ప్రధాన మంత్రి కార్యాలయం
సాహిబ్ జాదా జోరావర్ సింహ్ మరియు సాహిబ్ జాదా ఫతేహ్ సింహ్ ల ప్రాణ సమర్పణాని కి గుర్తు గా డిసెంబర్ 26 వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా ప్రకటించిన ప్రధాన మంత్రి
Posted On:
09 JAN 2022 1:43PM by PIB Hyderabad
ఈ రోజు న శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు శుభప్రదమైన సందర్భం కావడం తో, సాహిబ్ జాదా జోరావర్ సింహ్, సాహిబ్ జాదా ఫతేహ్ సింహ్ ల ప్రాణసమర్పణానికి గుర్తు గా ఈ సంవత్సరం మొదలుకొని డిసెంబర్ 26వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటన చేశారు.
ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో -
‘‘ఈ రోజు న, శ్రీ గురు గోబింద్ సింహ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ తాలూకు మంగళప్రద సందర్భం లో, ఈ సంవత్సరం నుంచి డిసెంబర్ 26వ తేదీ ని ‘వీర్ బాల్ దివస్’ గా పాటించడం జరుగుతుంది అనే సంగతి ని మీకు తెలియజేస్తున్నందుకు నాకు గర్వం గా ఉంది. ఇది సాహిబ్ జాదే ల సాహసం తో పాటు న్యాయం కోసం వారు తీసుకొన్న సంకల్పానికి గాను దీటైనటువంటి శ్రద్ధాంజలి అవుతుంది.
సాహిబ్ జాదా జోరావర్ సింహ్ మరియు సాహిబ్ జాదా ఫతహ్ సింహ్ లను వారు ప్రాణాల తో ఉండగానే ఒక గోడ లో పూడ్చిపెట్టడం తో వారు ఇద్దరూ ప్రాణసమర్పణం చేసిన దినం నాడే ‘వీర్ బాల్ దివస్’ ను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ ఇద్దరు గొప్ప బాలకులు కూడాను ధర్మం యొక్క పవిత్ర సిద్ధాంతాల ను ఎడబాయడం కంటే మృత్యువు ను వరించారు.
మాత గుజ్ రీ, శ్రీ గురు గోబింద్ సింహ్ జీ మరియు నలుగురు సాహిబ్ జాదే ల వీరత్వం, వారి ఆదర్శాలు లక్షల కొద్దీ ప్రజల కు శక్తి ని ప్రసాదించేటటువంటివి. వారు అన్యాయానికి ఎన్నటికీ తలొగ్గలేదు. వారు అందరిని కలుపుకొనిపోయేటటువంటి మరియు సామంజస్యం నిండినటువంటి ఒక ప్రపంచం ఏర్పడాలి అని తలపోశారు. వారిని గురించి మరింత ఎక్కువ మంది తెలుసుకోవడం ఇకనైనా జరగవలసివున్నది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1788799)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam