ఆయుష్

మకర సంక్రాంతి రోజు గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ


- మకర సంక్రాంతి రోజున 75 లక్షల మంది సూర్య నమస్కారం చేస్తారు- ఈ దిశ‌గా ఆయుష్ మంత్రిత్వ శాఖ చొరవ

Posted On: 09 JAN 2022 12:40PM by PIB Hyderabad

కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ 14 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా 75 లక్షల మంది కోసం గ్లోబల్ సూర్య నమస్కార్ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సూర్యుడు ఉత్తరార్ధ గోళంలోకి వెళ్లే మకర సక్రాంతి రోజున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు.
ఈ శుభ త‌రుణాన్ని గుర్తు చేసుకొంటూ మ‌క‌ర సంక్రాంతి రోజున ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, సంపద మరియు ఆనందాన్ని ప్రసాదించినందుకు 'ప్రకృతి తల్లి'కి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ రోజున, 'సూర్య నమస్కారం'లో సూర్యునికి నమస్కారంగా అందించబడుతుంది, సమస్త జీవరాశులను పోషించేలా సూర్యుడు అందిస్తున్న ప్రతి కిరణానికి త‌గిన కృతజ్ఞతాభావాన్ని ప్రదర్శించేలా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. సూర్యుడు శక్తి ప్రాధమిక వనరుగా ఉంటూ ఆహార గొలుసు యొక్క కొనసాగింపుకు మాత్రమే కాకుండా, మానవుల మనస్సు మరియు శరీరాన్ని కూడా శక్తివంతం చేస్తున్నాడు. శాస్త్రీయంగా సూర్య నమస్కారం వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీవశక్తినీ మెరుగుపరుస్తుంది, ప్ర‌స్తుత మహమ్మారి వ్యాప్తి పరిస్థితులలో మన ఆరోగ్యానికి ముఖ్యమైనది.సూర్యుడి వల్ల మానవ శరీరానికి విటమిన్-డి అందించబడుతుంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య శాఖలలో విస్తృతంగా సిఫార్సు చేయబడింది. సామూహిక సూర్య నమస్కార్ ప్రదర్శన వాతావరణ మార్పు మరియు గ్లోబల్ వార్మింగ్ సందేశాన్ని తీసుకువెళ్లడానికి కూడా ఉద్దేశించబడింది. వాతావరణ స్పృహ తప్పనిసరి అయిన నేటి ప్రపంచంలో, రోజు వారీ జీవితంలో సోలార్ ఇ-ఎనర్జీ (గ్రీన్ ఎనర్జీ) అమలు చేయడం వల్ల భూగోళానికి ప్ర‌మాద‌క‌రంగా మారిన క‌ర్బన్ ఉద్గారాలను బాగా తగ్గిస్తుంది. ఇంకా, ఈ కార్యక్రమం మన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక వారసత్వంలో మకర సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సూర్య నమస్కార్ అనేది శరీరం మరియు మనస్సు యొక్క సమన్వయంతో 12 దశల్లో ప్రదర్శించబడే 8 ఆసనాల సమితి. ఇది ప్రాధాన్యంగా తెల్లవారుజామున నిర్వహించబడుతుంది.
నమోదు కోసం సందర్శించండి:
https://www.75suryanamaskar.com
https://yogacertificationboard.nic.in/suryanamaskar/
https://yoga.ayush.gov.in/suryanamaskar

 

******



(Release ID: 1788798) Visitor Counter : 202