ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకా కార్యక్రమం తాజా సమాచారం -357వ రోజు
దేశవ్యాప్తంగా 150 కోట్లు దాటిన మొత్తం టీకా డోసులు
ఈ రోజు సాయంత్రం 7 వరకు 81 లక్షలకు పైగా టీకా డోసులు
Posted On:
07 JAN 2022 8:22PM by PIB Hyderabad
టీకా కార్యక్రమంలో దేశం ఈ రోజు సరికొత్త మైలురాయి దాటింది. దేశంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 150 కోట్లు ( 1,50,52,21,314) దాటింది.
సాయంకాలం ఏడు గంటల వరకు 81 లక్షలకు పైగా (81,50,9821)టీకా డోసులు పంపిణీ అయ్యాయి. రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందే సరికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
దేశంలో 150 కోట్లకు పైగా టీకా డోసులను వేయడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. టీకా కార్యక్రమం సరికొత్త మైలురాయి చేరడానికి సహకరించిన దేశ ప్రజలను అభినందిస్తూ ప్రధానమంత్రి ట్వీట్ చేశారు. 15 నుంచి 18 మధ్య వయస్సు గల వారికి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి దేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలికింది అని తన ట్వీట్ లో ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇదే సమయంలో నూతన సంవత్సరం మొదటి నెల మొదటి వారంలో 150 కోట్ల టీకా డోసులను పంపిణీ చేసి భారతదేశం చరిత్ర సృష్టించింది అని ప్రధానమంత్రి అన్నారు.
టీకా కార్యక్రమం 150 కోట్ల డోసులను దాటడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాలవీయ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. అత్యంత వేగంగా 150 కోట్ల స్థాయిని చేరుకునేలా కృషి చేసిన ఆరోగ్య కార్యకర్తలను మంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ కృషి చేస్తే లక్ష్యాలను సాధించవచ్చునని భారతదేశం రుజువు చేసిందని మంత్రి అన్నారు కాల కార్యక్రమం లక్ష్యాల మేరకు అమలు జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. టీకా తీసుకోవడానికి అర్హత ఉన్నవారంతా ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఆయన కోరారు.
మొత్తం పంపిణీ చేసిన టీకా డోసులు వివరాలు వయో వర్గాల వారీగా ఇలా ఉన్నాయి:
మొత్తం ఇప్పటిదాకా వేసిన టీకాల సమాచారం
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
10388770
|
రెండో డోస్
|
9736208
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
18386999
|
రెండో డోస్
|
16950940
|
15-18 వయో వర్గం
|
మొదటి డోస్
|
19964801
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
511433066
|
రెండో డోస్
|
348027006
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
195772551
|
రెండో డోస్
|
97490551
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
122085551
|
రెండో డోస్
|
97490551
|
మొత్తం మొదటి డోసులు
|
878031738
|
మొత్తం రెండు డోసులు
|
627189576
|
మొత్తం
|
1505221314 |
జనాభాలో ప్రాధాన్యత వర్గాల వారీగా ఈ రోజు సాగిన మొత్తం టీకాల కార్యక్రమం వివరాలు ఇలా ఉన్నాయి
తేదీ : జనవరి 7, 2022 (357 వ రోజు)
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
109
|
రెండో డోస్
|
3062
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
194
|
రెండో డోస్
|
9421
|
15-18వయోవర్గం
|
మొదటి డోస్
|
3006335
|
18-44 వయో వర్గం
|
మొదటి డోస్
|
1796130
|
రెండో డోస్
|
2188224
|
45-59 వయో వర్గం
|
మొదటి డోస్
|
157309
|
రెండో డోస్
|
603899
|
60 ఏళ్లు పైబడిన వారు
|
మొదటి డోస్
|
81377
|
రెండో డోస్
|
304922
|
మొత్తం మొదటి డోసులు
|
5041454
|
మొత్తం రెండు డోసులు
|
3109528
|
మొత్తం
|
8150982
|
కోవిడ్ నుంచి దేశ ప్రజలను రక్షించాలన్న లక్ష్యంతో టీకాల కార్యక్రమం అమలు జరుగుతోంది. దీనిని నిరంతరాయంగా
అత్యున్నత స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు.
***
(Release ID: 1788487)
Visitor Counter : 165