భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రతిష్ఠాత్మక వారోత్సవం సందర్భంగా 10 జనవరి నుంచి 16 జనవరి 2022 వరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకోనున్న భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
6 బృహత్తర కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక; యాక్షన్స్ @75, అచీవ్‌మెంట్స్ @75, ఐడియాస్@75, రిసాల్వ్@75, స్వాతంత్య్ర పోరాటం
కార్యక్రమాలలో భాగంగా నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, సాంకేతిక ప్రదర్శనలు, యంత్ర సంబంధ ఎగ్జిబిషన్లు, సెమినార్లు, వెబినార్లు, నిపుణుల ఉపన్యాసాలు, యోగ, ధ్యాన సెషన్లు
Posted On:
09 JAN 2022 1:48PM by PIB Hyderabad
భారత దేశ ప్రజల ఘన చరిత్ర, సంస్కృతి, విజయాలను, 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని స్మరించుకునేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన చొరవ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఈ చొరవలో భాగంగా, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రతిష్ఠాత్మక వారోత్సవాలను జనవరి 10 నుంచి 16, 2022 వరకు జరుపుకోనుంది.
వృద్ధిని వేగవంతం చేసి, ఉద్యోగ కల్పనను సృష్టించే ఉత్పాదక వస్తువుల రంగం, ఆటోమోటివ్ సహా మొత్తం హరిత, సాంకేతికతో నడిచే, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగల ఉత్పత్తిరంగాన్ని అభివృద్ధి చేయడంపై భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ దృష్టి కేంద్రీకరించింది.
ఈ ప్రతిష్ఠాత్మక వారోత్సవం సందర్భంగా హైదరాబాద్, పూణె, ఝాన్సీ, భోపాల్, బెంగళూరు, హరిద్వార్ సహా దేశవ్యాప్తంగా తన సిపిఎస్ఇలు, స్వయంప్రతిపత్తిగలిగిన సంస్థల సమన్వయంతో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల సందర్భంగా పలు కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికను రూపొందించింది. ఈ కార్యక్రమాలు పూణెలోని ఆటోమేటివ్ రీసెర్చ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఆర్ఎఐ), ఆండ్రూ యూల్ & కంపెనీ లిమిటెడ్ (ఎవైసిఎల్), భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బిహెచ్ఇఎల్), బ్రెతవైట్ బర్న్& జెస్సోప్ కనస్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (బిబిజె), కోల్‌కతా, బ్రిడ్జ్ అండ్ రూఫ్ లిమిటెడ్ (బి&ఆర్), కోల్‌కతా, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సిసిఐ), సెంట్రల్ మాన్యుఫాక్చరింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సిఎంటిఐ), బెంగళూరు, ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ (ఇండియా) లిమిటెడ్ (ఇపిఐఎల్), ఫ్లూయిడ్ కంట్రోల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎఫ్‌సిఆర్ఐ), పాలక్కడ్, హిందుస్తాన్ మెషీన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్ఎంటి), హిందుస్తాన్ సాల్ట్స్ లిమిటెడ్ / సంబార్ సాల్ట్స్ లిమిటెడ్ (హెచ్ఎస్ఎల్/ ఎస్ఎస్ఎల్), తదితర ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.
దృష్టి యాక్షన్@ 75, ఐడియాస్@75, రిసాల్వ్@75, ఆవిష్కరణ, ఉత్పత్తి శ్రేష్ఠత, ఆత్మనిర్భర్ భారత్, పర్యావరణ & సుస్థిరత, స్వచ్ఛ భారత్, స్వాస్థ భారత్‌లలో పోరాటం, స్వాతంత్య్ర పోరాటంలో గుర్తింపు రాని వీరులు, అన్న ఇతివృత్తాలపై ఉండనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, సాంకేతిక ప్రదర్శనలు, యంత్ర సంబంధ ఎగ్జిబిషన్లు, సెమినార్లు, వెబినార్లు, నిపుణుల ఉపన్యాసాలు, యోగ, ధ్యాన సెషన్లు, ఆరోగ్య శిబిరాలు, పారిశుద్ధ్య డ్రైవ్‌లు, స్వాతంత్య్రపోరాటం, ఉద్యమం తదితరాలపై పోటీలు జరుగనున్నాయి.
వారంరోజుల పాటు సాగే వేడుకలలో కార్యక్రమాలు, కార్యకలాపాలలో మొత్తం ప్రభుత్వ వైఖరి, ప్రజల భాగస్వామ్యం లేదా జన్‌భాగీదారీపై దృష్టి అధికంగా ఉండనుంది. ఈ కార్యక్రమాలు, కార్యకలాపాల సందర్భంగా కోవిడ్-19కు ప్రోటోకాళ్ళకు అనుగుణమైన సామాజిక దూరం, పరిశుద్ధత పాటించేలా చూడాలని ఉత్తర్వులను జారీ చేశారు. ఈ కార్యక్రమాలను/ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దృశ్య మాధ్యమాలను ఉపయోగించడంపై దృష్టి పెడుతున్నారు.
****
(Release ID: 1788797)
Visitor Counter : 181