్రేరేపిస్తాయని  ఆయన అన్నారు.

పాఠశాల విద్య , అక్షరాస్యత విభాగం కార్యదర్శి, అనితా కర్వాల్ మాత్లాడుతూ, భారతదేశ యువత  సమస్యా పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై ఎలా ఎక్కువ దృష్టి సారించాయో వివరించారు. వ్యక్తిత్వం పెంపొందించుకునే ఈవెంట్ లలో యువతులు భారీగా పాల్గొనడాన్ని ఆమె ప్రశంసించారు, ఇది ఎన్ ఇ పి 2020 సమాన విద్య దార్శనికత విజయానికి సంకేతమని అన్నారు.

చిన్న పిల్లలను  భవిష్యత్తు కు  సిద్ధంగా ఉంచటానికి వారిలో సృజనాత్మకత ,రిస్క్ తీసుకునే నైపుణ్యాల విలువను కూడా కర్వాల్ ప్రస్తావించారు. అటువంటి చొరవల ప్రాముఖ్యతను వివరిస్తూ, పిల్లలను బాధ్యతాయుత పౌరులుగా తీర్చి దిద్దడానికి  శాస్త్రీయ స్వభావం , తార్కిక ,విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి చేయడంపై మన దృష్టి ఉండాలని ఆమె పేర్కొన్నారు.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఈ) ఛైర్మన్ ప్రొఫెసర్ అనిల్ డి సహస్రబుధే మాట్లాడుతూ, ఈ-సింపోజియం పెట్టుబడి, మెంటరింగ్ మొదలైన ఆవిష్కరణ వ్యవస్థను నిర్మించడం పై ప్రధానంగా దృష్టి పెడుతుందని, ఈ సింపోజియం మన విద్యా సంస్థలను వారి క్యాంపస్ లలో ఆవిష్కరణ ఆధారిత  పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడానికి మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు. ఈ నూతన

ఆవిష్కరణల పండగ,  సంస్కృతి పండగ ఆత్మనిర్భర్ భారత్ కు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశించిన విధంగా ఐదు ట్రిలియన్ డాలర్ ల ఆర్థిక వ్యవస్థ సాధనకుమార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

పరిశ్రమ ఆంతరంగిక వాణిజ్య ప్రోత్సాహ క శాఖ కార్య ద ర్శి శ్రీ అనురాగ్ జైన్, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్ట ర్ అభయ్ జెరె కూడా ఈ కార్య క్ర మంలో పాల్గొన్నారు..

 

*****


(Release ID: 1789177) Visitor Counter : 152