యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పుదుచ్చేరిలో జాతీయ యువజనోత్సవం 2022 లోగో ,మస్కట్ ను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ , పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందరరాజన్
దేశ నిర్మాణం లో కీలక శక్తి గా యువత అత్యంత ముఖ్యమైన పాత్ర ను కలిగి ఉంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
Posted On:
05 JAN 2022 7:34PM by PIB Hyderabad
ఈ నెల 12 నుంచి 16 వరకు పుదుచ్చేరిలో జరగనున్న 25వ జాతీయ యువజన ఉత్సవం (ఎన్ వై ఎఫ్ ) లోగో, మస్కట్ ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసాయి సౌందరరాజన్ ఈ రోజు ఆవిష్కరించారు. పుదుచ్చేరి శాసనసభ స్పీకర్ శ్రీ ఆర్.సెల్వమ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్.రంగస్వామి, విద్యా మంత్రి శ్రీ ఎ. నమశివయం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంద ర్భంగా శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, 2022 జాతీయ యువజన ఉత్సవానికి వేదిక గా పుదుచ్చేరిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎంపిక చేశారని తెలిపారు. యువజన ఉత్సవాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించి యువత ను ఉద్దేశించి ప్రసగిస్తారని ఆశిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. జాతీయ యువజన ఉత్సవం
ట్యాగ్ లైన్ -శక్షం యువ -శశక్త్ యువ అంటే సమర్థవంతమైన యువత- శక్తివంతమైన యువత, సమర్థవంతమైన యువత- బలమైన యువత - ను శ్రీ అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరించారు
శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, "21 వ శతాబ్దంలో భారతదేశం చాలా ముఖ్యమైన పాత్ర ను పోషించాల్సి ఉంది, ఆ దిశగా ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోంది. యువత మన కీలక శక్తి . దేశ నిర్మాణంలో అతిపెద్ద ,అత్యంత ముఖ్యమైన పాత్ర ను యువత కలిగి ఉంది. భారత దేశాన్ని ప్ర పంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ఇతర రంగాలలో
ప్రపంచ శక్తిగా మార్చడానికి మన యువ శక్తిని ఎలా ఉపయోగించాలనే దానిపై మనం దృష్టి సారించాలి. ఐటి నుండి స్టార్ట్-అప్ ల వరకు భారత దేశం సున్నిమైన శక్తిని ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది, వీటిలో మనం చాలా రాణించాము" అని అన్నారు.
ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుండి యువత పుదుచ్చేరిని సందర్శిస్తారని, గొప్ప కవి, దేశభక్తుడు, తత్వవేత్త , గొప్ప యోగా గురువు శ్రీ అరబిందో జీవితం నుండి , కవి సుబ్రమణ్య భారతి యువతకు ఆదర్శవంతమైన స్వామి వివేకానంద నుండి యువత ఎంతో నేర్చుకుంటారనే నమ్మకం ఉందని శ్రీ ఠాకూర్ అన్నారు. "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన జన్ భాగీదారీ కాబట్టి స్థానిక ప్రజలు ఉత్సాహంగా ఈ ఉత్సవంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము" అని మంత్రి తెలిపారు.
యూత్ ఫెస్టివల్ సందర్భంగా జరగనున్న కార్యక్రమాలను వివరిస్తూ, ఈ ఉత్సవం భారతదేశ సాంస్కృతిక వారసత్వం వైపు మనలను తీసుకు వెడతుందని కేంద్ర మంత్రి అన్నారు. పుదుచ్చేరి సాంస్కృతిక, పర్యాటక సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి ఈ ఫెస్టివల్ ఒక గొప్ప అవకాశం అని మంత్రి తెలిపారు. ఇది సాంస్కృతిక కోలాహలాన్ని అందిస్తుందని, ఈశాన్య, హిమాలయాలు మరియు కచ్ లోని సుదూర ప్రాంతాలకు చెందిన యువత ప్రతిభను బహిర్గతం చేస్తుందని శ్రీ అనురాగ్ ఠాకూర్ పునరుద్ఘాటించారు.
అంతకు ముందు శ్రీ అనురాగ్ ఠాకూర్ యూత్ ఉత్సవాల కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జనవరి 12 నుంచి 16 వ తేదీ వరకు ఏదో ఒక రాష్ట్రం సహకారంతో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జాతీయ యువజన ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రజా జీవితంలోని దాదాపు అన్ని సామాజిక-సాంస్కృతిక అంశాలను కవర్ చేయడానికి వివిధ కార్యకలాపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించే ప్రయత్నంలో దేశంలోని యువతను ఒకచోట చేర్చడం, ఔత్సాహిక యువ కళాకారులు తమను తాము వ్యక్తీకరించడానికి , తోటి కళాకారులతో సంభాషించడానికి , వివిధ విభాగాల నిపుణుల నుండి కొత్త కళా రూపాలను మరింత నేర్చుకోవడానికి అవకాశం కల్పించడం ఎన్ వైఎఫ్ ప్రాథమిక లక్ష్యం.
*******
(Release ID: 1787906)
Visitor Counter : 213