యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకంలో స్థానం సంపాదించిన - వింటర్ ఒలింపిక్స్‌కు వెళ్ళే మహమ్మద్ ఆరిఫ్ ఖాన్

Posted On: 07 JAN 2022 3:53PM by PIB Hyderabad

ఈ ఫిబ్రవరి లో చైనాలోని బీజింగ్‌లో జరిగే వింటర్ ఒలింపిక్స్ వరకు, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టి.ఓ.పి.ఎస్) కోర్ గ్రూప్‌లో ఆల్పైన్ స్కీయింగ్ అథ్లెట్ క్రీఆకారుడు మహమ్మద్ ఆరిఫ్ ఖాన్‌ ను చేర్చడానికి కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు చెందిన మిషన్ ఒలింపిక్ సెల్ ఎం.ఓ.సి) ఆమోదం తెలిపింది.

 

వింటర్ ఒలింపిక్స్‌ లో జరిగే "స్లాలోమ్ మరియు జెయింట్ స్లాలమ్"  పోటీల్లో ఖాన్ పాల్గొంటారు.  చైనాలో జరిగే బ్రహ్మాండమైన ఈ పోటీల్లో పాల్గొనే ముందు యూరప్‌ లో శిక్షణ పొందడానికి, అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి వీలుగా టి.ఓ.పి.ఎస్. కింద 17.46 లక్షల రూపాయల మొత్తాన్ని ఆయనకు చెల్లించడానికి కూడా ఆమోదించారు. ఖాన్ ప్రస్తుతం ఆస్ట్రియాలో శిక్షణ పొందుతున్నారు, అక్కడ ఆయన కోచ్ మరియు ఫిజియోథెరపిస్ట్ కూడా ఆయనతో పాటు ఉన్నారు.

ఖాన్ మొత్తం 35 రోజుల పాటు యూరప్ లో శిక్షణ పొందడానికి ఎం.ఓ.సి. ఆమోదించింది. ఆయన వింటర్ ఒలింపిక్స్‌ కు ఆయన అర్హత సాధించిన దగ్గర నుండి ఈ శిక్షణ ప్రారంభమయ్యింది.  గత ఏడాది డిసెంబర్‌ లో మోంటెనెగ్రో లో జరిగిన పోటీలో ఆయన "జెయింట్ స్లాలమ్‌" లో ఎంపికయ్యారు.  ఒక నెల ముందు, ఆయన "స్లాలోమ్ ఈవెంట్" లో పాల్గొనడానికి కూడా స్థానం సంపాదించారు. దీంతో, భారదేశం నుండి 2022 వింటర్ ఒలింపిక్ గేమ్స్‌ లో స్థానం సంపాదించుకున్న  మొదటి అథ్లెట్ కావడంతోపాటు, రెండు వేర్వేరు వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్‌ లలో నేరుగా పాల్గొనడానికి అవకాశం గెలుచుకున్న మొదటి భారతీయుడిగా ఖాన్ ప్రత్యేక గుర్తింపు పొందారు. 

 

గుల్మార్గ్ కు చెందిన ఈ అథ్లెట్, 2011 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌ లో జరిగిన దక్షిణాసియా వింటర్ గేమ్స్‌ లో "స్లాలోమ్ మరియు జెయింట్ స్లాలోమ్" పోటీల్లో రెండు బంగారు పతకాలు గెలుచుకున్నారు. 

*****



(Release ID: 1788471) Visitor Counter : 141