రైల్వే మంత్రిత్వ శాఖ

2021: సౌత్ ఈస్టర్న్ రైల్వే (ఎస్ఈఆర్) అత్యధిక లోడింగ్ సామర్థ్యాన్ని సాధించింది.


స్థూల విభజన ఆదాయం (15,079 కోట్లు) మునుపటి సంవత్సరం కంటే 14.86శాతం ఎక్కువ వచ్చింది.

సంక్రైల్ -ఫ్రీట్ టెర్మినల్, కలైకుండ–-జార్గ్రామ్ 3వ లైన్ సెక్షన్ పూర్తయింది. ప్రారంభించడం జరిగింది

సౌత్ ఈస్ట్రర్న్ రైల్వే 74 రైళ్లు ఓబీహెచ్ఎస్ సేవలతో అందించడమైనది.

16 రోడ్ అండర్ బ్రిడ్జిలు 5 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు 2021లో నిర్మించడమైనది

Posted On: 08 JAN 2022 1:15PM by PIB Hyderabad

సరకు రవాణాపరంగా,  రాబడి పరంగా సౌత్ ఈస్టర్న్ రైల్వేకి 2021 ఒక గొప్ప సంవత్సరం. గత సంవత్సరంలో సౌత్ ఈస్ట్రర్న్ రైల్వే అనేక ముఖ్యమైన విజయాలను సాధించింది. అవి క్రింది విధంగా ఉన్నాయి:

1.హౌరా‌‌–ముంబై, మెయిన్‌లైన్‌లోని అందుల్-జార్సుగూడ సెక్షన్‌లో 130 కేఎంపీహెచ్ రైలు ఆపరేషన్ ప్రారంభమైంది.

2.2020–-21లో సాధించిన 175.4 ఎంటీ లోడ్ సౌత్ ఈస్ట్రర్న్ రైల్వేలోనే  అత్యధిక లోడ్ పనితీరు. 3.క్యాలెండర్ సంవత్సరం 2021 (నవంబర్ వరకు) స్థూల విభజజన ఆదాయం 15079 కోట్లు, ఇది మునుపటి సంవత్సరం కంటే 14.86శాతం ఎక్కువ.

4. త్రూపుట్ (నిర్గమాంశ)ను మెరుగుపరచడానికి బీఓఎక్స్ఎన్హెచ్ఎల్ కు చెందిన 67 రేక్‌లను 25టీ యాక్సిల్ లోడ్‌గా మార్చడమైనది.

5.స్వచ్ఛ భారత్ అభియాన్ కింద, 2021 సంవత్సరంలో గుర్తించన  74 రైళ్లకు సౌత్ ఈస్ట్రర్న్ రైల్వే  ఓబీహెచ్ఎస్ సేవలు అందించడం జరిగింది. 11 రేకుల సంప్రదాయ కోచ్‌లతో సహా 9 రైళ్లు ఎల్హెచ్బీకి మార్చడమైనది.

6.సంక్రైల్ ఫ్రీట్ టెర్మినల్  ఫేజ్–-1 పని పూర్తయింది  19.02.2021న    కేంద్ర రైల్వేశాఖ మంత్రి ద్వారా ప్రారంభించడం జరిగింది.

7. కలైకుండ-–ఝర్‌గ్రామ్ 3వ లైన్ సెక్షన్ ప్రారంభించడం జరిగింది. దీనిని 22.02.2021న ప్రధానమంత్రి ప్రారంభించారు.

8. రోడ్డు ట్రాఫిక్ను, భద్రతను మెరుగుపరచడానికి 16 రోడ్ అండర్ బ్రిడ్జిలు,  5 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం ద్వారా 2021 సంవత్సరంలో 32 లెవెల్ క్రాసింగ్‌లను మూసివేయడమైనది.

9. నాలుగు కొత్త ప్యాసింజర్ లిఫ్ట్లు, ఒక ఎస్కలేటర్ గత సంవత్సరంలో సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని వివిధ స్టేషన్లలో  ప్రారంభించడం జరిగింది.

10.గత సంవత్సరం 227.42 టీకేఎంతో పోలిస్తే 2021 సంవత్సరంలో 406.18 టీకేఎం విద్యుదీకరణ సాధ్యపడింది.

11.2021 సంవత్సరంలో సాధించిన 1064 లోకోల ఐఆర్  అన్ని జోన్లలో అత్యధిక ఎలక్ట్రిక్ లోకో హోల్డింగ్.

12. మార్చి'2021లో, సీకేపీ డివిజన్‌లోని రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో కొత్త ట్రాక్షన్ సబ్-స్టేషన్ (132కిలోవాట్/25కిలోవాట్) ప్రారంభించడం జరిగింది.

13.అంతేగాక11 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (బాల్తికూరి, గిధ్ని, చకులియా, కలుంగ, రాజ్‌గంగ్‌పూర్, జింక్‌పానీ, రంగ్రా, మురాడిహ్, సుదామ్‌డిహ్, బొకారో ఇ క్యాబియన్, లోధ్మా) ప్రారంభించడం జరిగింది.

14. మొత్తం  8 స్టేషన్లలో (ఝర్‌గ్రామ్, బాగ్దేహి, సర్దేగా, బల్రియాల్స్, గూడ్స్ యార్డ్, జార్సుగూడ ప్యాసింజర్ యార్డ్,  గోకుల్పూర్) మార్పులు చేయడమైనది.

15. ప్రయాణికుల భద్రత, క్షేమం కోసం 28 స్టేషన్లలో సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

సిగ్నలింగ్ వ్యవస్థలకు అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం 41 ఐపీఎస్ వ్యవస్థలు వ్యవస్థాపించడమైనది.

16.సౌత్ ఈస్ట్రర్న్ రైల్వే, సూపర్‌వైజరీ ట్రైనింగ్ సెంటర్  గ్రీన్ ఇనిషియేటివ్‌ల క్రింద, కేజీపీ ఫిబ్రవరి 2021 నెలలో ఐజీబీసీ గ్రీన్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ రేటింగ్ సిస్టమ్ "గోల్డ్" సర్టిఫికేషన్‌ను సాధించింది.

17.కోవిడ్ ఉపశమన చర్యల కింద, సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని వివిధ ఆసుపత్రులలో 1,43,825 కోవిడ్ వ్యాక్సిన్ డోసులను ఇచ్చారు.

18. సెంట్రల్ హాస్పిటల్ జీఆర్సీ వద్ద 1 ఎల్ఎంఓ ట్యాంక్ ఏర్పాటు చేయడమైనది.

19.రైళ్లలో ప్రయాణించే మహిళలు,  బాలికల  భద్రత కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే రాంచీ డివిజన్‌లో ప్రత్యేక లేడీ ఆర్‌పిఎఫ్ కమాండో బృందాన్ని ఏర్పాటు చేశారు.

20.బిస్రా–బోండాముండా (ఏ క్యాబిన్) (4.2 కిలోమీటర్లు) లైన్ను, సూపర్ క్రిటికల్ ప్రాజెక్ట్ మనోహర్‌పూర్-– బోండాముండ (ఏ) 3వ   (30 కిలోమీటర్లు) లైన్ను24.08.2021న ప్రారంభించడం జరిగింది.

21.  30.12.2021న ప్రారంభమైన బోండాముండా–-రాంచీ డబ్లింగ్  బాల్‌రింగ్– -లోధ్మా (9.9 కిలోమీటర్లు) లైన్ మొదలయింది.

ఎ. ముఖ్యమైన వంతెన 2021లో పూర్తయింది

22. బీఆర్నంబరు-124, [9X45.7(ఓడబ్ల్యూజీ)+1X18.3(సీజీ)] రూర్కెలా – జార్సుగూడ 3వ లైన్ (101.4 కిలోమీటర్లు)కి సంబంధించి పూర్తయింది.

23.ఝార్సుగూడ–-కెచోబహల్ (20 కిలోమీటర్లు)కి సంబంధించి నంబరు బీఆర్ నంబరు.21 (ఐబీ వంతెన) పరిధి (11X45.7 ఎం టీజీ) పూర్తయింది. యార్డ్ పునర్నిర్మాణ పనులు 2021లో పూర్తయ్యా

24.సంక్రైల్ గూడ్స్ టెర్మినల్ యార్డ్  మొదటిదశ- పని పూర్తయింది  19.02.2021న   కేంద్ర రైల్వేశాఖ మంత్రి ద్వారా ప్రారంభించడం జరిగింది.

25. 15 (11+4) రోజుల ఎన్ఐ తర్వాత 11.09.2021న జింక్‌పానీ యార్డ్  పునర్నిర్మాణ పనులు జరిగాయి.

26. ఝర్సుగూడ గూడ్స్ యార్డ్ ను 05.12.2021న ప్రారంభించడం జరిగింది. ఝర్సుగూడ ప్యాసింజర్ యార్డ్ ను 06.12.2021న ప్రారంభించడం జరిగింది.

27.ఎన్ఐ తర్వాత 3వ లైన్ వర్క్కు అనుగుణంగా కలుంగ యార్డ్ పునర్నిర్మాణ పని జరిగింది.

28. 2021లో క్వార్టర్స్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 29. భాగాలో 12 యూనిట్ల టైప్-–2 క్వార్టర్స్ పని (2020-21  పీబీ ఐటెమ్ నం. 544) పూర్తయింది.  ఓపెన్ లైన్‌కు అప్పగించబడమైంది.

29. హటియాలో 4 యూనిట్ల టైప్-ఐ–5 క్వార్టర్‌లు పూర్తయ్యాయి  ఏప్రిల్21లో నివాసితులకు కేటాయించారు. ఇతర ముఖ్యమైన పనులు 2021లో పూర్తయ్యాయి.

30.కాంతి / టీఎస్ఎస్- 18.03.2021న డబ్ల్యూబీఎస్ఈటీసీఎల్ ద్వారా టీఎస్ఎస్  132 కిలోవాట్ వైపు ఐసోలేషన్ సౌకర్యాలు పూర్తి అయ్యాయి.

31.గోవింద్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెం.1 ప్లాట్‌ఫారమ్ షెల్టర్ 21.07.21న పూర్తయింది. దిల్టు–మెచెడా (7.5 కేఎం) ఆటో సిగ్నలింగ్ పనులు 11.09.2021న పూర్తయ్యాయి.  ప్రారంభించడం కూడా జరిగింది.

32.ఎంసీఎల్ ప్రాజెక్ట్ కోసం సర్డేగా వద్ద అదనపు లోడింగ్ లైన్ పూర్తయింది  01.09.2021న ప్రారంభించడం జరిగింది.

2021 సంవత్సరానికి క్రీడా ప్రదర్శన

 అంతర్ జాతీయ ఛాంపియన్‌షిప్

1.నిక్కీ ప్రధాన్,  సలీమా టెటే (హాకీ) &  సుతీర్థ ముఖర్జీ (టేబుల్ టెన్నిస్) టోక్యో ఒలింపిక్స్2020లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.  ప్రధాన్ &  సలీమా టెటే ఛాంపియన్‌షిప్‌లో 4వ స్థానంలో నిలిచారు.

 

2.జావేద్ అలీ ఖాన్ ప్రపంచ బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. పతకాన్ని  కైవసం చేసుకున్నాడు

***



(Release ID: 1788845) Visitor Counter : 143